రామాయణం

ఏవ ముక్తస్తు బ్రహ్మర్షిరిదం వచన మబ్రవీత్
శోక సంతప్త హృదయాం స్వసారమివ దుఃఖితాం

నత్యాం త్యాజామి శబలే నాపి మేపకృతం త్వయా

ఏస్త త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః

న హి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః
బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవ చ

ఇయ మక్షౌహినీ పూర్ణా సవాజిరథ సఙ్కులా
హస్తి ధ్వజ సమాకీర్ణా తేనాసౌ బలవత్తరః

శబలకు మహర్షి ఈ విధంగా బదులిచ్చాడు : శబలా 1 నిన్ను నేను విడవ లేదు . నీవల్ల నాకు ఏ విధమైన అపకారం జరుగ లేదు . ఈ రాజు నిన్ను బల ప్రయోగం చేసి తీసుకొని వెడుతున్నాడు . ఇతనిని ఎదిరించడానికి నా బలం చాలదు . మీదుమిక్కిలి ఇతడు రాజు , బల దర్పాలతో కూడిన క్షత్రియుడు , పృథివికి ప్రభువు . ఒక అక్షౌహిని సేన ఇతని వెన్ను కాస్తున్నది. ఆ సేనలో రథాలు , హయాలు , గజాలూ ఎన్నో ఉన్నాయి . ఇతనిని ఎదిరించడానికి బలం చాలక నిన్ను రక్షించ లేక పోతున్నాను “. దీన హృదయంతో , శోకంతో పలికిన మహర్షి మాతలు విన్న కామధేనువు సవినయంగా జవాబిచ్చింది .

IMG_8551

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి