Monthly Archives: ఆగస్ట్ 2012

రామాయణం

ప్రతిగృహ్య తతో స్త్రాణి ప్రహృష్టవదనః శుచిః

గచ్ఛన్నేన చ కాకుత్థ్సో విశ్వామిత్రమథా బ్రవీత్
గ్రహీతాస్త్రోస్మి భగవన్ దురాధర్షః సురైరపి
అస్త్రాణాం త్వహచ్ఛామి సంహారం మునిపుఙ్గవ
ఏవం బ్రువతి కాకుత్థ్సే విశ్వామిత్రో మహామునిః
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్ సువ్రతః శుచిః
రామచంద్ర మూర్తి పవిత్రుడై విశ్వామిత్రుడిచ్చిన మహాస్త్రాలను స్వీకరించాడు . సవరక్షణార్థం మొదలుపెట్టిన ప్రయాణం సాగిస్తూ కౌశికునితో ” మీద్వారా నాకు మహాస్త్రాలు లభించాయి . ఇక దేవదానవులెవ్వరూ నన్ను జయించలేరు . నేను ధన్యత చెందాను . తమరు దయతో నాకు ఈ అస్త్రాలను ఉపసంహారం చేసే పధ్ధతిని నేర్పించండి ” అని వినయ విధేయతలతో కౌశికుణ్ణి కోరాడు . ప్రియమైన శిష్యుడు కోరిన వెంటనే ప్రీతితో అస్త్రాలను ఉపసంహరించడానికి వలసిన మంత్రాలను రామలక్ష్మణులకు ఉపదేశించాడు విశ్వామిత్రుదు .

మనదేశంలో గురువు కిచ్చే గౌరవం అపారం . గురువులు శిష్యులయెడ చూపే వాత్సల్యం కూడా తక్కువేమీ కాదు . విద్యలు నేర్పించడమే కాదు , శిష్యుల మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే శక్తి వారికి ఉండేది . మధురమైన శబ్దజాలంతో శిష్యుల కర్థమయ్యే విధంగా ఉపదేశించేవారు . శిష్యులలో విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగించేవారు .

నేర్చుకోవాలని ఉన్న సమయంలోనే నేర్పించే వారు . శిష్యులు నేర్చుకోవాలని అనుకునే విద్యలను మాత్రమే నేర్పించేవారు . అస్త్రవిద్యలను గ్రహించిన రాముడు , వాటి ఉపసంహారాన్ని నేర్చుకోవాలని అడిగితే , ఆనందంగా రామునికి నేర్పించాడు , అపరిమిత తేజస్కుడు కౌశికుడు .
గురు శిష్యుల అనుబంధం విద్యావృధ్ధికి కారణం . ఆ విద్యల కారణంగానే అయింది భారత దేశం , ఆ కాలంలో ప్రపంచానికి తలమానికం .

రామాయణం

జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః
ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాని రాఘవం
ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాఞ్జలయస్తదా
ఇమే స్మః పరమోదారాః కింకరాస్తవ రాఘవ
ప్రతిగృహ్య చ కాకుత్సః సమాలభ్య చ పాణినా
మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్
తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిం
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే

అస్త్రాలు రాముని కివ్వడానికి విశ్వామిత్ర మహర్షి ఆ అస్త్ర మంత్రాలను జపించాడు . మహర్షి చేత జపించబడడానికి అర్హత కలిగిన ఆ అస్త్రాలు రాముని చేరి అతనిని సేవించడం మొదలు పెట్టి , రఘురామా ! ఇక నుండి మేమందరము నీ కింకరులము , నీ ఆజ్ఞానువర్తులము అని పలికాయి . ఆ విధంగా పలికిన ఆ అస్త్ర దేవతలను స్పృశించి ” మీరు ఇకనుండి నా మనసులో నిలిచి ( తలచినప్పుదు సహాయానికి రావలసిందని ) , ఉండమని ” కోరాడు .

అస్త్రాలను గ్రహించిన రామచంద్రుడు సంతోషంతో విశ్వామిత్రునికి అభివాదం ( నమస్కారం) చేసి , ప్రయాణానికి సిధ్ధమయ్యాడు .

రామాయణం

తామసం  నరశార్దూల  సౌమనం  చ మహాబల
సంవర్ధం  చైవ దుర్ధర్షం  మౌసలం  చ నృపాత్మజ
సత్యమస్త్రం  మహాబాహో  తథా మాయాధరం  పరం
ఘోరం  తేజప్రభం  నామ  త్వష్టురస్త్రం  సుదామనం
దారుణం  చ భగస్యాపి  శితేషు మథ మానవం

నరశార్దూలుడవైన  రఘుకుల  తిలకా !   తామస   సౌమనాస్త్రాలను  ,  సంవర్ధాస్త్రాన్ని  ,మౌసలాస్త్రాన్ని , సత్యాస్త్రాన్ని ,  మాయాధరాస్త్రాన్ని ,   శత్రువుల తేజాన్ని  అపహరించే    తేజః  ప్రభ  అనబడే   అస్త్రాన్ని ,  సోమదేవతకు సంబంధించిన  శిశిరాస్త్రాన్ని  ,     సుదామాస్త్రాన్ని ,  భగమహర్షికి   చెందిన   శితేషువును ,మానవాస్త్రాన్ని  గ్రహించు.

ఏతాన్  రామ మహాబాహో  కామరూపాన్  మహాబలాన్
గృహాణ  పరమోదారాన్  క్షిప్రమేవ  నృపాత్మజ
స్థితస్తు   ప్రాఙ్ముఖో   భూత్వా  శుచిర్మునివర  స్తదా
దదౌ  రామాయ  సుప్రీతో  మంత్రగ్రామమనుత్తమం .
సర్వసంగ్రహణం  యేషాం  దైవతైరపి   దుర్లభం
తాన్యస్త్రాణి  తదా  విప్రో  రాఘవాయ  న్యవేదయత్

నేను నీకొసగే  అస్త్రాలు   మిక్కిలి  బలంతో కూడుకొన్నవి .  ఇష్టమైన  రూపాలు  ధరించే  సామర్థ్యం   గలవి . చాలా గొప్పవి . ఈ అస్త్రాలను   ఆలశ్యం  చేయకుండా  గ్రహించు  అని పలికి  విశ్వామిత్ర  మహర్షి  పూర్వాభి  ముఖుడై ( తూర్పు దిశగా  తిరిగి ) ,  పరిశుధ్ధుడై (ఆచమనం  చేస్తే పరిశుధ్ధత లభిస్తుంది )  ,   ప్రసన్న  చిత్తంతో  అస్త్రమంత్రాలను  రామునికి  ఉపదేశించాడు .

ఇటువంటి  అపారమైన   మహిమగల   అస్త్రాలను  పొందడం  దేవతలకు కూడా  దుర్లభమట . ఏవిధమైన  దాపరికం  లేకుండా  వేలకొలది  సంవత్సరాలు  తపస్సు చేసి ,  ఆ  తపశ్శక్తితో   సంపాదించిన  అస్త్రాలను  రాముని  పరం  చేసాడు  విశ్వామిత్రుడు  .  శిష్యులమీద  నిజమైన  గురువులకు  అపారమైన  ప్రేమ  కదా !  అందులో  తన  యజ్ఞాన్ని  సఫలంగా నిర్వర్తించడానికి  సహాయం  చేయడానికి  వచ్చిన  శిష్యుడు  కదా ! తేజశ్శాలి  ,  తపోమూర్తి , పట్టుదలకు  మారుపేరు , తలపెట్టినదానిని  సాధించకుండా  వదలిపెట్టని  మహనీయుడు ,  మనందరికీ   ఆదర్శపురుషుడు    అయిన  ఆ    మహనీయునికివే  శత సహస్ర  వందనాలు .

గాంధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః
ప్రస్వాపనప్రశమనే దద్మి సౌరం చ రాఘవ

దర్పణం శోషణం చైవ సంతాపనవిలాపనే
మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా

పైశాచమస్త్రం దయితం మోహనం మామ నామతః
ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః

 

మైకాన్ని కలిగించే గాంధర్వాస్త్రాన్నీ , మైకాన్ని తొలగించే మానవాస్త్రాన్నీ వెలుగునిచ్చే సౌరాస్త్రాన్నీ , దర్పణ , శోషణ, సంతాపన , విలాపనాస్త్రాలను నీకిస్తాను . ( శత్రువుల దర్పాన్ని తొలగించేది దర్పణాస్త్రం , శోష తెప్పించేది శోషణాస్త్రం , దుఃఖాన్ని కలిగించేది సంతాప నాస్త్రం  , బాధతో ఏడ్పించేలా చేసేది విలాప నాస్త్రం) . మన్మథునికిష్తమైన  మదనాస్త్రం   , పిశాచాలకు  ఇష్టమైన   మోహనాస్త్రం   ఇక నీవి .రాఘవునితో ఈ అస్త్రాలను గ్రహించమన్నాడు మహామహితాత్ముడు కౌశికుడు .

రామాయణం

వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామ నామతః
అసిరత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ

 

వైద్యాధర మనే మహాస్త్రాన్నీ , నందకమనే అత్య్త్తమమైన ఖడ్గాన్నీ నీ పరం చేస్తాను .

విష్ణుమూర్తి    పంచాయుధాలలో  నందక  నామంతో   విలసిల్లేది   ఖడ్గం . రాముని ఖడ్గా  న్నే తిరిగి  రామునికి   ప్రసాదించాడేమో మహానుభావుడు  విశ్వామిత్రుడు ( రాముడు విష్ణు మూర్తి    అంశ ) . విష్ణుమూర్తి   ఆయుధమై   న   నందకాన్ని స్తోత్రం చేయడం పుణ్యదాయకం . పంచాయుధ  స్తో   త్రంలో నందకం  ఈ  కింద   చెప్పిన   విధంగా   స్తు   తి ంచబడ్డది .

రక్షోసురాణాం కఠినోగ్ర   కంఠ
చ్ఛేద క్షరక్షోణిత దిగ్ధధారం
తం    నందకం   నామ   హరేః   ప్ర   దీప్తం
ఖడ్గం   సదాహం   శరణం   ప్ర   దీప్తే .

రామాయణం

అస్త్రం హయ శిరోనామ క్రౌఞ్చ మస్త్రం తథైవ చ
శక్తిద్వయం చ కాకుత్స దదామి తవ రాఘవ

కఙ్కాళం ముసలం ఘోరం కాపాలమథ కంకణం
ధారయంత్యసురా యాని దదామ్యేతాని సర్వశః

కాకుత్సా ! హయశిరస్సు అనబడే అస్త్రాన్నీ , క్రౌంచాస్త్రాన్నీ కూడా నీ వశం చేస్తాను . వాటితోబాటు రెండు శక్తులను నీకిస్తాను .
రాక్షసులుపయోగించే అస్త్రాలు : కఙ్కాళము , ముసలము , కపాలము , కంకణము మొదలగువాటిని కూడా నీకిస్తాను .

శత్రువులుపయోగించే అస్త్రాల గురించి తెలుసుకోవడం , వాటిని తమ అమ్ములపొదిలో చేర్చుకోవడం ముఖ్యం . శత్రువుల ఆయుధాలూ , వాటికంటే మేలైన ఇతర ఆయుధాలూ కలిగి ఉండడం యుధ్ధంలో విజయకేతనాన్ని ఎగురవేయడానికి సహకరిస్తాయి . అందుకే రాక్షసుల ఆయుధాలను శ్రీరాముని వశం చేయడానికి నిశ్చయించుకున్నాడు విశ్వామిత్రుడు .

రామాయణం

ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామనామతః
వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ

శిఖరమనే పేరుగల ఆగ్నేయాస్త్రాన్నీ , ప్రథన అనే పేరుగల వాయవ్యా స్త్రాన్నీ కూడా నీకు ఇస్తాను . దోషాలు దరిజేరని రఘురామా ! శిఖరం అగ్నిదేవునికి ఇష్టమైన అస్త్రం .

ఈ అస్త్ర మంత్రాలు ఈ రోజున కూడా లభ్యాలు . ఉదాహరణకు వాయవ్యాస్త్రం వశపడాలని కోరుకునే వారు ” అస్య శ్రీ వాయవ్యాస్త్ర మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః మహాభూతో వాయుర్ దేవతా – యాం బీజం -యాం శక్తిః –యాం కీలకం — వాయవ్యాస్త్ర ప్రయోగే వినియోగః ” అని సంకల్పించి , తగిన అంగన్యాస కరన్యాసాలు కావించి , అస్త్రాయ ఫట్టనే మంత్రంతో దిగ్బంధించి

కృష్ణవాహమధిరుహ్య యాయినం
భుజైశ్చతుర్భిః జగదాది కారణం
దేవాదిదేవం సకలారిషూదనం
చైతన్య రూపం ప్రణమామి వాయుం

అని వాయుదేవుణ్ణి ధ్యానం చేసి
” ఓం ! ఆవాయ వ్యయా వాయవ్యోమా వాయ వ్యయావాయ వ్యోమా వాయవ్యయా వాయవ్యోం ఇతి ” అనే వాయవ్య మంత్రాన్ని మూడు వారాలు జపించాలి .
గురుముఖతః ఈ మంత్రాని అభ్యసించి , త్రికరణ శుధ్ధితో జీవించి , నియమయుక్తంగా జపించే మనిషికి మాత్రమే వాయవ్యాస్త్రం వశమవుతుంది . అస్త్రాలు వశపడాలంటే సత్ప్రవర్తన అవసరం . మంత్రాన్ని బోధించే సద్గురువులూ , లోకకళ్యాణమే ధ్యేయంగా కలిగిన శిష్యులూ కరువయ్యారు .

రామాయణం

అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన
దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా

రామునికి ప్రసాదించిన అస్త్రాలలో రెండు పిడుగుల పేర్లు చెప్పబడ్డాయి . ఒకటి శుష్కము . రెండవది ఆర్ద్రము . శుష్కమంటే ఎండిపజేసేదనీ , ఆర్ద్రమంటే తడిపేదనీ అర్థం . భయంకరమైన మేఘాలను సృష్టింపజేసే మంత్రాలివి . పృకృతిని వేడెక్కించి , వాతావరణాన్ని ఎండిపోయేలా చేసి , మెరుపులతో శత్రువులను భయభ్రాంతులను చేసి లొంగదీసుకునే అస్త్రమొకటైతే , అంతులేని వర్షంతో భూమిని తడిపి , వరదలను సృష్టించి శత్రుసంహారం చేసే అస్త్రమింకొకటి . ఈ పిడుగును ” క్లౌడ్ బర్స్ట్ ” సృష్టించే అస్త్రమని అని అనుకోవచ్చునేమో .

ఇవే కాక పైనాకమనే అస్త్రాన్నీ , నారాయణాస్త్రాన్నీ మంత్ర సహితంగా రామునికిచ్చాడు విశ్వామిత్రుడు . పినాకపాణి అంటే శివుడు . అతని అస్త్రం పైనాకాస్త్రం . పినాకమని శివుని వింటికీ , త్రిశూలానికీ పేరు . మట్టితో కూడిన వానకు కూడా పినాకమని పేరు .

 

రామాయణం

గదే ద్వే చైవ కాకుత్స మోదకీ శిఖరీ ఉభే
ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ
ధర్మపాశమహం రామ కాలపాశం తథైవచ
పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమం
నరులలో ఉత్తముడవైన రఘురామా 1 కాంతితో ప్రజ్వలిస్తున్న మోదకి , శిఖరి అనబడే రెండు గదలను నీకు ప్రసాదిస్తాను . ధర్మపాశాన్ని , కాలపాశాన్ని , వారుణ పాశాన్ని , ఉత్తమమైన వారుణాస్త్రాన్నీ కూదా నీకు దత్తం చేస్తాను.

విశ్వామిత్రుడు రామునికిస్తానన్న అస్త్రాలు వివిధ రకాలు . అన్ని రకాల ఆయుధాలు ప్రస్తుతం ఉన్నాయా అన్న అనుమానం రాక మానదు . ప్రతి అస్త్రానికీ పేరు పెట్టడం కూడా కష్టమైన పనే .

దణ్డచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ
ధర్మచక్రం తతోవీర కాలచక్రం తథైవచ
విష్ణుచక్రం తథాత్యుగ్ర మైంద్రమస్త్రం తథైవచ
వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐ షీకమపి రాఘవ
దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమం

విశ్వామిత్ర మహర్షి  తను రామచంద్రునకు ఇవ్వదలచిన అస్త్రాలను వివరిస్తున్నాడు . “గొప్పవైన భుజస్కంధాలతో వర్ధిల్లుతున్న రఘురామా ! దణ్దచక్రం , ధర్మచక్రం , కాలచక్రం విష్ణుచక్రం అనబడే చక్రాలనూ , ఐంద్రాస్త్రాన్నీ , వజ్రాస్త్రాన్నీ , ఐషీకాస్త్రాన్నీ , బ్రహ్మశిరోనామకాస్త్రాన్నీ , అన్నిటికన్నా మిన్న అయిన బ్రహ్మాస్త్రాన్నీ , పరమ శివుని ఆయుధమైన శూలాన్నీ కూడా నీకు ప్రసాదిస్తాను “.

మహర్షి అందించిన ఈ మహాస్త్రాల  మంత్రాలు మనకు ఈ రోజు కూడా లభ్యం . అయితే ఉపాసనా విధానాలు గురుముఖంగా నేర్చుకునే అవకాశం లేదు . నేర్చుకునే   సామర్థ్యం కలవారూ , నేర్పించడానికి విషయం తెలిసిన మహనీయులూ మనకు కరువయ్యారు .

 

               

SUDARSANA  CHAKRA

Taken from : http://devoteesvaishnavas.blogspot.in/2011/07