Monthly Archives: జనవరి 2011

రామాయణం

ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ ,
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తమహాపథా .

ఇరవై మూడు శ్లోకాలుండే ఈ పంచమ సర్గలో అయోధ్యాపుర వర్ణన చేయబడింది . వేల సంవత్సరాల క్రితం నిర్మింప  బడ్డ  ఈ నగర వైభవం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు . పన్నెండు యోజనాల పొడవు  మూడు యోజనాల వెడల్పు  గల ఈ నగరంలో  వీధులు విశాలంగా , శోభాయమానంగా ఉండేవి . కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం ఒక యోజనం తొమ్మిది మైళ్ళు లేక పదిహేను కిలోమీటర్లు . బ్రిటీషు వారి లెక్క ప్రకారం అయిదు మైళ్ళు లేక ఎనిమిది కిలోమీటర్లు .

రామాయణం

కోసలో నామ ముదితస్ఫీతో జనపదో మహాన్
నివిష్టః సరయూ తీరే ప్రభూత ధన ధాన్యవాన్.

సరయూ నదీతీరంలో విశాలమైన కోసల రాజ్యం ధన ధాన్యాలతో తులతూగుతుండేది. అచటి ప్రజలందరూ హాయిగా , సంతోషంగా జీవితం గడుపుతూ ఉండేవారు.

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోకవిశ్రుతా
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం

ఈ కోసల దేశానికి రాజధాని అయోధ్య . మను చక్రవర్తి సంకల్ప బలంతో నిర్మించబడ్డ ఈ నగరం   యోధులచే జయింపరానిది అంటే శత్రు దుర్భేద్యమైనది .

రామాయణం

సర్వాపూర్వమియం యేషామా సీత్కృత్స్నా వసుంధరా
ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం

యేషాం స సగరో నామ సాగరో యేనఖానితః
ష్ష్టిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్

తదిదం వర్థయిష్యామి సర్వం నిఖిలమాదితః
ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా

ఒకానొక కాలంలో ధరాతలమంతా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజుల అధీనంలో ఉండేది. ఆరాజులలో ముఖ్యుడు సగర మహారాజు.  సాగరాన్నే  త్రవ్వించిన ఘనుడు  సగరుడు. సగరుడు యుధ్ధానికి బయలుదేరే సమయంలో  అరవై  వేలమంది కుమారులు అతనిని అనుసరించే వారు. ఆ వంశంలో పుట్టిన మహాత్ముల కథ రామాయణం.
రామాయణాన్ని నేను లోకంలో ప్రవర్తింప చేస్తాను. అసూయ పడకుండా సావధాన చిత్తులై వినండి అని వాల్మీకి మహర్షి రామాయణానికి ఉపోద్ఘాతం చేసాడు.

రామాయణ కథ ఇక్కడనుండి ప్రారంభమవుతుంది.

రామాయణం

తతస్తు తౌ రామవచః ప్రచోదితా
వగాయతాం మార్గవిధానసంపదా
స చాపి రామః పరిషద్గతః శనై
ర్బుభూషయా సక్తమనాబభూవ హ
దేశీ విధానమనీ , మార్గ విధానమనీ గానం రెండు విధాలు . మార్గ విధానం దేశమంతా ఒకే రకంగా ఉంటుంది. దేశీ విధానం ప్రాంతీయ సంగీతం లాగా , ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది . లవ కుశులు మార్గ విధానాన్ని అనుసరించి గానం చేసారు. కలత చెందిన మనస్సును సేద తీర్చేదిగా ఉందా గానం . జలజలా ప్రవహించే ఆ సంగీత ధారలో మునిగి ముద్దైపోయాడు శ్రీరామచంద్ర మూర్తి . మనస్సుకు శాంతి లభించిది.లవకుశుల గానం విన్న పురప్రజలందరి మనస్థితి : ” ఊయలలూగినదోయి మనసే ,తీయని ఊహల  తీవెల పైన ”  .

మనస్సు వికలమైనప్పుడు సంగీతాన్ని ఆస్వాదించడం మనకు కూడా అలవాటే కదా . సంగీతం కలతచెందిన హృదయాన్ని శాంతపరిచి కన్నీటిని తుడిచివేస్తుంది. ఇది మనకందరకూ అనుభవైకవేద్యం.

 

ఈ శ్లోకంతో నాలుగవ సర్గ సమాప్తమౌతుంది .

రామాయణం

శ్రూయతామిద మాఖ్యానమనయోర్దేవవర్చసోః

విచిత్రార్థపదం సమ్యగ్గాయకౌ తావచోదయత్

తేజస్కులైన ఈ బాలకులు విచిత్రార్థాలతో గానం చేసే ఆఖ్యానాన్ని శ్రధ్ధగా విందామని తమ్ములతో అని , కుశలవులను  రామాయణాన్ని గానం చేయమని ప్రేరేపించాడు .

తౌ చాపి మధురం రక్తం స్వంచితాయతనిస్వనం ,
తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతాం .
హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయానిచ ,
శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జనసంసది .

రాజకుమారులు రమ్యంగా  , రాగయుక్తంగా రామాయణాన్ని గానం చేసారు. పలుకులు స్వచ్ఛంగా , ఉచ్చారణా దోషాలు లేకుండా పలుకడంతో వినేవారందరకూ అర్థం స్పష్టంగా తెలిసింది. పాట పాడే వారికి ఉండాల్సిన ప్రథమ గుణమిది . శ్రుతి లయ లతో కూడిన గానం ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసింది .

ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
కుశీలవౌ చైవ మహాతపస్వినౌ
మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే
మహానుభావం చరితం నిబోధత

రామచరితం రాముని హృదయానికి హత్తుకుపోయింది. మహాతపస్వినులు , మధుర గాయకులు , మనోల్లాసం కలిగించే మహాగాయకులు వీరు. సావధానచిత్తులై వీరి గానం ఆలకించండని తన ప్రజలను కోరాడు .

రామాయణం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే .

రామ నామం మూడు సార్లు జపిస్తే సహస్రనామ ఫలం లభిస్తుందని పరమ శివుడే పార్వతికి చెబుతాడు . లవకుశులు రామాయణాన్ని గానం చేస్తూ రామనామాన్ని ఎన్నో మార్లు తలచి ఉండాలి. మరి పుణ్య ఫలం లభించాలి కదా . రామ దర్శనమే అయ్యింది. రాముడే స్వయంగా పాడమని ఆజ్ఞాపించాడు. రాముడు తన ప్రేమపాత్రులకు దర్శన భాగ్యం ,  ఇంకా ఎక్కువ భక్తులైతే సంభాషణా సౌభాగ్యం , అత్యంత ఆప్తులైతే గాఢ పరిష్వంగన భాగ్యం  ( కౌగిలించుకొంటాడు)  కల్పిస్తాడు. లవకుశులకు సంభాషణా భాగ్యం లభించింది. ఒక్క హనుమ కు మాత్రం రాముని బిగికౌగిలి దొరికింది. అహో ! హనుమ భాగ్యం ఏమని చెప్పేది .

రామనామం ఏ విధంగా సహస్రనామ ఫలాన్నిస్తుందో చూడండి:
రామ శబ్దంలో “ర” అంతస్థాలలో  రెండో అక్షరం (య , ర , ల , వ )   .
రెండో శబ్దం ” మ ” ఓష్ఠ్యాలలో  ( ప ,ఫ , బ , భ , మ ) లలో అయిదవది.
ఈ రెండింటినీ గుణిస్తే (2*5 =10) .
రామ శబ్దం మూడు మార్లు పలికితే ( 10 * 10 *10 =1000 )
అందువల్లే రామనామం సహస్రనామ ఫలాన్నిస్తుందని ఒక చమత్కృతి.
ఈ విషయం ” అవతార తత్త్వ వివేచన అనే పుస్తకంలో కొత్తపల్లి వీరభద్ర రావు ” గారు వివరించారు.

రామాయణం

ప్రశస్యమానౌ   సర్వత్ర   కదాచిత్తత్ర   గాయకౌ
రథ్యాసు రాజమార్గేషు  దదర్శ  భరతాగ్రజః

స్వవేశ్మ చానీయ తతో భ్రాతరౌ స కుశీలవౌ
పూజయామాస  పూజార్హౌ  రామః  శత్రునిబర్హణః

లవ కుశులు మధురమైన రామకథను ప్రజలందరకూ వినిపించే ఉద్దేశ్యంతో , అయోధ్యా నగర వీధుల్లో , రాజమార్గాల్లో  రామాయణాన్ని గానం చేసారు. ప్రజలందరి ప్రశంసలనూ అందుకొన్నారు . పాడుతూ , పాడుతూ  రామాయణానికి  మూలమైన రాముని కళ్ళలో పడ్డారు. రఘుకుల తిలకుడు వారిని సగౌరవంగా రాజమందిరానికి ఆహ్వానించాడు.

ఆసీనః కాంచనే దివ్యే స  చ   సిమ్హాసనే  ప్రభుః
ఉపోపవిష్టః  సచివైర్భ్రాతృభిశ్చ   పరంతపః

దృష్త్వా తు రూపసంపన్నౌ తావుభౌ నియతస్తదా
ఉవాచ లక్ష్మణం రామః  శత్రుఘ్నం భరతం తదా

తమ్ములు పరివేష్టించి ఉండగా  బంగారు సింహాసన మెక్కిన రామయ్య తన సోదరులతో లవకుశుల గానం శ్రధ్ధగా వినమన్నాడు.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే .

రామ నామం మూడు సార్లు జపిస్తే సహస్రనామ ఫలం లభిస్తుందని పరమ శివుడే పార్వతికి చెబుతాడు . లవకుశులు రామాయణాన్ని గానం చేస్తూ రామనామాన్ని ఎన్నో మార్లు తలచి ఉండాలి. మరి పుణ్య ఫలం లభించాలి కదా . రామ దర్శనమే అయ్యింది. రాముడే స్వయంగా పాడమని ఆజ్ఞాపించాడు. రాముడు తన ప్రేమపాత్రులకు దర్శన భాగ్యం ,  ఇంకా ఎక్కువ భక్తులైతే సంభాషణా సౌభాగ్యం , అత్యంత ఆప్తులైతే గాఢ పరిష్వంగన భాగ్యం  ( కౌగిలించుకొంటాడు)  కల్పిస్తాడు. లవకుశులకు సంభాషణా భాగ్యం లభించింది. ఒక్క హనుమ కు మాత్రం రాముని బిగికౌగిలి దొరికింది. అహో ! హనుమ భాగ్యం ఏమని చెప్పేది .

రామనామం ఏ విధంగా సహస్రనామ ఫలాన్నిస్తుందో చూడండి:
రామ శబ్దంలో “ర” అంతస్థాలలో  రెండో అక్షరం (య , ర , ల , వ )   .
రెండో శబ్దం ” మ ” ఓష్ఠ్యాలలో  ( ప ,ఫ , బ , భ , మ ) లలో అయిదవది.
ఈ రెండింటినీ గుణిస్తే (2*5 =10) .
రామ శబ్దం మూడు మార్లు పలికితే ( 10 * 10 *10 =1000 )
అందువల్లే రామనామం సహస్రనామ ఫలాన్నిస్తుందని ఒక చమత్కృతి.
ఈ విషయం ” అవతార తత్త్వ వివేచన అనే పుస్తకంలో కొత్తపల్లి వీరభద్ర రావు ” గారు వివరించారు.

రామాయణం

ఆశ్చర్యమిద మాఖ్యానం మునినా సంప్రకీర్తితం
పరం కవీనా మాధారం సమాప్తం చ యథాక్రమం.

అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ
ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం

రామాయణం ఒక క్రమ పధ్ధతిలో రచించిన కావ్యం . భవిష్యత్ కవులందరికీ ఆధారం , మార్గదర్శకం. వీనులకు విందుగావించడమే కాకుండా ఆయుస్సును పెంచుతుందట , పుష్టిని కలిగించుతుందట.
నిజమే కదా .మనం ఆనందంగా ఉంటే ఆరోగ్యం కరతలామలకమౌతుంది. సంగీత సాహిత్యాల   సమ్మేళనమైన రామాయణం , మనస్సుకానందం ,శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనడంలో   ఆశ్చర్యమేముంది.

రామాయణం

తత్ శృత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణా
సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతాః

తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః
ప్రశశంస్తుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ

శ్రధ్ధగా రామ కథను విన్న ఋషులు పులకితులై పోయారు. బాగుంది , బాగుంది అని మెచ్చుకున్నారు. రచించిన వాల్మీకినీ గానంచేసిన లవకుశులనూ ప్రశంసలతో ముంచివేశారు .

అహో గీతస్య మాధుర్యం శ్లొకానాం చ విశేషతః
చిరనిర్వృత్త మప్యే తత్ప్రత్యక్ష మివ దర్శితం.

ప్రవిశ్య తావుభౌ సుష్టు భావం సమ్యగగాయతాం
సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసంపదా

లవకుశులు స్వర బధ్ధంగా భావావేశంతో గానం చేస్తున్నారు. మునులు మెచ్చుకుంటున్నారు. సమయం స్తంభించి ఉంటుంది . పృకృతి పులకించి ఉంటుంది . సమీపంలో ఉన్న పశు పక్ష్యాదులు కూడా కదలకుండా , మెదలకుండా రామకథను ఆస్వాదించి ధన్యత చెంది ఉంటాయి.

ప్రీతః కశ్చిన్ముని స్తాభ్యాం సంస్థితః కలశం దదౌ
ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభయాం మహాయశాః

ఎవరైనా మీకు చాలా సంతోషం కలిగించే పని చేస్తే మీరేమిస్తారు ? మహర్షులు మాత్రం తమ సర్వస్వం , అదే కమండలాలూ, నారచీరల లాంటివి ప్రేమతో మున్యాశ్రమ బాలకులైన లవకుశులకు బహూకరించారు . ఇవ్వడానికి వారి దగ్గర అంతకంటే ఏముంది కనుక.

రామాయణం

తౌ రాజపుత్రౌ కార్త్స్న్యే న ధర్మమాఖ్యానముత్తమం
వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ

ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే
యథోపదేశం తత్వజ్ఞౌ  జగతుః  సుసమాహితౌ

మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ
తౌ కదాచిత్సమేతానామృషీణాం భావితాత్మనాం
ఆసీనానాం సమీపస్థావిదం కావ్యమగాయతాం.

అసలే రామ కథ .  కంఠస్వరం లవకుశులది . ఉపదేశించినవాడు వాల్మీకి . శ్రోతలు సాధువులు ,సత్పురుషులు, ఋషులు.ప్రశాంతమైన  ఆశ్రమ వాతావరణం . ఋషుల సమక్షంలో  లవకుశులు రామకథను అత్యద్భుతంగా గానం చేసారు.