Monthly Archives: ఆగస్ట్ 2016

రామాయణం

తతస్త్రిశఙ్కోర్వచనం శ్రుత్వా క్రోధ సమన్వితం
ఋషిపుత్రం రామ రాజాన మిదమబ్రవీత్

ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా
తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమోగురుః
తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్

ఇక్ష్వాకూనాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః
న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః

త్రిశంకు మహారాజు మాటలు విన్న వసిష్ఠ మహర్షి పుత్రులకు కోపం వచ్చింది .” దుర్బుద్ధీ ! గురువు , అందునా సత్యవాది . ఆ మహాత్ముడు నీ విన్నపాన్ని నిరాకరించాడు . అతను అసాధ్యమని చెప్పినా కూడా వేరొకరిని నీవు ఏవిధంగా ఆశ్రయిస్తున్నావు? పరమ పూజ్యుడైన పురోహితుడు అశక్యమని చెప్పినాక ఆ యజ్ఞాన్ని మేము చేయించగలమా ? సత్యవాది అయిన గురు వాక్యం అతిక్రమించరానిది .

బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః
యాజనే భగవాన్ శక్తస్త్రైలోక్యస్యాపి పార్థివ
అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథం

” ఓ నరశ్రేష్ఠుడా నీవు అమాయకుడవు ( మూర్ఖుడివి ) . ముల్లోకాలలో యగాన్ని చేయించడానికి వసిష్ఠ మహర్షి అత్యంత సమర్థుడు . అతనే అశక్యమని తెలిపాక , యాగాన్ని చేయించడానికి మేము ఏ విధంగా సమర్థుల మవుతాము . అయినా యాగాన్ని చేయించడం అంటే ఆ మహర్షిని అవమానించినట్టే . ఆ మహర్షిని మేము అవమానించగలమా ? ఇక నీవు నీ నగరానికి తిరిగి వెళ్ళవలసింది ” అని పలికారు .
తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యా కులాక్షరం
స రాజా పునరేవైతానిదం వచన మబ్రవీత్

ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్ర స్తథైవచ
అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోస్తు తపోధనాః

వారి మాటలు విన్న మహారాజు ” తపోధనులారా ! గురువు , గురుపుత్రులు నా విన్నపాన్ని మన్నించలేదు . ఇక యాగాన్ని చేయించడానికి వేరెవరినైనా ప్రార్థిస్తాను ” అని పలికాడు .

IMG_5183

 

 

 

 

 

 

రామాయణం

శరణం వః ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగతః
ప్రత్యాఖ్యాతోస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా

యష్టు కామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హథ
గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదయే

శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాన్ తపసి స్థితాన్
తే మాం భవంతః సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః
స శరీరో యథాహం హి దేవలోకమవాప్నుయాం

ప్ర్త్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః
గురుపుత్రానృతే సర్వాన్నాహం పశ్యామి కాఞ్చన

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమాగతిః
పురోధసస్తు విద్వాంసస్తారయంతి సదా నృపాన్
తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ .

భద్రం (మీకు క్షేమమగుగాక) . తమ వద్దకు నేను శరణం కోరి వచ్చాను . నన్ను రక్షించండి . . ఉత్తమ బ్రాహ్మణులూ , తాపసులూ అయిన తమకు తలవంచి నమస్కరిస్తున్నాను . సశరీరంగా స్వర్గానికి వెళ్ళవలెనని నా వాంఛ . కోరిక తీరడానికి నేను ఒక యజ్ఞం తలపెట్టాను . సావధానచిత్తులై తమరు ఆ యాగాన్ని చేయించండి . మహాత్ముడైన వసిష్ఠుడు నా కోరిక తీర్చడానికి నిరాకరించాడు . తపోధనులారా ! కులగురువైన వసిష్ఠుడు నిరాకరించాక నాకు ఇక వేరే దిక్కు లేదు . ఇక్ష్వాకు వంశీయులకు పురోహితుడే పెద్ద దిక్కు . విద్వాంసులైన పురోహితులు రాజులను తరింపజేస్తారు . వసిష్ఠుని తరువాత తమరే నాకు దేవతలు (వరాలనుగ్రహించే వారు . కోరికలు తీర్చే వారు ) .

ఆలోచన : మనిషిగా పుట్టినవానికి మరణమంటే సహజంగానే భయముంటుంది . శరీరాన్ని విడవడం అంత సులభం కాదు .ఆందుకే సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు మహారాజు . ఇక్ష్వాకు వంశీయుడూ అందునా వసిష్ఠునిలాంటి మహాత్ముడు గురువుగా కలవాడూ ఇతరులకు అసాధ్యమైన కోరికను సుసాధ్యం చేసుకోవాలనుకున్నాడు . ఇది నాకు పెద్ద తప్పుగా , గొంతెమ్మ కోర్కెగా కనిపించడం లేదు . మనుష్యుని గొప్పతనం ,ఇతరులకు సాధ్యం కానిది సాధించుకోవడంలోనే ఉంటుంది కదా ! మరి కోరిక తీర్చుకోవడానికి ఒకే ఒక మార్గం వసిష్ఠ మహర్షి . అందుకే ఆ మహర్షిని ఆశ్రయించాడు . ఆ మహర్షి త్రిశంకు కోరిక తీర్చడానికి నిరాకరించాడు . అందుకే ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాడు .మొట్టమొదటగా వసిష్ఠ మహర్షి పుత్రులను ఆశ్రయించాడు .DSC02381

 

రామాయణం

ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః
త్రిశఙ్కురితి విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధనః

తస్య బుద్ధిః సముత్పన్నా యజేయమితి రాఘవ
గచ్ఛేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిం

స వసిష్ఠం సమాహూయ కథయామాస చింతితం
అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా
విశ్వామిత్ర మహర్షి తపస్సును తీవ్రతరం చేసిన కాలంలో త్రిశఙ్కు అనే ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు ఉండేవాడు . అతడు సత్యసంధుడు , జితేంద్రియుడు కూడ .అతనికి యజ్ఞంచేసి పార్థివ దేహంతో ( తన శరీరంతో ) స్వర్గానికి  వెళ్ళాలనే కోరిక కలిగింది . కుల గురువైన వసిష్ఠ మహర్షిని పిలిపించి బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తగిన యజ్ఞాన్ని  చేయించమని ప్రార్థించాడు . మహాత్ముడైన వశిష్ఠుడు రాజు కోరిక తీరడం అసాధ్యమని తెలిపాడు . యజ్ఞం చేయించడానికి నిరాకరించాడు  .

వాసిష్ఠా దీర్ఘతసస్తపో యత్ర హి తేపిరే
త్రిశంఙ్కు సుమహాతేజాశ్శతం పరమ భాస్వరం
వసిష్ఠ పుత్రాన్ దదృశే తస్యమానాన్ యశస్వినః

సోభిగమ్య మహత్మానః సర్వానేన గురోః సుతాన్
అభివాద్యానుపూర్వేణ హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః
అబ్రవీత్సు మహాభాగాన్ సర్వానేన క్రతాఞ్జలిః

వసిష్ఠుడు అసాధ్యమని తెలిపినా తన ప్రయత్నం మానలేదు త్రిశఙ్కుడు . అతదు దక్షిణ దిశగా ప్రయాణం చేసి వసిష్ఠ మహర్షి పుత్రులను ప్రార్థించి తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు . తేజోవంతుడైన త్రిశఙ్కునికి , తపస్సు చేస్తూ కనిపించారు వంద మంది వసిష్థ పుత్రులు . ఆ యశోవంతులు భాస్వరం (phosphorous ) వలె వెలుగుతూ కనిపించారు . వసిష్ఠ పుత్రులను సమీపించి , పెద్దవారికి మొదట పిన్న వారికి అటుపిదప , అంటే క్రమానుసారంగా తలవంచి కృతాంజలి ఘటించి వారితో ఈ విధంగా పలికాడు .

IMG_5784

 

 

 

 

 

 

రామాయణం

అథాస్య జజ్ఞిరే పుత్రాస్సత్య ధర్మపరాయణా
హనిష్యందో మధుస్యందో దృఢనేత్రో మహారథః

తపస్సు తో బాటు సంసారం కూడా చేసాడు మహారాజు . ఇక మనం అతనిని మహాముని అని పిలవడం ఉచితంగా ఉంటుంది . ఈ సమయంలో విశ్వామిత్రునికి హవిష్యందుడు , మధుస్యందుదు , దృఢనేత్రుడు , మహారథుడు అనబడే నలుగురు పుత్రులు ఉదయించారు . వారు సత్య ధర్మ పరాయణులు .

పూర్ణే సహస్రే తు బ్రహ్మా లోకపితామహః
అబ్రవీన్మధురం వాక్జాం విశ్వామిత్రం తపోధనం

జితా రాజర్షి లోకాస్తే కుశికాత్మజ
అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే

వేయి సంవత్సరాలు గడిచాయి . విశ్వామిత్రుని తపం కొనసాగుతూనే ఉన్నది . లోకాలకు పితామహుడైన విధాత (బ్రహ్మ ) కు కరుణ కలిగింది . వెనువెంటనే విశ్వామిత్రునికి ముందట ప్రత్యక్షమయి ” కుశిక నందనా ! నీ తపస్సు సఫలమయింది . ఈ తపస్సుచే నీవు రాజర్షి వయినావు ” అని మధురంగా పలికాడు .

ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవతైః
త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః

విశ్వామిత్రోపి తత్ శ్రుత్వా హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః
దుఃఖేన సు మహత్తప్తం రాజర్షిరితి మాం విదుః

ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాయశాః
తపశ్చకార కాకుత్థ్స పరమం పరమాత్వాన్

వరమిచ్చి విధాత తన వెంట వచ్చిన సురులతో సహా బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు . కానీ వరాన్ని పుచ్చుకున్న విశ్వామిత్రునికి దుఃఖం కలిగింది . బ్రహ్మర్షి కావాలనుకుంటే , రాజర్షి పదం మాత్రమే దక్కింది . తన ప్రయత్నం వమ్ము కావడంతో కృంగిపోయాడు . సిగ్గు పడ్డాడు . కోపం కూడా వచ్చింది.వేయి సంవత్సరాలు తపస్సు చేసినా దేవతలు , ఋషులు నన్ను రాజర్షిగానే తలుస్తున్నారు . నేను ఇప్పటివరకూ చేసిన తపస్సు వ్యర్థం . ఇక ఇంతకంటే భీకరంగా తపస్సు చేసి బ్రహ్మర్షి పదాన్ని పొందుతాను అని నిశ్చయించుకున్నాడు .తీవ్రమైన తపస్సు మొదలు పెట్టాడు

 

DSC01908

సంకల్పించుకున్నది  నెర వేరక పోతే నిరాశ చెందినా , తన పట్టుదల మాత్రం వదిలి పెట్టలేదు . ప్రయత్నాన్ని ద్విగుణీకృతం చేసాడు . కార్య సాధకుల లక్షణం ఈ విధంగా ఉంటుంది .

 

 

 

 

 

 

 

 

 

రామాయణం

బ్రాహ్మ తేజాన్ని మించిన తేజం లేదనీ , అన్ని అస్త్రాలూ ఆ తేజం ముందర ఆగలేవనీ తెలుసుకున్న విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకోవడానికి తపస్సు చేయ నిశ్చయించుకున్నాడు .

తతః సంతప్త హృదయః స్మరన్నిగ్రహమాత్మనః
వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య కృతవైరో మహాత్మనా

స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ
తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః
ఫలమూలాశనో దాంతశ్చకార సుమహత్తపః

తపించిన హృదయంతో అంటే బాధ చెందిన హృదయంతో మహాత్ముడైన వసిష్టునితో వైరం పెట్టుకున్న విశ్వామిత్రుడు మాటి మాటికి నిట్టుర్చి , తన పెద్ద భార్యతో సహా దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు . అటు పిదప , ఫలాలు , కంద మూలాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి ఘోరమైన తపస్సు చేసాడు .ప్రస్తుతం అతని ధ్యేయం బ్రాహ్మణత్వాన్ని పొందడం మాత్రమే .

IMG_6379

రామాయణం

ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః
విశ్వామిత్రో పి నికృతో వినిఃశ్వస్యేదమబ్రవీత్

ధిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం
ఏకేన బ్రహ్మదణ్డేన సర్వాస్త్రాణి హతాని మే

తదేతత్సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియ మానసః
తపో మహత్సమాస్థాస్యే యద్వై బ్రహ్మత్వ కారణం

మహర్షుల ప్రార్థనలను మన్నించి శాంతించాడు . విశ్వామిత్ర మహర్షి అవమానంతో కుంగిపోయాడు .” బ్రహ్మ తేజో బలమే నిజమైన బలం . క్షత్రియ బలం వ్యర్థం . ఒక్క బ్రహ్మ దణ్డం , బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలనూ వ్యర్థం చేసింది . నాకు జ్ఞానోదయ మయింది . ఇక ప్రశాంతమైన మనస్సుతో బ్రాహ్మణత్వాన్ని పొందడానికి తపస్సు చేస్తాను ” అని నిర్ణయించు కున్నాదు .

వివరణ : అపజయం పాలైనా విశ్వామిత్రుడు తను తల పెట్టిన కార్యాన్ని విడిచి పెట్టలేదు . ప్రయత్నాన్ని కొనసాగించాడు . త్వరలోనే మహర్షి తను అనుకున్నది సాధించడం మనకు కనిపిస్తుంది . ఇదే ధీరుల లక్షణం . మనం నేర్చుకోవలసిన పాఠం . రామాయణం మన జీవితంలో అనుకున్నది సాధించడమెలాగో వివరంగా , ఉదాహరణలతో సహా తెలియ జేస్తుంది . జీవితాదర్శాలను నేర్పిన మహర్షులకిదే నా అభివాదం.

రామాయణం

రామాయణం

ప్రాజ్వలద్బ్రహ్మదణ్డశ్చ వసిష్ఠస్య కరోద్యతః
విధూమ ఇవ కాలాగ్నిర్యమదణ్డ వీ పరః

తతోస్తువన్ మునిగణా వసిష్ఠం జపతాం వరం
అమోఘం తే బల్మ్ బ్రహ్మన్ తేజో ధారయ తేజసా

నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః
ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాస్సంతు గతవ్యథాః

వసిష్ఠ మహర్షి చేతిలో ఉన్న బ్రహ్మదణ్డం ప్రళయ కాలంలో సంభవించే అగ్నిలా ప్రజ్వలించింది . యమదణ్డంలా భాసించింది . ( మంత్రాస్త్రాల ప్రయోగంతో అమితమైన తేజస్సు వెలువడింది . ఆ తేజస్సును భరించలేక లోకాలు బాధ చెందాయి ) . ఆ సమయంలో మునిగణాలు ” మహాత్మా ! తమ బలం అమోఘం . మహా  తపశ్శాలి విశ్వామిత్రునే నిగ్రహించారు . కానీ  ప్రయోగించిన అస్త్రాల ధాటికీ , బ్రహ్మదణ్డం నుండి వెలువడే తేజస్సుకూ లోకాలు తల్లడిల్లుతున్నాయి .  ఇక అనుగ్రహించి , తమ తేజస్సును మీలోనే నిగ్రహించండి . లోకాల ,లోకుల బాధలు శమిప జేయండి ” అని ప్రార్థించారు .

DSC02324

రామాయణం

బ్రహ్మాస్త్రం గ్రహమానస్య వసిష్టస్య మహాత్మనః
త్రైలోక్య మోహనం రౌద్రం రూపమాసీత్సుదారుణం

రోమకూపేషు సర్వేషు వసిష్టస్య మహాత్మనః
మరీచ్య ఇవ నిష్పేతు రగ్నేర్ధూమా కులార్చిషః

 

తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మ దండం కబళించి వేసే సమయంలో వసిష్ఠ మహర్షి రూపం దారుణంగా మారింది .ముల్లోకాలనూ మూర్ఛ పోగొట్టే రూపమది .వసిష్ఠ మహర్షి రోమాలనుండి పొగతో కూడిన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి . బ్రహ్మ దండమేమో ప్రళయకాలంలోని అగ్నిలా , రెండవ యమదండమా అనేలాగా భాసించిందట .

విశేషం

ఏ పురాణంలో కూడా విష్ణు చక్రాన్నీ , పాశుపతాన్నీ , బ్రహ్మాస్త్రాన్నీ నిగ్రహించిన సందర్భం కనిపించదు . అవి తిరుగు లేని అస్త్రాలు . ఆ ఖ్యాతి ఒక్క వసిష్ఠ మహర్షికీ ఆతని బ్రహ్మ దండానికీ మాత్రమే లభించింది .

 

IMG_0038

రామాయణం

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః
అగ్నేయ మస్త్ర ముత్క్షిప్య తిష్ఠ తిష్ఠ చాబ్రవీత్

తన తపోవనాన్ని దగ్ధం చేసిన విశ్వామిత్రుని , బ్రహ్మదండంతో అడ్డుకున్నాడు వసిష్ఠ మహర్షి . ఎదిరించిన వసిష్థ మహర్షిని ” తిష్ఠ , తిష్ఠ ( కదల వద్దు , కదలవద్దు )” అని పలుకుతూ అగ్నేయాస్త్రాన్ని సంధించాడు విశ్వామిత్ర మహర్షి .

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః
అగ్నేయ మస్త్ర ముత్క్షిప్య తిష్ఠ తిష్ఠ చాబ్రవీత్

తన తపోవనాన్ని దగ్ధం చేసిన విశ్వామిత్రుని , బ్రహ్మదండంతో అడ్డుకున్నాడు వసిష్ఠ మహర్షి . ఎదిరించిన వసిష్థ మహర్షిని ” తిష్ఠ , తిష్ఠ ( కదల వద్దు , కదలవద్దు )” అని పలుకుతూ అగ్నేయాస్త్రాన్ని సంధించాడు విశ్వామిత్ర మహర్షి .

బ్రహ్మదండం సముత్క్షిప్య కాలదండమివా పరం
వసిష్ఠో భగవాన్ క్రోధాదిదం వచన మబ్రవీత్

క్షత్రబంధో స్థితో స్మ్యేష యద్బలం తద్విదర్శయ
నాశయామ్యద్య తే ద్రమ శస్త్రస్య తవ గాధిజ

కే చ తే క్షత్రియబలం కే చ బ్రహ్మబలం మహత్
పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన

కోపించిన వసిష్ఠుడు రెండవ యమదండం లాగా ఉన్న తన బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకొని ” దుష్ట క్షత్రియుడా ! నీ బలాన్ని ప్రదర్శించు . నీ దర్పాన్నీ , నీ శస్త్రాల బలాన్నీ నాశనం చేస్తాను . దివ్యమైన నా బ్రహ్మ బలం ముందర నీ క్షత్రియ బలమెంత . ఇక నా బ్రహ్మబలాన్ని చూడు ” అని కోపంతో గర్జించాడు .

తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయ ముద్యతం
బ్రహ్మదణ్డేన తచ్ఛాంత మగ్నెర్వేగ ఇవాంభసా

వారుణం చైవ ,రౌద్రం చ , ఐంద్రం పాశుపతం తథా
ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందనః
విశ్వామిత్ర మహర్షి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని , బ్రహ్మదండం ” అగ్నిని ఉదకం శాంతింపజేసినట్లు శాంతింప జేసింది “. కోపించిన విశ్వామిత్రుదు వరుసగా ” వారుణ , రౌద్ర , ఐంద్ర , పాశుపత , ఐషీక” అస్త్రాలను ప్రయోగించాడు .

మానవం , మోహనం చైవ గాంధర్వం ,స్వాపనం తథా
జృంభణం ,మాదనం చైవ సంతాపనవిలాపనే

శోషణం , దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం
బ్రహ్మపాశం ,కాలపాశం వారుణం పాశమేవ చ

పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీ ఉభే
దణ్డాస్త్ర మథ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ

ధర్మచక్రం కాలచక్రం , విష్ణు చక్రం తథైవ చ
వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా

శక్తిద్వయం , చ చిక్షేప , కఙ్కాళం ముసలం తథా
వైద్యాధరం , మహాస్త్రం చ కాలాస్త్ర మథ దారుణం

త్రిశూలమస్త్రం , ఘోరం చ కాపాల మథ కఙ్కణం
ఏతన్యాస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన
వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుత మివాభవత్.

రాఘవా ! తను ప్రయోగించిన అస్త్రాలను బ్రహ్మదండ ప్రభావానికి లొంగిపోవడంతో ,కుపితుదై ” మానవ , మోహన , గంధర్వ , స్వాపన , జృంభణ , మాదన , సంతాపన , విలాపన , శోషణ , ధారణ , వజ్రాస్త్రాలను ప్రయోగించాడు . బ్రహ్మాస్త్రం అన్ని అస్త్రాలనూ మ్రిగివేసింది . ఏ విధమయిన నష్టాన్ని కలిగించకుండా తను ప్రయోగించిన అస్త్రాలు విఫలమవడంతో విశ్వామిత్రుని కోపం ఇంకా అధికమయి ” బ్రహ్మ పాశ , వరుణ పాశ , పైనాక , దయితాస్త్ర , శుష్క , ఆర్ద్ర – దండ , పైశాచ , క్రౌంచాస్త్రాలను , ధర్మ చక్ర , కాల చక్ర , విష్ణు చక్రాలను , వాయవ్య , మథన , హయశిరోస్త్రాలను – కంకాళ , ముసలాలను – వైద్యాధర , కాల , త్రిశూల , కాపాల , కంకాణాస్త్రాలను ” వసిష్ఠునిపై ప్రయోగించాడు కౌశికుడు .

తాని సర్వాణి దణ్డేన గ్రసతే బ్రహ్మణః సుతః
తేషు శాంతేషు , బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధినందనః

తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సాగ్ని పురోగమాః
దేవర్షయశ్చ సంభ్రాంతా గంధర్వాః సమహోరగాః
త్రైలోక్యమా సీత్సంతప్తం బ్రహ్మాస్త్రే సముదీరితే

బ్రహ్మదణ్డం అన్ని అస్త్రాలనూ మ్రింగివేసింది . చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు గాధి నందనుడు . బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చూసి దేవ , గంధర్వ , ఉరగ , మహర్షులు సంభ్రమంలో మునిగిపోయారు . లోకులకు బాధ కలిగింది .

తదస్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా
వసిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదణ్డేన రాఘవ

బ్రహ్మాస్త్రాన్ని కూడా నిగ్రహించింది బ్రహ్మదణ్డం .

విశేషం :

ఈ శ్లోకాల్లో ప్రయోగించిన అస్త్రాల్లో పరమేశ్వరుని పాశుపతం , విష్ణు చక్రం , బ్రహ్మ పాశం ,బ్రహ్మాస్త్రం ఉన్నాయి . విష్ణుచక్రం ప్రయోగించినప్పుడు అది వ్యర్థం కావడం అనేది ఉండదు . ఆ విధంగానే పాశుపతం , బ్రహ్మాస్త్రం కూడా . బ్రహ్మతేజంతో వెలసిపోతూ తిరుగు లేని అస్త్రాలను నిరోధించిన ఖ్యాతి ఒక్క వసిష్ఠ మహర్షికి మాత్రమే చెందుతుంది .