Monthly Archives: ఫిబ్రవరి 2016

రామాయణం

హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానం చతుర్యుజాం
దీదెం తే శతాన్యష్టౌ కిఙ్కిణీక విభూషితాన్

హయానాం దేశజాతానాం కులజానాం మహౌఅజసాం
సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత

నానావర్ణ విభక్తానాం వయస్థానాం తథైవ చ
దదామ్యేకం గవాం కోటిం శబలా దీయతాం మమ

యవదిచ్ఛపి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ
తావద్దదామి తత్సర్వం శబలా దీయతాం మమ .

బంగారు ఆభరణాలతో అలంకరించిన గజాలతో బాటు నాలుగు శ్వేతాశ్వాలతో కట్టి , చిరుగంటలతో అలంకరించిన ఎనిమిది వందల రథాలను నీకు సమర్పిస్తాను . అదనంగా అత్యుత్తమమైన అశ్వాలను పదకొండు వేల సంఖ్యలో నీ స్వంతం చేస్తాను . కోటి గోవులు కూడా నీవవుతాయి సుమా . వేరే పలుకులెందుకు కోరుకో నీకు ఎంత బంగారం , ఎన్ని రత్నాలు కావాలో ? ఈ శబలను మాత్రం నాకివ్వు .

కోరికలే లేని బ్రహ్మర్షికి ధన , కనక వస్తు వాహనాలిస్తానని మభ్య పెడుతున్నాదు విశ్వామిత్ర మహా రాజు . విచిత్రంగా లేదూ .

IMG_6116

ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనం
ఏతదేవ హి సర్వస్వ మేతదేవ హి జీవితం

దర్శస్చ పూర్ణ మాసశ్చ యజ్ఞాశ్చైవాస్త దక్షిణాః
ఏతదేవ హి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తథా

అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః
బహునా కిం ప్రలాపేన న దాస్యే కామ దోహినీం

ససేమిరా ఇవ్వనంటున్నాడు వసిష్ఠ మహర్షి . ” రాజా ! నాకు ఈ గోవే రత్నం . ఇదే ధనం . ఇదే నా సర్వస్వం . దర్శ పూర్ణ యాగాలు , ఆప్త దక్షిణల యజ్ఞాలు , వివిధ క్రియలకు ఆలంబనమైన ఈ గోవును నీకు ఇవ్వను . ఉపయోగం లేని మాటలతో ఏమి ప్రయోజనముంటుంది ? కోరికలు తీర్చే ఈ కామధేనువును నీకు ఇవ్వను ” అని ఖండితంగా చెప్పాడు .

 

some Information about yaj~na/yaaga :

సమర్పించే హవిస్సును అనుసరించి యజ్ఞాలను మూడు రకాలుగా విభజించ వచ్చు .ఆవునెయ్యిని హవిస్సుగా ఉపయోగిస్తే అవి హవిర్ యజ్ఞాలు . ఉదాహరణకు దర్శపూర్ణమాస యజ్ఞం , అగ్నిహోత్రం .దర్శపూర్ణమాస యజ్ఞాన్ని పూర్ణిమ , అమావాస్యలలో చేస్తారు .సోమలతలు , ఓషధులు హవిస్సుగా ఉపయోగించిన యజ్ఞాలకుసోమ యాగాలని పేరు . ఉదాహరణకు అగ్నిష్టోమం , అతిరాత్రం ,వాజపేయం .వండిన పదార్థాలను హవిస్సుగా ఉపయోగిస్తే అవి పాక యజ్ఞాలవుతాయి . శ్రావణి , శ్రద్ధ కర్మ , చైత్రి పాక యజ్ణాలు . ఇవి కాక కోరికలు తీరడానికి కొన్ని యాగాలు చేస్తారు .పుత్ర కామేష్ఠి , అశ్వమేధం లాంటివి . సత్ర యాగం లాంటి యాగాలను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు .

Yagna offerings are cooked items ( Paka Yajnas), extract of a particular tree (Soma Yagna), havis (Havir Yagnas) and like.

Post-Vedic Yagnas, where milk products, fruits, flowers, cloth and money are offered, are called homa or havanam.

Purpose:

(i) Yagnas:

There are many yajnas described in the Vedas. Of these, 21 are deemed compulsory for the Twice-Born.

The Agnihotra and the Aupasana are to be performed twice daily, at dawn and dusk. The remaining ones have certain allotted frequencies over the course of the year.

Seven are Paka Yagnas (astaka, parvana, etc.)

Seven are Soma Yagnas (agnistoma, shodasi, etc.)

Seven are Havir Yagnas ( agni hotra, Darsa-Purnamasa, agrayana, caturmasya etc.)

Five are the Panca Maha Yagnas ( bootha Yagna, Manushya Yagna, Pitru yagna, Deva Yagna and brahma Yagna).

Four are Veda Vratas, which are done during Vedic education.

Forty Samskaras.

(Yagnas like Rajasuya, (royal consecration), Vajapeya (chariot race) and Ashvamedha (horse sacrifice) were for kings only.)

(ii) Homam;

Homam is done for Kamya Phala now a days. Each homam has a specific wish for fulfillment.

Homam (also called havan) is a religious ritual performed by Hindus to invoke the blessings of specific Gods and Godesses. It begins with the Karta (devotee) invoking Agni (God of fire) and inviting him to carry the dravya (offerings into the fire) to the concerned deity. The Gods, pleased with the offerings grant the wishes of the devotees in the form of benefits likelongevity, success in business, good health, prosperity, progeny etc.

Few homams are given for illustration.

Ganapathi Homam Dedicated to Lord Ganesh, during Grahaprevesam, to improve family bondage, to win over enemies, to overcome disease and to achieve a planned objective without any hindrance.

Navagraha Homam is to overcome the ill aspects Gochjara Navagraha planets.

Maha Lakshmi Homam is for wealth.

Maha Mruthyunjaya Homam Dedicated to Lord Shiva to avoid untimely death.

Santhana Gopala Homam is for progeny.

Ayushya Homam Dedicated to the Life God to enhance longevity.

Maha sudarsana homam for Removal of all hurdles.

3) Popular Yagna Quotes:

(i) Vishnu Sahasranamam:

“Yagno yagna pathiryagna yagnango yagna vahana”.
“Yagnabrith, yagnakrith yagnee, yagnabukh, yagna sadhana”.

(ii) Lalitha Sahasranamam:

“Mahayaga kriya radhyayai namah”
‘yagna roopayai namah’
‘yagna karthrai namah’
‘yagna swaroopnyai’

(iii) Purusha suktha:

“yagnena yagnamayajanta devah thani dharmani prathamanyasam’ –

(i) Sree Rudram:

” Ayur yagnena kalpantham, prano yagnena kalpantham, vak yagnena kalpantham, Atma yagnena kalpantham, yagno yagnena kalpantham”

Note : This information is taken from one of the yahoo answers on egos by Haritha

 

 

 

 

 

 

 

 

 

వసిష్ఠే నైవ ముక్తస్తు విశ్వామిత్రో బ్రవీత్తతః
సంరబ్ధ తర మత్యర్థం వాక్యం వాక్య విశారదః

హైరణ్య కక్ష్యా గ్రైవేయాన్ సువర్ణాఙ్కుశ భూషితాన్
దదామి కుఞ్జరాం స్తేషాం సహస్రాణి చతుర్దశ

వసిష్ఠ మహర్షి మాటలు విన్న విశ్వామిత్రుడు మహర్షికి ఇంకా ఎక్కువ వస్తువులు ఇచ్చి శబలను పొందాలనుకున్నాడు . మాటలలో నేర్పరి కదా మరి . ” మహర్షీ మీకు పదునాలుగు వేల  ఏనుగులను కూడా ఇస్తాను . ఏనుగులను బంగారు నడుము త్రాళ్ళతో , బంగారు మెడత్రాళ్ళతో అలంకరించి , బంగారు అంకుశాలతో సహా  మీకు సమర్పిస్తాను ” .

రామాయణం

ఏవ ముక్తస్తు భగవాన్ వసిష్ఠో మునిసత్తమః
విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్ర్త్యువాచ మహీపతిం

నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవాం
రాజన్ దాస్యామి శబలాం రాశిభీ రజతస్య చ

న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ
శాశ్వతీ శబలా మన్యం కీర్తిరాత్మవ్తో యథా

అస్యాం హవ్యం చ కవ్యం ప్రాణయాత్రా తథైవ చ
ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ

స్వాహాకార వషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా
ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః

సర్వస్వమేతత్ సత్యేన మమ తుష్టికరీ సద్దెర్
కారణైర్ బహుభీః రాజన్న దాస్యే శబలాం తవ

 
విశ్వామిత్రుని మాటలు విన్న వసిష్ఠ మహర్షి అతనితో ” రాజా ! నీవు శత సహస్ర ( లక్షల కొలదీ) గోవులను నాకొసగినా , శత కోటి ఆవుల నిచ్చినా , రాశులుగా పోసిన రజితాన్ని (వెండి ) ఇచ్చినా నేను శబలను నీకు ఇవ్వను . శబలతో నాకు , బుద్ధిమంతుడికి ( లేక ధైర్య శాలికి ) కీర్తికి ఉన్న శాశ్వతమైన సంబంధం లాంటి సంబంధం ఉన్నది . అందువలన ఈ ధేనువును నేను త్యాగం చేయలేను , చేయను . అంతే కాకుండా నేను చేసే హవ్యం , కవ్యం , అగ్నిహోత్రం , స్వాహాకార వషట్కారాలు , ఇతర విద్యలు చివరికి నా ప్రాణాలు ఈ ధేనువు మీద ఆధార పడి ఉన్నవి . ఈ ధేనువు నా సర్వస్వం . నాకు ఆనంద దాయిని .ఇంకా చెప్పలేనన్ని ఇతర కారణాల వల్ల ఈ ధేనువును నేను నీకర్పించలేను ” అని పలికాడు .

దేవతల కిచ్చే అన్నాన్ని హవ్యమని అంటారు . పితృ దేవతల కిచ్చే అన్నాన్ని కవ్యమని అంటారు

యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి ‘స్వాహా’ అని అనడం  తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి .

అగ్నిలో హవిస్సులు వేసేటప్పుడు ‘‘వషట్‌’’ అనే శబ్దాన్ని ఉచ్చరించడం. స్వాహా, స్వధా శబ్దాల వలెనే పరమేశ్వర వాచకం. దేవ హవిర్ధాన వాచకం కూడా. వషట్కారం చేసే ఋత్విక్కుగానీ, హోత గానీ తప్పనిసరిగా పఠించవలసిన ఒక మంత్రం ఉంది. వషట్‌ అన్నప్పుడు హోత/ ఋత్విక్కు వాక్‌ ప్రాణాపానాలు శరీరం నుంచి వెలుపలకు వస్తాయి. కనుక వాక్‌ ప్రాణాపానాలు తనలోనే సుఖంగా ఉండాలని ప్రార్ధిస్తూ ‘‘వాగోజః సహ ఓజోమయి ప్రాణాపానో’’ అనే మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది. హోత/ ఋత్విక్కు తన ఓజస్సు, సహస్సు తగ్గకుండా తీసుకొనే జాగ్రత ఇది. ఓజస్సు, సహస్సు వషట్కారానికి రెండు అంశలు. (సహః అంటే బలిమి, ఓర్పు అనే అర్థాలు ఉన్నాయి.)

DSC09597

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

రామాయణం

పూజితోహం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః

శ్రూయతా మభిధాస్యామి వాక్యం వాక్య విశారద
గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ

రత్నం భగవన్నేత్రద్రత్నహారీ చ పార్థివః

తస్మాన్మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజDSC02194
” వసిష్ఠ మహర్షీ ! తమరు పూజార్హులు . అయినా నన్ను పూజించి సత్కరించారు . వాక్య విశారదుడవైన మహర్షీ తమతో నేనొక విన్నపం చేయ దలచాను . దయ చేసి వినండి . తమకు లక్ష గోవులను ఇస్తాను . శబలను నాకు ఇవ్వండి . ఈ శబల రత్నం వంటిది . రత్నాలు రాజుల వద్ద ఉండతగినవి . రత్నాలు రాజుల సోమ్ము . అందువలన శబలను నాకు ఇవ్వండి .”
ఏ వస్తువు విశేషంగా కనిపించినా రాజులు వాతిని తమకు చెందాలని కోరడం అనాదిగా వస్తున్న సంస్కారం లాగా కనిపిస్తున్నది . హైదరాబాదు నిజాము ఎవరి వద్ద అందమైన కారు కనిపించినా తన దివాణానికి తరలించే వాడని ప్రతీతి . అంతకు పూర్వం అందమైన స్త్రీలను అంతఃపురాలకు తరలించడం రాజులకు ఆనవాయితీగా ఉండేది .” జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ ” అనే ఉర్దూ సామెత కూడా ఉంది కదా ! బలవంతుని మాటే చెల్లుతుంది ఈ లోకంలో , ఆనాడైనా , ఈనాడైనా “.

రామాయణం

విశ్వామిత్రోపి రాజర్షిః హృష్టః పుష్టస్తదా భవత్
సాంతః పురవరో రాజా స బ్రాహ్మణపురోహితః

సామాత్యో మంత్రి సహితః పూజితస్తదా
యుక్తః పరమ హర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్

విశ్వామిత్రుని పరివారం , అంతఃపుర కాంతలు , బ్రాహ్మణ శ్రేష్ఠులు , వసిష్ఠ మహర్షి ఆతిథ్యానికి చాలా సంతోషించారు . వసిష్ఠ మహర్షి పూజలు స్వీకరించిన విశ్వామిత్రుడు ఈ విధంగా పలికాడు .

IMG_5539

 

రామాయణం

ఏవముక్తా వసిష్ఠేన శబలా శత్రుసూదన
విదధే కామధుక్కామాన్యస్య యస్య యథేప్సితం

ఇక్షూన్మధూంస్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసనాన్
పానాని చ మహార్హాణి భక్ష్యాశ్చ ఉచ్చావచం తథా

వసిష్ఠ మహర్షి చెప్పగానే , శబల రాజర్షి విశ్వామిత్రుని సైన్యానికి కావలసిన భోజనాన్ని సిద్ధం చేసింది . ప్రతి సైనికునికీ , ఆతనికి ఇష్టమైన పదార్థాలను సమకూర్చింది . చెఱకు గడలు , లాజలు (పేలాలు ) , పుట్ట తేనె , మంచి పాత్రలలో పోసిన మైరేయాలు ( మద్యాలు ) , పానీయాలు , రకరకాలైన భక్ష్యాలతో రాజ సైనికులకు విందు భోజనం పెట్టింది .

ఉష్ణాఢ్య స్యోదనస్యాత్ర రాశయః పర్వతోపమాః
మృష్ఠాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తధైవ చ

నానా స్వాదు రసానాం చ షాడబానాం తథైవ చ
భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః

సర్వమాసీత్సు సంతుష్టం హృష్టపుష్ట జనాయుతం
విశ్వామిత్రబలం రామ వసిష్ఠేనాభి తర్పితం

విశ్వామిత్ర సైన్యానికి కావలసిన మధురాన్నాలు వేడిగా , సమృద్ధిగా సృజించింది . వాటికి అనుగుణంగా వండిన పప్పులు (సూపాలు ) , వివిధ రసాలతో కూడిన పాత్రలు , బెల్లంతో చేసిన మధుర పదార్థాలు (స్వీట్స్ ) కుప్పలు తెప్పలుగా ఏర్పడ్డాయి .

విశ్వామిత్రుని పరివారమంతా తృప్తిగా భోజనం చేసారు . వసిష్ఠుని ఆతిథ్యానికి ఆనందించారు . అదే విధంగా విశ్వామిత్రుడు , అతని అంతఃపుర కాంతలు , అతనితో వచ్చిన బ్రాహ్మణులు , పురోహితులు అందరూ తృప్తిగా భోంచేసారు . అది షడ్రసోపేతమైన విందు .

రామాయణం ఏడు వేల సంవత్సరాలకు పూర్వం రాసిన గ్రంధం . ఆ కాలంలో విందు భోజనాలు ఏవిధంగా ఉండేవో కొంతవరకూ పై శ్లోకాలవల్ల తెలుస్తుంది . ఇంకో విషయం పై శ్లోకాలలో మాంసాల గురించిన ప్రస్తావన లేదు . ఋష్యాశ్రమాలలో శాఖాహారమే భుజించే వారని మనం అనుకోవచ్చు .IMG_5188

రామాయణం

ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ
సబలస్యస్య రాజర్షేః కర్తుం వ్యవసితో స్మ్యహం
భోజనేవ మహార్హేణ సత్కారం సంవిధత్స్వమే

యస్య యస్య యథాకామం షడ్రసేష్వభి పూజితం
తత్సర్వం కామధుక్ క్షిప్రమభివర్ష కృతే మమ

రసేనాన్నేన పానేన లేహ్య చోష్యేణ సంయుతం
అననస్సప్ నిచయం వర్వం సృజస్వ శబలే త్వర

” శబలా ! ఇటు వైపు వచ్చి నే చెప్పే మాటలు శ్రద్ధగా విను . సేనా సమేతంగా మన ఆశ్రమానికి అరుదెంచిన ఈ రాజర్షికి నేను ఆతిథ్యాన్ని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను . భోజనాదులను తగిన విధంగా ఏర్పాటు చేయి . భోజనంలో వివిధ రకాలైన అన్నాలు , లేహ్యాలు ( నాకడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ),చోష్యాలు( పీల్చడానికి అనుకూలమైన పదార్థాలు ) , రసాలు , నీవు సృజించు ” అని బ్రహ్మ ఋషి అయిన వసిష్ఠ మహర్షి తన కామధేనువును ఆజ్ఞాపించాడు .

అతిథి స్వయంగా విష్ణువని భావిచే సంస్కారం మనది . వచ్చిన అతిథికి ఏ విధంగానూ లోటు రానీయ కూడదనే తలపుతో వసిష్ఠ మహర్షి కామధేనువును కోరాడు . అతిథులను ఏ విధంగా ఆహ్వానించాలో , భోజనం పెట్టాలో , పూర్వ కాలంలో మన సంస్కృతి ఏ విధంగా ఉండేదో తెలియ చెబుతున్నవి ఈ శ్లోకాలు .

అతిథి మరీ గొప్పవాడైతే పూర్ణ కుంభ స్వాగతం ఇవ్వడం మన పద్ధతి .

DSC02499

 

రామాయణం

ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవ హి
న్యమంత్రయత ధర్మాత్మా పునః పునరారుధీః

బాధమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ
యథాప్రియం భగవతస్తథాస్తు మునిపుంగవ

ఏవముక్తో మహాతేజో వసిష్ఠో జపతాం వరః
అజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః
విశ్వామిత్రుడు వద్దు వద్దని వారించినా , ధర్మాత్ముడైన వసిష్థుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని మరల మరల ప్రార్థించాడు . విధిలేక ” భగవన్ ! తమకు ఏది ప్రియమో ఆ విధంగానే జరుగుతుంది ” అని ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు విశ్వామిత్రుడు . మునులలో ఉత్తముడు , ధూతకల్మషుడు ( పాపాలు తొలగించబడ్డవాడు ) తేజస్సుతో అలరారేవాడు అయిన వసిష్థుడు , విశ్వామిత్రుని అంగీకారంతో సంతోషించాడు . చిత్రవర్ణాలతో కూడిన కామధేనువును తన వద్దకు రమ్మని ఆప్యాయంగా పిలిచాడు .

IMG_8551

రామాయణం

సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతాం
రాజా త్వమతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః
కృతమిత్య బ్రవీద్రాజా ప్రియ వాక్యేన మే త్వయా

ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశ్రమే
పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేవ చ

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః
గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా
” మహారాజా ! తమరు ఉత్తమమైన అతిథులు . మీదు మిక్కిలి  రాజులు .  ప్రయత్నం చేసి మరీ పూజింపవలసిన పూజనీయులు . దయతో నేనొసగే అతిథి సత్కారాన్ని అందుకోవలసింది “అని వసిష్ఠ మహర్షి విశ్వామిత్రుని అభ్యర్థించాడు .

వసిష్థుడు ఒక ముని . ససైన్యంగా వచ్చిన తనకు సత్కారం చేయడంలో ఇబ్బంది పడతాడని భావించాడేమో విశ్వామిత్రుడు .

“మహర్షీ ! తమరు ప్రియమైన మాటలు పలికారు .అర్ఘ్య పాద్యాలతో అహ్వానించారు . ఆశ్రమంలో లభించే ఫలాలను ఇచ్చారు . పూజార్హులైన తమరు , నన్ను అన్ని విధాలా ఆదరించారు . ఇంతకంటే నాకు కావలసిందేముంటుంది . ఇక ముందర కూడా నన్ను ప్రేమతో కూడిన దృక్కులతో చూస్తూ ఉండండి . అదే నాకు మహాభాగ్యం . నాకు ఇక సెలవిప్పించండి ” అని వసిష్ఠుని కోరాడు .

మానవ సంబంధాలు ఎలా ఉండాలో ఈ సంఘటన మనకు తెలియ జేస్తుంది . అతిథిని అతి సమగ్రంగా ఆదరించాలనే అభిలాష వసిష్ఠునిదైతే , మహర్షికి ఇబ్బంది కలుగుతుందని ఆతిథ్యాన్ని నిరాకరించే సుగుణం విశ్వామిత్రునిది . ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు , వీలైతే సహాయం చేయాలి అనే భావన కలిగినప్పుడు జీవితాలు సుఖప్రదాలవుతాయి .

ఏదో కవి చెప్పినట్టు ” పరోపకారాయ పుణ్యాయ , పాపాయ పరపీడనం ” . నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలోనే పాప పుణ్యాలకు ఇంతకంటే మంచి నిర్వచనం లేదు . IMG_5262.JPG

 

 

 

 

 

 

రామాయణం

కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్టౌ తాః కథాః శుభాః
ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరం

తతో వసిష్ఠో భగవాన్ కథాంతే రఘునందన
విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ

ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల
తవ చైవా ప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛమే

 

ధర్మాత్ములైన వారిరువురూ ముదంగా ముచ్చటలాడుకున్నారు . ముచ్చటలు పూర్తి కాగానే భగవత్స్వరూపుడైన వసిష్ఠుడు విశ్వామిత్రునితో ” మహాబలశాలీ ! మీకూ , మీ సైన్యానికీ తగిన విధంగా ఆతిథ్యాన్ని ఇవ్వదలిచాను . స్వీకరించండి ” అని పలికాడు .

 

IMG_8723.JPG