Monthly Archives: మే 2017

రామాయణం

సోపాధ్యాయో మహారాజ పురోహిత పురః పరః
శీఘ్ర మాగచ్ఛ భద్రం తే ద్రష్టు మర్హసి రాఘవౌ

ప్రీతిం చ మమ రాజేంద్ర నిర్వర్తయితు మర్హసి
పుత్రయోరు భయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే

ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్
విశ్వామిత్రాభ్యమనుజ్ఞాతః శతానందమతే స్థితః
ఇత్యుక్త్వా విరతా దూతా రాజగౌరవ శంకితాః

మహారాజా ! తమరు తమ ఉపాధ్యాయ, పురోహిత సహితంగా మిథిలా నగరానికి శీఘ్రంగా విచ్చేసి రామ లక్ష్మణులను చూడాలని నా ప్రార్థన . మీ రాక మాకు ఆనందాన్ని కలిగిస్తుంది . తమకు కూడా ఇరువురు పుత్రుల ఆనందం కలుగగలదు . (అంటే పుత్రుల వివాహాన్ని దర్శించే ప్రీతి కలుగుతుంది ). విశ్వామిత్ర మహర్షి అనుమతి , శతానంద మహర్షి అనుమతి పొందిన జనక మహారాజు ఈ మధురమైన వాక్యాలను తమకు నివేదించమన్నారు ” అని దూతలు జనక మహారాజు సందేశాన్ని దశరథ మహారాజుకు తెలియజేసారు .

IMG_6721.JPG

రామాయణం

బద్ధాంజలి పుటాః సర్వే దూతా విగతసాధ్వసాః
రాజానం ప్రయతా వాక్యమబ్రువన్ మధురాక్షరం

మైథిలో జనకో రాజా సాగ్నిహోత్ర పురస్కృతం
కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయ పురోహితం

ముహుర్ముహుర్మధురయా స్నేహ సంయుక్తయా గిరా
జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే స పురస్సరం

పృష్ట్వా కుశల మవ్యగ్రం వైదేహో మిథిలాధిపః
కౌశికానుమతే వాక్యం భవంత మిదమబ్రవీత్

IMG_1181

దశరథునికి అంజలి ఘటించి ఆ మహారాజుతో మధురంగా ఈ విధంగా పలికారు . ” మహారాజా ! మిథిలా నగరానికి మహారాజైన జనకుడు తమ క్షేమాన్ని కోరుతున్నాడు . పురోహితులూ , మంత్రి సత్తములూ , పరివారజనమూ ముందు నడచే మహారాజైన తమను స్నేహపూర్వకంగా పలకరించమని మమ్ములను ఆజ్ఞాపించాడు . తమరికి , తమ పరిజనులకు శుభాలు కలగాలని ఆశిస్తున్నాడు . అగ్నిహోత్రాది కర్మలను ఆచరించే తమరితో , కుశల ప్రశ్నల పిదప ఈ వాక్యాలు నివేదించమన్నాడు . ఈ వాక్యాలు తమకు నివేదించడానికి మహర్షి కౌశికుని అనుమతి కూడా తీసుకున్నాడు .

పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా
రాజానశ్చ కృతామర్షా నిర్వీర్యా విముఖీకృతాః

సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్ర పురస్సరైః
యదృచ్ఛయా గతైర్వీరైర్నిర్జితా తవ పుత్రకైః

తచ్చ రాజన్ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా
రామేణ హి మహారాజ మహత్యాం జనసంసది

అస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే
ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదను జ్ఞాతుమర్హసి

అస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే
ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతు మర్హసి .

” నా కుమార్తె సీత వీర్యశుల్క అని నేను ప్రతిజ్ఞ చేసిన విషయం లోకవిదితం . ( త్రిపురాంతకుని చాపాన్ని ఎక్కుపెట్టిన వాడికి సీతనిస్తాను అని నేను ప్రతిజ్ఞ చేసాను ) ఎందరో రాజులు సీతను వివాహం చేసుకోవాలనే కోరికతో కోరికతో నారి సంధించడానికి ప్రయత్నించారు . కాని ముక్కంటి వింటిని ఎక్కుపెట్టలేక సిగ్గుతో మరలిపోయినారు .అటువంటి సమయాన విశ్వామిత్రుని వెంట దైవానుగ్రహం వలన తమ తనూజుడు మిథిలా నగరానికి అరుదెంచాడు . వచ్చి వీర్యాన్ని ప్రదర్శించి సీతను సంపాదించుకున్నాడు . సభా మధ్యంలో దివ్యమైన శివుని శరాసనాన్ని అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచాడు . విల్లు విరిచిన వీరునితో సీత వివాహం చేస్తాను అన్న నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి తమ అనుజ్ఞ అవసరం . ఆ అనుజ్ఞ మాకు ప్రసాదించండి “.

IMG_7491

రామాయణం

జనకేన సమదిష్ట్వా దుతాస్తే క్లాంతవాహనాః
త్రిరాత్రముషితా మార్గేతే అయోధ్యాం ప్రావిశన్ పురీం

రాజ్ఞో భవమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్
శ్రీఘ్రం నివేద్యతాం రామ్ఞే దూతాన్నో జనకస్యచ

ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయ న్యవేదయన్
తే రాజవచనాద్దుతా రాజవేశ్మ దశరథం నృపం
దదృశుర్దేవ సంకాశం వృద్ధం దశరథం నృపం

జనకుని దూతలు దశరథ మహారాజు వద్దకు వెళ్ళడానికి అశ్వారూఢులై బయలుదేరి మూడుదినాలు ప్రయాణించారు . అలసిపోయిన అశ్వాలతో అయోధ్యానగరాన్ని చేరారు . రాజభవనాన్ని చేరుకుని అచటి ద్వారపాలకులతో జనక మహారాజు దూతలు వచ్చారని దశరథ మహారాజుకు నివేదించమన్నారు . అలాగే దశరథ మహారాజుకు ఆ వార్త విన్నవించారు ద్వారపాలకులు . ఆ మహారాజు అనుజ్ఞతో దూతలను దేవతా సమానుడైన వృద్ధ మహారాజు వద్దకు తీసుకొని వచ్చారు .

IMG_1268