Monthly Archives: డిసెంబర్ 2010

శ్రీమద్రామాయణము

బ్రహ్మణా  సమనుజ్ఞాతః   సోప్యుపావిశదాసనే
ఉపవిష్టే  తదా  తస్మిన్   సాక్షాల్లోకపితామహే
తద్గతేనైవ   మనసా   వాల్మీకిర్ధ్యానమాస్థితః

పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణబుధ్ధినా
యస్తాదృసం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్

శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః
జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః .

 

వాల్మీకి మహర్షి  బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఆసనం  మీద కూర్చున్నాడు. మదిలో వేటగాడు  క్రౌంచ పక్షిని వధించిన దృశ్యమే కనిపిస్తోంది. తన నోటినుండి వెలువడిన వాక్కు మరపు రాకుండా ఉంది.  బ్రహ్మ దేవుని ముందర  కూర్చొని ” మానిషాద –శ్లోకాన్ని మరోమారు  చదివాడు.

 

మానవ స్వభావాన్ని ఈ శ్లోకం చక్కగా చూపుతుంది. ఏదైనా బాధ కలిగినప్పుడు , దుఃఖానికి కారణమైన విషయమే పదే పదే గుర్తుకు వస్తుంది .  దీనినే మనం చింత లేక   స్ట్రెస్ అని  అంటాము. చింత ఎక్కువకాలం ఉంటే అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందనే విషయం  అందరికీ తెలిసిందే .  మహర్షి అయినా విషయ చింత వాల్మీకిని వదల లేదు .  కానీ రామాయణాన్ని రాయాలంటే దీర్ఘంగా అలోచించడం , భావుకుడైపోవడం  అవసరం . అదే ఇక్కడ జరిగింది. చింతించడం కూడా కొద్దిసేపే . బ్రహ్మదేవుని   ప్రేరేపణతో  రామాయణాన్ని రాయడానికి నిర్ణయించుకొన్న మరుక్షణం దుఃఖం  మటుమాయమై పోతుంది. జరిగే ఘటనలన్నీ మహర్షిని రామాయణ రచనకు ఉపక్రమింపజేయడానికి దోహదపడేవిగా  ఉండాలని భగవత్ సంకల్పం. ముందు ముందు  ఇది ఇంకా తేట తెల్ల మవుతుంది .

శ్రీమద్రామాయణము

వా ల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః

ప్రాంజ్ఞలిః ప్రయతో భూత్వా తస్థౌ  పరమ  విస్మితః

 

పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః

ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వానామయ మవ్యయం

 

అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే

వాల్మీకయే మహర్షయే సందిదేశాసనం తతః

 

భగవంతుడే  దిగి వస్తే మనిషి , మహర్షి అయినా సరే , ఏం చేస్తాడు. ఒక్కసారి అలోచించండి. మీరేం చేస్తారు ?

 

వాల్మీకి ఆశ్చర్య పడ్డాడు.  నమస్కారం చేసాడు. తేరుకున్నాక అర్ఘ్యమూ,పాద్యమూ ఇచ్చాడు (అంటే చేతులూ ,కాళ్ళూ కడుగుకోడానికి నీరు ఇచ్చాడు) .  వందనం చేసాడు. పూజించాడు.  . కూర్చోడానికి ఆసనం చూపించాడు. మౌనంగా నిలబడ్డాడు .

ఆసనం మీద కూర్చొని , చిరు నగవుతో మహర్షిని కూడా ఆసనం మీద కూర్చోమని బ్రహ్మ, వాల్మీకికి ఆసనాన్ని చూపించాడు.

శ్రీమద్రామాయణము

అజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః

చతుర్ముఖో మహాతేజా దృష్టుం తం మునిపుంగవం

 

మహర్షి అలోచనలో మునిగి ఉన్న సమయంలో ,అకస్మాత్తుగా  చతుర్ముఖుడైన  బ్రహ్మదేవుడు  మున్యాశ్రమానికి వచ్చాడు.

 

ఏదైనా మంచి పని చేయడానికి పూనుకుంటే భగవంతుని  సహాయం ఉంటుందని పెద్దలు చెపుతారు. ఇక్కడ మహర్షిని మహాకావ్య నిర్మాణానికి పూనుకోమని చెప్పడానికి చతుర్ముఖుడే దిగివచ్చాడు.

శ్రీమద్రామాయణము

స  ప్రవిశ్యాశ్రమపదం  శిష్యేణ సహ ధర్మవిత్

ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః

 

జరిగిన సంఘటన మహర్షి మదిలో నిలచిపోయింది . ఆశ్రమానికి అరుదెంచిన మహర్షి , ఆ విషయాన్నే స్మరిస్తూ , ఆసనం మీద  ఉపవిష్టుడై   జరిగిన కథనంతా జ్ఞప్తికి తెచ్చుకుంటూ , ఆ  కథనే   శిష్యునితో ముచ్చటించాడు .

 

“ఊరక రారు మహాత్ములు , వారు వచ్చుటలెల్లన్ కారణములగు మంగళములకున్ ” అని మహాత్ములను విషయంలో చెబుతారు. అదే విధంగా మహాత్ముల దృష్టిలో పడిన చిన్న విషయమైనా , మంగళానికి కారణమవుతుందని రామాయణ రచన మనకు నిరూపిస్తుంది. సున్నితమైన హృదయమూ , సునిశితమైన పరిశీలనా , ఇది ఎందుకు జరిగింది అని మనను మనం ప్రశ్నిచుకొనే తత్వమూ ,  ఇప్పుడు చేయాల్సిందేమిటి అనే ఆలోచనా ఉంటేనే గొప్ప కార్యాలను సాధించగలం . లేకపోతే మనం  ఇంతకన్నా హృదయ విదారకమైన దృశ్యాలు ఎన్ని కనబడినా  చూసీ చూడనట్టు పోతామే కాని ,వాటిని గురించి ఆలోచించం. ఆలోచించినా దానికి  కార్యరూపం ఇవ్వం. ఇదే మహాత్ములకూ  మామూలు మనుష్యులకూ ఉండే తేడా .

శ్రీమద్రామాయణము

శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వామనుత్తమం

ప్రతిజగ్రాహ సంతుష్ట తుష్టోభవద్గురుః


వాల్మీకి మహర్షి మాటలను శిష్యుడు  మననం చేసి కంఠస్థం చేసాడు.



సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి ,

తమేవ చింతయన్నర్థముపావర్తత వై మునిః

భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ మునిః

కలశం పూర్ణమాదాయ  పృష్టతోనుజగామ హ

 

మహర్షి స్నానం చేసి , జరిగిన సంఘటనను గురించి ఆలోచిస్తూ ఆశ్రమమానికి తిరిగి బయలుదేరాడు.  వినయం మూర్తీభవించిన భరద్వాజుడు జలంతో నిండిన కలశాన్ని తీసుకొని , మహర్షి వెనకే వెళ్ళాడు.


శ్రీమద్రామాయణము

తస్యేవం  బ్రువతశ్చింతా  బభూవ   హృది వీక్షతః ,

శోకార్తేనాస్య   శకునేః కిమిదం  వ్యాహృతం  మయా

 

చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్

మతింశిష్యం  చైవాబ్రవీద్వాక్యమిదం  స మునిపుంగవః

 

పాదబధ్ధో క్షర  సమస్తంత్రీ  లయ సమన్వితః

శోకార్తస్య  ప్రవృత్తో  మే శ్లోకో భవతు వాన్యథా .

 

మహర్షి  నోటినుండి వెలువడిన పలుకులు , మహర్షికే ఆశ్చర్యం కలిగించాయి .  తన శిష్యులతో “ఈ పక్షి బాధ, నా హృదయాన్ని కలచివేసిన సమయంలో  వెలువడ్డ  ఈ పలుకులు , పాదబధ్ధంగా, లయతో కూడి   తంత్రీ వాద్యాలలో కూర్చడానికి అనువుగా ఉన్నాయి. నాలుగు పాదాలలో కూడిన ఈ కూర్పు శోకం నుండి  వెలువడింది కావున ఇది శ్లోకం  అని ప్రసిధ్ధి చెందుగాక .”  అని అన్నాడు.

 

కొత్త  ఆవిష్కరణలు మామూలుగా  మనకు తెలియకుండానే  ఆవిర్భవిస్తాయి, వాల్మీకి నోటినుండి వెడలిన శ్లోకం లాగా . ప్రస్తుతకాలంలో  ఎక్స్ రే ,ఇన్సులిన్ లాంటివి  కూడా ఈ కోవకు చెందుతాయి. అయితే ఇవి సంభవించినప్పుడు , ఇది కొత్తవిషయం ,దీనివల్ల మానవాళి కుపయోగం అని గుర్తుపట్టే మేధావులున్నప్పుడు మాత్రమే అవి అందరకూ తెలుస్తాయి. వీటిని గుర్తు పట్టడానికి నిశిత పరిశీలన కావాలి. అనుకోకుండా  పలికిన పలుకులలోని మధురిమను గుర్తించినవాడు వాల్మీకి. ఆ పలుకులు నవనవోన్మేషంగా , వీనులకు విందుగా ,వీణా తంత్రుల మీద వాయించడానికి అనువుగా  ఉంటాయనీ  , అవి కవితలల్లడానికి  అత్యుత్తమమనీ గ్రహించిన కుశాగ్రబుధ్ధి అతనిది. మహనీయుడతడు. గ్రహించి ఊరుకోలేదు. కావ్యం రాయడానికి నడుం కట్టాడు. మానవాళికి అందమైన  రామాయణ కావ్యాన్ని అందించాడు. ఈ కావ్యంలో మంచి సందేశాలెన్నో సమకూర్చాడు . ఒక ఇతిహాసాన్ని,  ఇహ, పర సాధనంగా మార్చాడు. గొప్ప పనులు చేయాలనుకొంటే మనం కుశాగ్రబుధ్ధులం కావాలి.

కుశాగ్ర బుధ్ధి కావాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం నిశితంగా పరిశీలించగలగాలి .   పరిశీలించటమే కాదు , మనను మనం  ప్రశ్నించుకోడంకూడా అవసరం. అసలిదేమిటి , ఇలా ఎందుకు అవుతోంది,   ఇదే పనిని ఇంకో విధంగా చేయడం సాధ్యమా , దీనివలన లాభాలున్నాయా లాంటి ప్రశ్నలు మనను మనం నిరంతరంగంగా వేసుకుంటే , మన బుధ్ధి కుశాగ్రమవుతుంది. దీనికి ఎంతో సమయం సాధన , కృషి అవసరం. ఇది మాత్రమే సరిపోదు. అనుకోకుండా కొన్ని అనూహ్య సంఘటనలు మనముందు జరగాలి . అవి జరిగినప్పుడు , మనం వాటిని సాధన చేసి సాధించిన బుధ్ధితో గుర్తుపట్టగలగాలి. శోధించాలి .మర్మం కనుగొనాలి. కనుగొన్నదాన్ని   ఏ విధంగా ఆచరణలోకి తీసుకొని రావాలో ఆలోచించాలి . తరవాత ఆచరణలోకి తీసుకొని రావాలి. అప్పుడుగానీ  సార్థకత చేకూరదు .

 

“పురుషులందు పుణ్యపురుషులు వేరయా ”  అని వేమన చెప్పినట్టు ,  బహు కొద్దిమంది మాత్రమే  మానవాళి కుపయోగపడే మహత్తర కార్యాలు చేయగల  శక్తి ,సామర్థ్యాలను సంపాదించుకోగలరు. ఇది కష్టసాధ్యమైనా , పట్టుదలతో కష్టపడితే  తప్పకుండా సాధ్యమవుతుంది.

శ్రీమద్రామాయణము

It was a pleasant evening in the forest. The serene surroundigs were very conducive to undisturbed thought process . Maharshi Valmiki was in deep contemplation inside his hermitage.The morning incident is still playing in front of his eyes. He was walking towards the Tamasa river for his ritual bath along with his disciple Bharadwaja.The chirpings from the birds all along forest trail were musical and he was was musing over nature’s marvels as he walked. His mind was at peace and the sight of Tamasa filled him with joy and he exhorted:

 

అకర్దమ మిదం తీర్థం , భరద్వాజ నిశామయ

రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా

 

Bharawaaja ! look at Tamasa river. Its beautiful, waters are calm and crystal clear. They are akin to the unruffled mind of a sage. I would like to take bath in these pious waters. Saying thus he started strolling along the banks of the river. While he was strolling he saw a pair of krauncha birds making love. The romantic krauncha couple were in ecstacy and forgot the surroundings completely. The observant maharshi went into deep thought wondering about the mysteries of nature , creation, physical relationships and bondings. His thought process broke all of a sudden as he found the male krauncha bird was hit by the arrow of an arrogant archer. The bird died instantly . The female bird was in anguish and was not able to bear the loss of her mate as great sorrow engulfed it. . The scene was heart rendering. The tender heart of the sage could not bear this sight . Almost as reflex action a poem spurt out from the lips of the sage , in sanskrit. (This poem was the first Sloka in sanskrit and Valmiki was hailed as adikavi-the first poet.).

 

maa nishaada pratishthaam tva
maagamah shaashvateeh samaah
yat krauncha mithunaadekam
avadheeh kaama mohitam

 

మా నిషాద ప్రతిష్థాం

త్వమగమః శాశ్వతీ స్సమాః

యత్ క్రౌంచ మిథునాదేకం

అవధీః కామ మోహితం.

 

O ! nishaada, you killed a bird while it was making love . You will remain permanently infamous for this treacherous act and you will not live long.

 

This poem is aptly named as Shloka as it originated from the shoka or emotional distress of Valmiki. Since morning this incident is ringing bells in the mind of maharshi.He began wondering why he was so moved at the plight of the birds , particularly when he himself was killing animals for a living earlier. Why he cursed the nishada. Though these words were uttered in anguish , they were musical and novel. To what purpose these words came in his mind.

శ్రీమద్రామాయణము

క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం

 

మా నిషాద ప్రతిష్ఠాం  త్వమగమః శాశ్వతీ స్సమాః

యత్ క్రౌంచ మిథునా దేక మవధీః కామమోహితం

ఓ నిషాదుడా (బోయవాడా)  నీవు క్రీడించుచున్న  క్రౌంచ పక్షిని  చంపినావు. అందువలన నీవు ఎక్కువ సంవత్సరములు జీవించకుందువు గాక.

మహర్షి శోకం శ్లోకమయింది.పలికిన పలుకులు చందోబధ్ధ మయ్యాయి. నవరసాలనూ నవనవోన్మేషంగా  కళ్ళముందర  సాక్షాత్కరింపజేసే కవిత్వం ఇక ఆరంభమయింది .సులభంగా పాడటానికీ అవసరమైతే కంఠస్థం  చేసుకోడానికీ అనుకూలంగా ఉన్నాయా పలుకులు . ఆ శబ్దాలలో కొన్ని కుసుమ కోమలాలు , మరి కొన్ని వజ్ర కఠోరాలు . కిలకిలా నవ్వించే శబ్దాలూ కొన్నైతే  మురిపించి లాలించే శబ్దాలు మరికొన్ని. వేల సంవత్సరాలనుండీ  పండిత పామరులనందరనూ ఆనంద డోలికలలో ఊగించిందా కవిత్వం . భారతీయులందరికీ అది ఆదర్శం . మహర్షి చూపిన మార్గంలో పయనించి పునీతులయిన వారెందరో . మనమూ ఆ గ్రంధాన్ని చదివి , వీలైతే అనుసరించి మన జీవితాలను ధన్యం చేసుకొందాం . రండి , ఇదే మీకు ఆహ్వానం.  ఈ శ్లోకంతో వాల్మీకి మహర్షి ” ఆదికవి ” అయ్యాడు. మహర్షి ముఖస్తంగా  కవిత్వం జాలువారింది.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్యకవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం .

వాల్మీకి మహర్షి  కవిత్వమనే కొమ్మమీద కూర్చొని రామా రామా అంటూ మధురంగా ఆలపిస్తున్నాడు. ఆ కవి కోకిలకు ఇదే వందనం.

శ్రీమద్రామాయణము

తస్యాభ్యాసే తు మిథునం చరంతమనపాయినం  ,

దదర్శ భగవాన్ తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం.

 

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః

జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః

 

తం శోణితపరీతాంగం  వేష్టమానం  మహీతలే ,

భార్యా తు నిహతం దృష్ట్వా  రురావ  కరుణాం గిరం .

 

వియుక్తా  పతినా  తేన  ద్విజేన  సహచారిణా ,

తామ్రశీర్షేణ  మత్తేన  పత్రిణా  సహితేన  వై .

 

తదా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ,

ఋషేర్దర్మాత్మనస్తస్య  కారుణ్యం  సమపద్యత .

 

తతః   కరుణవేదిత్వాదధర్మోయమితి  ద్విజః

నిశామ్య  రుదతీం  క్రౌంచీమిదం  వచనమబ్రవీత్ .

 

వాల్మీకి మహర్షి  అందాలను  అస్వాదిస్తూ  మెల్లి మెల్లిగా వనంలో విహరిస్తున్నాడు.  ఇంతలో ఒక క్రౌంచ పక్షుల జంట క్రీడిస్తూ  కంట పడింది. ఆనందంతో క్రీడిస్తున్న ఆ జంటను చూసి మహర్షి ముగ్ధుడై పోయాడు.   ఇటువంటి సమయంలో  ఒక బోయవాడు  బాణంతో మగ  క్రౌంచ పక్షిని వధించాడు .  ఆడ క్రౌంచం దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవడం మొదలు పెట్టింది.  దృశ్యం హృదయవిదారకంగా ఉంది. మామూలు మనుష్యులకే బాధ కలిగించే దృశ్యం , సున్నితమైన వాల్మీకి మహర్షిని కదలించివేసింది..   బాధా  , కరుణా, జాలీ , ఒక్కసారిగా మహర్షిని ముంచివేసాయి.   భావోద్రేకానికి గురి అయ్యాడు. మహర్షి పెదాలు  తీయని పదాలు పలికాయి .  ఆపదాల కూర్పు అతి సుందరం . ఆ కూర్పునే శ్లోకం అని అన్నారు . ఇంకోరకంగా చెప్పాలంటే శ్లోకావిర్భావమైంది .ఇదంతా తెలిసిన కథే .

ఆ ఆది శ్లోకాన్ని మనమందరం ఎన్నోమార్లు విన్నాం .అయినా తనివితీరదు. అందుకే మరోసారి .

శ్రీమద్రామాయణము

న్యస్యతాం   కలశస్తాత దీయతాం వల్కలం మమ

ఇదమేవావగాహిష్యే  తమసాతీర్థముత్తమం .

 

ఏవముక్తో  భరద్వాజో  వాల్మీకేన మహాత్మనా

ప్రాయచ్ఛత  మునేస్తస్య  వల్కలం నియతో గురోః .

 

స శిష్యహస్తాదాదాయ  వల్కలం నియతేంద్రియః

విచచార హ పశ్యం స్తత్సర్వతో విపులం వనం .

 

“నాయనా భరద్వాజా జలపాత్రను కింద ఉంచి నాకు నారచీరను ఇవ్వు” అని అన్నాడు వాల్మీకి. చెప్పిన విధంగా చేసాడు భరద్వాజుడు. ఆ నార చీరను గ్రహించి ,  పులకితుడైన మహర్షి పృకృతి అందాలను ఆస్వాదిస్తూ  వనంలో సంచరించడం మొదలు పెట్టాడు.

 

శిష్యుడు  ఎల్లవేళలా గురువు ననుసరించి చెప్పిన పాఠమే కాకుండా , గురువుగారి జీవనసరళిని  చూసి నేర్చుకుంటాడు .  చెప్పిన దానిని ఆచరించి చూపిన వాడే ఆచార్యుడు. శిష్యుడు తనను చూసి దారితప్పుతాడనే భయం ఉండడంవల్ల , గురువు ఋజుమార్గం వదలడు. మాట్లాడే మాటలు  కూడా మధురంగా ,మనస్సుకు ఆహ్లాదం కలిగించేవిగా ఉంచడానికి ప్రయత్నం చేసేవాడుసంతుష్టుడైన గురువు తన విద్యనంతా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా శిష్యునకు  ధార పోసేవాడు .శిష్యున్ని కన్నకొడుకు కంటే ఎక్కువగా చూసుకొనేవాడు .తన మనసు లోని భావాలను దాచుకోకుండా  శిష్యునకు చెప్పేవాడు  గురువు. . శిష్యుడు , చిన్న చిన్న సపర్యలతో గురువుకు సంతోషం  కలిగించేవాడుఎక్కువగా మాట్లాడకుండా  చూసినదీ , చెప్పినదీ  అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేసేవాడు  . దాన్నే తన తన రోజువారీ జీవితంలో వాడుకొనేవాడు. గురువుగారి నోట్లోనుంది వెలువడే  ప్రతిమాటా చాలా ముఖ్యం ఆనాటి విద్యార్థికి.అలా అని చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మమని అనకుండా ,ప్రశ్నలు వేయమని ప్రొత్సహించేవారా గురువులు.గురుశిష్యుల మధ్యలో  ప్రేమ ,పరస్పర గౌరవం , అనురాగం, ఉండేవి .

అందుకే ఆ కాలంలో చదువు బాగా అబ్బేది. శిష్యులను అపురూపంగా చూసుకొనే గురువులే కరువయ్యారీ రోజు. గురువులను గౌరవించే శిష్యులూ తక్కువే.