Monthly Archives: జూన్ 2017

రామాయణం

తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిం

ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం

ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః
శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః

కుమారుని వివాహాన్ని చేయించమని జనకుడు కోరాడు కదా ! దానికి ప్రత్యుత్తరంగా ఋషుల సమక్షంలో, జనక మహారాజుతో ,దశరథ మహారాజు ” ధర్మజ్ఞా ! ప్రతిగ్రహో దాతృవశః , అంటే ఇవ్వడమనేది దాత చేతిలో ఉంటుంది అని పూర్వం విని ఉన్నాను . దాత ఇచ్చినప్పుడే ప్రతిగ్రహీత తీసుకుంటాడు . తమరు కన్యాదానం చేయడానికి నిర్ణయించారన్న విషయాన్ని విన్నాను . తమరు దాత . తమరు ఏ విధంగా చెబుతారో నేను ఆవిధంగా చేస్తాను ” అని మధురంగా పలికాడు . ఎల్లప్పుడూ సత్యమే పలికే దశరథుని నోటినుండి వెడలి ధర్మంతో కూడి , యశస్సును చేకూర్చే మాటలనువిన్న జనకుడు ఆశ్చర్య పడ్డాడు .

విశేషం : ప్రస్తుతం వరుని తలిదండ్రులు , బంధువులు వ్యవహరించే విధానం , గొంతెమ్మ కోర్కెలు కోరడం మనకు తెలుసు . వధువు తండ్రిని ఇక్కట్ల పాలు చేయడం సాధారణం . కానీ ఇది మన సంస్కృతి కాదు . వివాహం వధువు తండ్రికి నచ్చిన / సాధ్యమైన రీతిగానే జరిగేది , జరగాలి కూడా . వధువు తండ్రితో ఏ విధంగా మర్యాదా పూర్వకంగా మాట్లడాలో రామాయణం తెలియజేస్తుంది . dsc07737_4979289904_o.jpg

తతః సర్వే మునిగణాః పరస్పర సమాగమే
హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్ సుఖం

రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః
ఉవాస పరమప్రీతో జనకేన సుపూజితః

జనకోపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ

రామ లక్ష్మణులను చూసి పరమానంద భరితుడయ్యాడు దశరథుడు .  జనకుని సత్కారాలాను స్వీకరించి సంతోషించిన దశరథ మహారాజు రాత్రి తన నివాసంలో సుఖంగా గడిపాడు .

ధర్మతత్త్వాలను తెలిసిన జనక మహారాజు యజ్ఞ సంబంధ మైన కర్మలను , ఇతర క్రియలను చేసి ఆ రాత్రి గడిపాడు .

విశేషం : వివాహాది శుభకార్యాలు గణపతి పూజతో ఆరంభ మవుతాయి , వైష్ణవులైతే విష్వక్సేనారాధనతో శుభ కార్యాలను ప్రారంభిస్తారు .

1 . గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవస్తమం , జ్యేష్ఠ రాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశ్శృ ణ్వన్నూతి భి స్సీదసాదనం ”

2 .దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి ! సా నో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు ”

3 . వివాహం జరిపించడానికి ముందు స్నానం చేసి , ధౌత వల్కలాలను ధరించి ,దర్భలను గ్రహించిన పవిత్ర పాణితో (చేతితో ) ఆచమనం చేసితలపెట్టిన కార్యాన్ని ప్రారంభించడానికి ” నమస్సదసే , నమస్సదసస్పతయే — ” అంటూ భాగవతోత్తముల అనుజ్ఞను పొందుతాడు కర్త . “సర్వేభ్యః శ్రీ –నమః “అని నమస్కారం చేసి , పృకృత కర్మారంభ ముహూర్త స్సుముహూర్తో స్త్వితి భవంతో మహాంతో అనుగృహ్ణంతు ” ( ప్రస్తుతం కర్మను ప్రారంభించిన ముహూర్తం సుముహూర్తమని మహానుభావులైన తమరు అనుగ్రహించుదురుగాక “”లగ్నస్య సర్వే గ్రహాః ఏకాదశ స్థాన ఫలదాః సుప్రసన్నా భూయాసురితి భవంతో మహాంతో అనుగ్రహ్ణంతు ” — ” ఈ లగ్నంలో ఉన్న గ్రహాలన్నీ మనం చేసుకుంటున్న శుభకర్మకు అనుకూలించుగాక ” అని పలికి దర్భాసనం మీద ధర్మ పత్నితో కూర్చొని విష్వక్సేన పూజకు ఉపక్రమిస్తాడు కన్యా దాత .

3 . శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! అస్య శ్రీ భగవతో మహాపురుషస్య , శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యయా , ప్రవర్తమానస్య , అద్యబ్రహ్మణః,ద్వితీయ పరార్థే , శ్రీ శ్వేత వరాహ కల్పే , వైవస్వత మన్వంతరే ,
కలియుగే , ప్రథమ పాదే , జంబూ ద్వీపే , భరతవర్షే , భరత ఖండే ,శకాబ్దే , మేరోః దక్షిణ దిగ్భాగే , శ్రీరంగస్యోత్తర దేశే గంగా కావేర్యోః మధ్య దేశే , అస్మిన్ వర్తమాన చాంద్ర మానేన , ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే , –సంవత్సరే , –ఆయనే — , ఋతౌ — , మాసే –, పక్షే — , తిథౌ — , వారే —, నక్షత్రే — , శుభయోగే , శుభకరణే , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం , శుభతిథౌ , శ్రీ భగవదాజ్ఞ్యయా , భగవత్ కైంకర్య రూపం , కరిష్యమాణస్య , పృకృతకర్మణః అవిఘ్నేన పరిసమాప్యర్థం , ఋధ్యర్థం అదౌ శ్రీ విష్వక్సేన పూజాం కరిష్యామి .

అని సంకల్పించి తలపెట్టిన కార్యాన్ని ప్రారంభిస్తాడు కర్త .

 

 

రామాయణం

తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిం

ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం

ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః
శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః

కుమారుని వివాహాన్ని చేయించమని జనకుడు కోరాడు కదా ! దానికి ప్రత్యుత్తరంగా ఋషుల సమక్షంలో, జనక మహారాజుతో ,దశరథ మహారాజు ” ధర్మజ్ఞా ! ప్రతిగ్రహో దాతృవశః , అంటే ఇవ్వడమనేది దాత చేతిలో ఉంటుంది అని పూర్వం విని ఉన్నాను . దాత ఇచ్చినప్పుడే ప్రతిగ్రహీత తీసుకుంటాడు . తమరు కన్యాదానం చేయడానికి నిర్ణయించారన్న విషయాన్ని విన్నాను . తమరు దాత . తమరు ఏ విధంగా చెబుతారో నేను ఆవిధంగా చేస్తాను ” అని మధురంగా పలికాడు . ఎల్లప్పుడూ సత్యమే పలికే దశరథుని నోటినుండి వెడలి ధర్మంతో కూడి , యశస్సును చేకూర్చే మాటలనువిన్న జనకుడు ఆశ్చర్య పడ్డాడు .

విశేషం : ప్రస్తుతం వరుని తలిదండ్రులు , బంధువులు వ్యవహరించే విధానం , గొంతెమ్మ కోర్కెలు కోరడం మనకు తెలుసు . వధువు తండ్రిని ఇక్కట్ల పాలు చేయడం సాధారణం . కానీ ఇది మన సంస్కృతి కాదు . వివాహం వధువు తండ్రికి నచ్చిన / సాధ్యమైన రీతిగానే జరిగేది , జరగాలి కూడా . వధువు తండ్రితో ఏ విధంగా మర్యాదా పూర్వకంగా మాట్లడాలో రామాయణం తెలియజేస్తుంది .

IMG_5174

రామాయణం

ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్వితః
స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ
పుత్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్య నిర్జితాం

దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవానృషిః
సహ సర్వైర్ ద్విజ శ్రేష్ఠైర్దేవైరివ శతక్రతుః

దిష్టా మే నిర్జితా విఘ్నా దిష్ట్యామే పూజితం కులం
రాఘవైః సహ సంబంధా ద్వీర్య శ్రేష్థై ర్మహాత్మభిః

శ్వః ప్రభాతే నరేంద్రేన నిర్వర్తయితు మర్హసి
యజ్ఞ్స్యాంతే నరశ్రేష్ఠ వివాహమృషి సమ్మతం

” మహారాజా తమకు స్వాగతం . నా భాగ్యం చేత తమరు మిథిలకు వచ్చారు . పుత్రుల పరాక్రమంతో లభించిన ఆనందాన్ని తమరిప్పుడు చవి చూడగలరు .

తేజోమయుడైన వసిష్ఠుడు ఇతర బ్రాహ్మణోత్తములతో కలిసి –శతక్రతువులు చేసిన దేవేంద్రుడు ఇతర దేవతలతో కూడి వచ్చిన విధంగా — నా గృహాన్ని పావనం చేసాడు . ఇదంతా నా భాగ్యం .

మహాత్ములు , అతులిత పరాక్రమవంతులు అయిన రాఘవులతో సంబంధం వలన (ఈ శుభదినాన ) నా వంశం పూజనీయమైనది . వివాహానికి విఘ్నాలన్నీ తొలగిపోయినాయి .

రేపు ప్రభాత సమయాన యజ్ఞం చేసి అటుపిదప ఋషులకు సమ్మతమైన వివాహాన్ని జరిపించమని నా ప్రార్థన ” అని జనకుడు వినయ పూర్వకంగా దశరథమహారాజును కోరాడు .

 

విశేషం:

శివ ధనుర్భంగా చేసే వీరులు పృథ్విలోలేరొమో , తన కుమార్తె కన్యగానే ఉండిపోవలసి వస్తుందేమోనని అనుకున్న జనకుని సందేహం పటాపంచలై పోయింది . లోకోత్తరుడైన ధనుర్ధారి అల్లునిగా లభించాడు . ప్రపంచంలో ఏ కుమార్తె తండ్రికి ఇంతకంటే భాగ్యం లభిస్తుంది ?

కన్యా వరయతే రూపం
మాతా విత్తం పితా శ్రుతం
బాంధవాః కుల మిచ్ఛంతి

అని మనుస్మృతిలో చెప్పిన విధంగా అందరికీ వారి వారికి కావలసినవి లభించాయి .
IMG_0200

 

 

 

 

రామాయణం

గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివాన్
రాజా తు జనకః శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్

తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపం
జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ

చతురంగ బలాలతో కూడి మిథిలా నగరానికి బయలుదేరాడు దశరథ మహారాజు . నాలుగు రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరాడు . దశరథుడు రాత్రి విశ్రమించిన ప్రాంతాలలో సత్కారాలను సమకూర్చాడు జనకుడు . మిథిలకు చేరగానే సంతోషించి స్వయంగా  ఆ మహారాజును కలుసుకున్నాడు .

విశేషం : అయోధ్యా నగరాన్నుండి మిథిలకు నాలుగు రోజుల ప్రయాణం . ఈ ప్రదేశాల మధ్య దూరం రమారమి 470 కిలోమీటర్లు ఉంటుంది . అంటే దశరథ మహారాజు ప్రతిదినమూ 120 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు .

IMG_1354.jpg

సీతా స్వయంవరంలోని విశేషం : రాముని ధనుర్యాగానికి తీసుకుని వెళ్ళింది విశ్వామిత్రుడు .వెళ్ళేముందు దశరథ మహారాజు అనుమతి తీసుకోలేదు .శివుని విల్లును ఎక్కుపెట్టమని అనుజ్ఞ ఇచ్చింది కూడా ఆ మహర్షే . ధనువు ఎక్కుపెట్టిన పిదప రామునితో సీతా వివాహానికి నిర్ణయించింది జనకుడు . అంటే అమ్మాయి తండ్రి . తన ఉపాధ్యాయుల అనుమతితో దశరథునికి వివాహానికి తరలి రమ్మని కబురు పంపాడు జనకుడు . అనుజ్ఞ కోరడం మర్యాదా పూర్వకంగానే కనిపిస్తుంది .వివాహ విషయంలో వరుని తండ్రి కంటే వధువు తండ్రి నిర్ణయమే ముఖ్యంగా భావించేవారేమో ఆ కాలంలో ? వివాహ విషయంలో వరుని తండ్రి కంటే వధువు తండ్రి నిర్ణయమే ముఖ్యంగా భావించేవారేమో ఆ కాలంలో ? కుమార్తెను ఇవ్వాలని నిశ్చయించుకున్నాక వరుని తండ్రి అంగీకారాన్ని తీసుకునేవారని రామాయణం స్పష్టంగా తెలియజేస్తున్నది .

 

రామాయణం

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయః సబాంధవః
రాజా దశరథో హృష్టః సుమంత్ర మిదమబ్రవీత్

అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలం
వ్రజంత్వగ్రే సువిహితా నానారత్న సమన్వితాః

చతురంగ బలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశః
మమాజ్ఞా సమకాలం చ యానయుగ్య మనుత్తమం

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః
మార్కణ్దేయశ్చ దీర్ఘాయుః ఋషిః కాత్యనస్తథా

ఏతే ద్విజాః ప్రయాంత్వగ్రే స్యందనం యోజయస్వ మే
యథా కాలాత్యయో న స్యాద్దూతా హి త్వరయంతి మాం

వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిణీ
రాజానమృషిభిః సార్థం వ్రజంతం పృష్ఠతోన్వగాత్DSC02297

జనకుని దూతలు రాత్రి అయోధ్యలో విశ్రమించారు . ఉషోదయం కాగానే దశ్రథ మహరాజు తన బంధువులను , గురువులను సమావేశ పరిచాడు . మంత్రి అయిన సుమంత్రుని పిలిచి ” అందరు ధనాధ్యక్షులూ పుష్కలంగా ధనాన్ని , వివిధ రత్నాలను గ్రహించి సిద్ధంగా ఉండి , సేనకు అగ్ర భాగంలో నిలవాలి . నేను ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణం చతురంగ బలాలు , శ్రేష్ఠమైన రథాలు , అలంకరింపబడ్డ పల్లకీలు మిథిలా నగరానికి ప్రయాణమై వెళ్ళాలి . వసిష్థ , వామదేవ , కాశ్యప , కాత్యాయన , జాబాలి మహర్షులూ , దీర్ఘాయుర్దాయం గల మార్కండేయ మహర్షీ మొదలుగాగల ద్విజులను నా రథానికి అగ్ర భాగాన నిలపాలి . ఆ మహాత్ముల వెనువెంటనే నా స్యందనం వెడుతుంది . నా రథాన్ని సిద్ధం చేయి .  విలంబనం వద్దు . జనకుని దూతలు నన్ను తొందరగా బయలుదేరమని కోరుతున్నారు ” అని  ఆజ్ఞాపించాడు .

రామాయణం

దూత వాక్యం చ తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షితః
వసిష్ఠం వామదేవం చ మంత్రిణోన్యాంశ్చ సో బ్రవీత్

గుపతః కుశికపుత్రేణ కౌసల్యా నందవర్ధనః
లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ

దృష్ట వీర్యస్తు కాకుత్థ్సో జనకేన మహాత్మనా
సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్ఛతి

యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః
పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః

మంత్రిణో బాఢమిత్యాహుః సహ సర్వైర్మహర్షిభిః
సుప్రీతశ్చా బ్రవీద్రాజా శ్వో యాత్రేతి స మంత్రిణః

మంత్రిణస్తు నరేంద్రస్య రాత్రిం పరమసత్కృతాః
ఊషుస్తే ముదితాః సర్వే గుణైః సర్వైః సమన్వితా

 

దూతల మాటలు విన్న దశరథ మహారాజు హర్షంతో పొంగిపోయాడు . పరివేష్ఠించి ఉన్న వసిష్థ , వామదేవులతో , ఇతర మంత్రి సత్తములతో ” ప్రస్తుతం కౌసల్యా నంద వర్ధనుడు ,విశ్వామిత్రమహర్షి రక్షణలో విదేహ దేశంలో వసించి ఉన్నాడు . సోదరుడు లక్ష్మణ కుమారుడు కనురెప్పలా రాముని అనుసరించి ఉన్నాడు . రామచంద్రుని వీర్యాన్ని కనులారా చూసాడు మహాత్ముడు జనకుడు . రాముని ప్రతిభకు మెచ్చి వైదేహిని వివాహ పూర్వకంగా రాఘవునికి ప్రదానం చేయాలని అనుకుంటున్నాడు . మన అనుమతి కోరుతున్నాడు . జనక మహారాజు సంబంధం మీకు సమ్మతమైతే ఆలస్యం చేయకుండా మనము మిథిలా నగరానికి బయలుదేరి వెడదాము అని వారి అనుమతి కోరాడు . మంత్రులు , మహర్షులు సంతోషంతో సీతతో సంబంధానికి అంగీకరించారు . మరుసటిరోజే ప్రయాణానికి నిర్ణయించి , తమను ఆహ్వానించిన జనకుని మంత్రులకు సత్కారం చేసి రాత్రి తమ నగరంలో ఉండమని కోరాడు దశరథుడు .

విశేషం : దశరథ మహారాజు  తన కుమారుని వివాహ విషయలో స్వంతంగా నిర్ణయం తీసుకోవచ్చు . అయినా వసిష్ఠ వామదేవుల అనుజ్ఞ తీసుకున్న పిదపే , వివాహానికి ఒప్పుకున్నాడు . పూర్వకాలంలో రాజులు , విజ్ఞులకిచ్చే గౌరవం ఈవిధంగా ఉండేది . మంచి చెడ్డలు విచారించి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో సలహా ఇచ్చేవారు ఆ ఋషిసత్తములు , మంత్రులు . ఆ విధంగా తీసుకున్న నిర్ణయాలు హేతుబద్ధంగా ఉండి అందరికీ క్షేమాన్ని /లాభాన్ని కలిగించేవి .

Isn’t this democracy in practice ? Taking opinion from the intellectuals and qualified before taking a decision is the right approach to my mind .

 

 

IMG_2513.jpg