Monthly Archives: ఆగస్ట్ 2017

రామాయణం

రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతం
బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవం

గతో రామ ఇతి శ్రుత్వా హృష్ట్వః ప్రముదితో నృపః
పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవచ

చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీం
పతాకాధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్ట నినాదితాం

సిక్త రాజ పథాం రమ్యాం ప్రకీర్ణ కుసుమోత్కరాం
రాజప్రవేశ సుముఖైః పౌరై ర్మంగలవాదిభిః
సంపూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైస్సమలంకృతాం

పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః
పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం పునః

 

రాముని మాటలు విన్న దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోయాడు . తన పుత్రులకు పునర్జన్మ లభించిందని భావించాడు . రామచంద్రుణ్ణి తనివితీరా కౌగిలించుకున్నాడు .తలను మూర్కొన్నాడు (వాసన చూసాడు) . తన సైన్యాన్ని కదలమని ఆజ్ఞాపించాడు . పరివారంతో సహా అయొధ్యానగరాన్ని చేరాడు . ఆ పట్టణ వాసులు మహారాజుకూ అతని పరివారానికీ తూర్యారవాలతో ( ట్రంపెట్) స్వాగతం పలికారు . పుర వీధులన్నిటా పతాకాలు (జెండాలు ) ఎగుర వేసారు . రాజమార్గాలను జలంతో తడిపి పుష్పాలతో అలంకరించారు . మంగళ వాయిద్యాల ఘోష ప్రతిధ్వనిస్తుండగా దశరథ మహారాజు అయోధ్యలో ప్రవేశించాడు . శ్రీమంతుడైన రాజు శ్రీమంతులైన తన పుత్రులు తనను పరివేష్టించి రాగా నగర వాసులు ఎదురేగి స్వాగతం పలికారు . నగరంలో ప్రవేశించిన మహారాజు హిమాలయాలతో పోటీపడగల తన స్వగృహంలోకి అడుగుపెట్టాడు .

రామాయణం

బాలకాండంలో చివరిదైన డెబ్బదిఏడవ సర్గ :

గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం

అభివాద్య తతో రామో వసిష్ఠ ప్రముఖాన్ ఋషీన్
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన

జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ
అయోధ్యా భిముఖీ సేనా త్వయా నాథేన పాలితా

సందిశస్వ మహారాజ సేనాం త్వచ్ఛాసనే స్థితాం
శాసనం కాంక్షతే సేనా చాతకాళిర్జలం యథా

పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనుస్సును స సాయకంగా (బాణాలతో సహా ) అప్రమేయుడైన వరుణుని హస్తంలో ఉంచాడు పుణ్యుడు శ్రీరామచంద్రుడు . ప్రముఖులైన వసిష్ఠాది ఋషులకు వందనం చేసాడు . విహ్వలుడై ఉన్న తండ్రికి అంజలి ఘటించి ” పరశురాముడు వెళ్ళిపోయాడు . నీచేత పాలింపబడే చతురంగ బలాలతో కూడిన సేన అయోధ్యాభిముఖంగా బయలుదేరవచ్చు . మహా రాజా ! బయలుదేరమని తమ సైన్యాన్ని ఆజ్ఞాపించండి . చాతక పక్షి జలాన్ని కోరినట్లుగా సైన్యం అయోధ్యాభిముఖంగా బయలు దేరడానికి తమ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నది “అని మధురంగా పలికాడు .

రామాయణం

బాలకాండంలో చివరిదైన డెబ్బదిఏడవ సర్గ :

గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం

అభివాద్య తతో రామో వసిష్ఠ ప్రముఖాన్ ఋషీన్
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన

జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ
అయోధ్యా భిముఖీ సేనా త్వయా నాథేన పాలితా

 

పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనుస్సును స సాయకంగా (బాణాలతో సహా ) అప్రమేయుడైన వరుణిని హస్తంలో ఉంచాడు పుణ్యుడు శ్రీరామచంద్రుడు . ప్రముఖులైన వసిష్ఠాది ఋషులకు వందనం చేసాడు . విహ్వలుడై ఉన్న తండ్రికి అంజలి ఘటించి ” పరశురాముడు వెళ్ళిపోయాడు . నీచేత పాలింపబడే చతురంగ బలాలతో కూడిన సేన అయోధ్యాభిముఖంగా బయలుదేరవచ్చు . మహా రాజా ! బయలుదేరమని తమ సైన్యాన్ని ఆజ్ఞాపించండి . చాతక పక్షి జలాన్ని కోరినట్లుగా సైన్యం అయోధ్యాభిముఖంగా బయలు దేరడానికి తమ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నది “అని మధురంగా పలికాడు .

రామాయణం

అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం
ధనుషోస్య పరామర్శాత్ స్వస్తి తేస్తు పరంతప

ఏతే సురగణాః సర్వే నిరీక్షంతే సమాగతాః
త్వామప్రతి కర్మాణమప్రతిద్వంద్వ మాహవే

న చేయం మమ కాకుత్థ్స వ్రీళా భవితు మర్హతి
త్వయా త్రైలోక్య నాథేన యదహం విముఖీకృతః

శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత
శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం

పరశరాముడు ఇంకా ఈవిధమగా పలికాడు . “రామా నీకు స్వస్తి (శుభం కలుగు గాక ) . ఈ ధనుస్సును ఎక్కుపెట్టగలిగినవాడు సురేశ్వరుడు (దేవతలకు రాజు ) , మధువనే రాక్షసున్ని నిర్జిన వాడు , అక్షయుడు అయిన మహావిష్ణువొక్కడే . ఈ ధనుస్సును ఎక్కుపెట్టినందు వలన నీవు మహావిష్ణువు అని నాకు తెలిసింది . నిన్ను దేవతలందరూ ఆశ్చర్యంతో ఇచటకు వచ్చి చూస్తున్నారు . అప్రతిమమైన కర్మలు చేయడంలో , యుద్ధం చేయడంలో నీకు నీవే సాటి . త్రిలోకాలకు నాథుడవైన నీ చేతిలో పరాజయం పొందడం వల్ల నాకు సిగ్గు పడే అవసరం లేదు .
రామా ! అప్రతిహతమైన శరాన్ని వదలడానికి నీవు అర్హుడవు . నీ బాణ ప్రయోగం చూసినాక నేను పర్వతాలలో ఉత్తమమైన మహేంద్రగిరి పర్వాతలకు వెళ్ళిపోతాను “.

తథా బ్రువతి రామే తు జామదగ్న్యే ప్రతాపవాన్
రామో దాశరథిః శ్రీమాన్ చిక్షేప శరముత్తమం

న హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాన్ తపసార్జితాన్
జామద్గ్న్యో జగామాశు మహేంద్రం పర్వతోత్తమం

తతో వితిమిరాః సర్వా దిశశ్చోప దిశస్తథా
సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధం

రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ
తతః ప్రదక్షిణీకృత్య జగమాత్మగతిం విభుః

పరశురాముడు పలుకగానే శరాన్ని సంధించి పరశురాముడు ఎంతోకష్టపడి , దీర్ఘమైన తపస్సు చేత సంపాదించుకున్న ఆతని పుణ్యలోకాలను కొట్టాడు . జమదగ్ని కుమారుడు పరశురాముడు దశరథ రాముని స్తుతించి , ప్రదక్షిణం చేసి శ్రీఘ్రంగా మహేంద్రగిరి పర్వాతాలపైకి వెళ్ళిపోయాడు . అప్పటి వరకూ తిమిరంతో నిండిన దిక్కులు తెలివిదాల్చాయి . అంటే ప్రకాశించాయి . ఆయుధ ధారి అయిన రాముని ఋషులు ,దేవతలు స్తుతించారు .

ఈ విధంగా పరశురాముని కథ సుఖాంతమయింది .

IMG_0208

రామాయణం

తేజోభిహత వీర్యత్త్వాజ్జామదగ్న్యో జడీకృతః
రామం కమల పత్రాక్షం మందం మందమువాచ హ

కాశ్యపాయ మయా దత్తా యదా పూర్వం వసుంధరా
విషయే మే న వస్తవ్యమితి మాం కాశ్యపోబ్రవీత్

సోహం గురువచః కుర్వన్ పృథివ్యాం న వసే నిశాం
కృతా ప్రతిజ్ఞా కాకుత్త్స కృతా భూః కాశ్యపస్య హి

తదిమాం త్వం గతిం వీర హంతుం నార్హసి రాఘవ
మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం

లోకాస్త్వ అప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా
జహితాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః

పరశురాముడు రాముని తేజస్సు వలన జడుడయ్యాడు కదా ! కొద్దిగా తేరుకున్నాక  , కమలపత్రాక్షుడయిన రామునితో మంద స్వరంతో ఈ విధంగా పలికాడు . రాజులను జయించి వసుంధరను కశ్యప మహర్షికి దానం చేసినప్పుడు కశ్యపుడు నా దేశంలో నీవు వసించకూడదని పలికాడు . భూమిని దానమిచ్చిన కారణాన ఆయన కోరిక కనుగుణంగా నేను ఈ ధరాతలంపై నివసించనని ప్రతిజ్ఞ చేసాను . నా ప్రతిజ్ఞననుసరించి నేను రాత్రి సమయాన ఈ ప్రదేశంలో నివసించను . అందువలన వీరుడవైన రామా ! నా గమన శక్తిని బాణతో కొట్టవద్దు . మనోవేగంతో నేను మహేంద్రగిరి పర్వతానికి వెడతాను . కాల విలంబనం లేకుండా నేను తపస్సు చేసి సంపాదించిన ఉత్తమ లోకాలను బాణంతో నిర్జించు .

 

img_5213.jpg

రామాయణం

వరాయుధ ధరం రామం ద్రష్టుం సర్షిగణాః సురాః
పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘశః

గంధర్వాప్సరసశ్చైవ సిద్ధ చారణ కిన్నరాః
యక్షరాక్షస తద్దృష్టుం మహదద్భుతం

జడీకృతే తదా లోకే రామే నరధనుర్ధరే
నిర్వీర్యో జామదగ్న్యో సౌ రామౌ రామముదీక్షత

విష్ణు శరాసనాన్ని  రాఘవుడు   అవలీలగా ఎక్కుపెట్టిన దృశ్యం మహాద్భుతం . ఆ మహాద్భుతాన్ని చూడడానికి పితామహుడు బ్రహ్మదేవుడు , ఋషిగణాలు , దేవతలు , , గంధర్వులు , అప్సరసలు , సిద్ధులు ,చారణులు , యక్ష రాక్షసులూ సమావేశ మయ్యారు . పరశురాముడు , ధనుర్ధారి రామచంద్రుని చూసి జడీకృతుడయ్యాడు అంటే స్తంభించి పోయాడు . ఆశ్చర్యచకితుడై శ్రీరాముని చూసాడు .

 

img_6691.jpg

రామాయణం

IMG_5629

ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనం
శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘు పరాక్రమః

ఆరోప్య స ధనూ రామశ్శరం సజ్యం చకార హ
జామదగ్న్యం తతో రామ రామః క్రుద్ధోబ్రవీద్వచః

అవమానం చేసాడన్న కోపంతో రాముడు పరశురాముని చేతిలోని వింటిని , బాణాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు . ధనుస్సు వంచాడు . అల్లెత్రాడు బిగించాడు . ధనుస్సు ఎక్కుపెట్టి శరాన్ని సంధించాడు . కోపంతో పరశురామునివైపు చూస్తూ ఈ విధంగా పలికాడు .

బ్రాహ్మణో సీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ
తస్మాచ్ఛక్తో న తే రం మోక్తుం ప్రాణహరం శరం

ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్
లోకానప్రతిమాన్వా తే హవిష్యామి యదిచ్ఛపి

న హ్యయం వైష్ణవో దివ్యః శరః పరపురంజయః
మోఘః పతతి వీర్యేణ బలదర్ప వినాశనః

బ్రాహ్మణుడవు . అందునా బ్రహ్మర్షి విశ్వామిత్రునితో సంబంధం ఉన్నవాడివి ( జమదగ్ని తండ్రి ఋచికుఁడు. తల్లి గాధిరాజు కూఁతురు సత్యవతి . వారి సంతానం ఉరుమతి, ఉత్సాహుఁడు, విశ్వావసుఁడు, పరశురాముఁడు అని నలుగురు. అందులో పరశురాముఁడు ముఖ్యుఁడు ) . అందువలన నాకు పూజ్యుడవు . ఈ కారణాల చేత ప్రాణాలు తీసే ఈ బాణాన్ని నీపై ప్రయోగించడానికి అశక్తుడను . కానీ ఎక్కుపెట్టిన ఈ విష్ణు బాణాన్ని వ్యర్థం చేయడానికి వీలు కాదు . దివ్యమైనది , పరపురాలను నిర్జించగలిగినది అమోఘము అయిన ఈ బాణాన్ని వదలక తప్పదు . నేను నీ పాదాలకుండే గమన శక్తిని గాని , తపస్సు చేత సంపాదించుకున్న సాటిలేని లోకాలను కాని నష్టం చేస్తాను . మీ ఇష్టాన్ని నాకు తెలియజేయండి .

శ్రీరామ చంద్రుని ఆలోచనలను పరికించండి . పరశురాముడు తనంతకు తాను వచ్చి యుద్ధానికి తలపడ్డాడు . నీ శక్తి ప్రదర్శించాకే నీతో ద్వంద్వ యుద్ధానికి తలపడతానని పలికి ఒక విధంగా అవమానించాడు . ఈ స్థితిలో శ్రీ రామునికి కోపం రావడం సహజం . విల్లు ఎక్కుపెట్టాడు . పరశురాముని స్థితి దయనీయంగా మారింది . అంత కోపంలో కూడా సహనాన్ని , సమ్యమనాన్ని కోల్పేలేదు శ్రీరాముడు . పరశురాముణ్ణి పూజ్యుడుగానే భావించాడు .పరశురాముడు తన గురువైన విశ్వామిత్రుని బంధువు , మీదు మిక్కిలి బ్రాహ్మణుడు . ఆతనినే అడిగాడు ఎక్కుబెట్టిన బాణాన్ని ఏమిచేయాలో తెలుపమని . ఆపదలు వచ్చినప్పుడు సమ్యమనాన్ని కోల్పోనివాడే ధీరోదాత్తుడు . సామాన్యులకు కోపం వచ్చినప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోతారు .

రామాయణం

శ్రుత్వా తజ్జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా
గౌరవాద్యంత్రిత కథః పితూ రామమథాబ్రవీత్

శ్రుతవానస్మి యత్కర్మ కృతవానపి భార్గవ
అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్య మాస్తిథం

వీర్యహీన మివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ
అవజానాసి మే తేజః పశ్య మేద్య పరాక్రమం

పరశు రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు శ్రీరాముడు . తన తండ్రి ప్రక్కనే ఉన్నాడు కనుక , తండ్రి మీద గౌరవం ఉన్నది కనుక పరశురామునితో ఎక్కువగా మాట్లాడలేదు . తను చెప్పవలసినది క్లుప్తంగా స్పష్టంగా ఈవిధంగా చెప్పాడు . భార్గవా ! మీరు చేసిన కర్మలను గురించి విన్నాను . తండ్రి ఋణాన్ని తీర్చివేసిన (తండ్రికి అపకారం చేసిన వారిని సమూలంగా నాశనం చేసి ) మిమ్ములను అభినందిస్తున్నాను . నన్ను వీర్య హీనుడిగా , క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించడానికి శక్తి లేనివానిగా చూపి అవమానిస్తున్నారు . నా పరాక్రమాన్ని ఇప్పుడు చూడండి .

రామాయణం

న్యస్త్ర శస్త్రే పితరి మే తపోబలసమన్వితే
అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః

వధమ ప్రతిరూపం తు పితుః శ్రుత్వా సుదారుణం
క్షత్ర ముత్సాదయన్ రోషా జ్జాతం జాతమనేకశః

పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే
యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే
దత్త్వా మహేంద్ర నిలయస్తపోబల సమన్వితః

తపోబల సమన్వితుడైన నా తండ్రి శస్త్ర విహీనుడయిఉన్న సమయంలో రాజైన అర్జునుడు (కార్తవీర్యార్జునుడు ) నీచమైన బుద్ధితో ఆ మహానుభావుణ్ణి వధించాడు . నా తండ్రిని దారుణంగా సంహరించిన కారణాన నేను రోషంతో క్షత్రియులను పుట్టిన వాడు పుట్టినట్లుగా నాశనం చేసాను . క్షత్రియ వధ ( సంహరించడమే యజ్ఞంగా భావిస్తున్నాడు ) అనబడే యజ్ఞం చేసి వసుంధరను నా కైవసం చేసుకున్నాను . రాజులను జయించి హస్తగతం చేసుకున్న భూమిని పుణ్యుడైన కశ్యప మహర్షికి ధారాదత్తం చెసాను . అటు పిదప తపోబలం చేత సమన్వితుడనైన నేను మహేంద్ర ప్రవతంపైన నివాస మేర్పరుచుకున్నాను .

అద్యతూత్తమ వీర్యేణ త్వయా రామ మహాబల
శ్రుతవాన్ ధనుషో భేదం తతోహం ద్రుతమాగతః

తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్
క్షత్ర ధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమం

యోజయస్వ ధనుః శ్రేష్టే శరం పరపురఞ్జయం
యది శక్నోషి కాకుత్స ద్వంద్వం దాస్యామి తే తతః

రామా ! మహాబలశాలీ ! ఉత్తమ మైన వీర్యంతో  శివధనుర్భంగం కావించావని విని శ్రీఘ్రంగా బయలుదేరి వచ్చాను . ఇపుడు క్షత్రియ ధర్మాన్ని పురస్కరించుకొని ఈ విష్ణు ధనుస్సును అందుకో ( గ్రహించు ) . రామా ! ఇది శ్రేష్ఠమైనది .  శ్రేష్ఠమైన ఈ ధనువును గ్రహించి శత్రు పురాలను జయించే ఈ శరాలను సంధించు . శరాలను నీవు సంధించగలిగితే నేను నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను .

 

రామాయణం

తదాతు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమం
హుంకారేణ మహాదేవః స్తంభితోథ త్రిలోచనః

దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః
యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమో

జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః
అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తధా

శివ కేశవుల యుద్ధం జరుగుతున్న సమయాన విష్ణుమూర్తి హుంకరించాడు . ఆ హుంకారానికి శివ ధనుస్సు జృంభితమైనదట . ( జృంభితమంటే ఆవులించడం . నిద్రా సమయమాసన్నమయినప్పుడు వచ్చేది ఆవులింత . ఆవులింత రావడం నిద్రకు సూచన  . నిద్రా సమయంలో కదలిక తక్కువవుతుంది .  కనుక జృంభితము అంటే స్తంభించడమని అర్థం . శివ ధనుస్సు విష్ణు హుంకారం వల్ల జడమైపోయిందని వాల్మీకి చెబుతున్నారు) . శివ ధనుస్సు స్తంభించగానే మహాదేవుడు కూడా స్తభించాడు . అపుడు ఋషులు , దేవతలు , చారణులు విష్ణువును , పరమేశ్వరుణ్ణి శాంతం వహించమని ప్రార్థించారు . ప్రార్థనను మన్నించి వారు యుద్ధాన్ని ఆపివేసారు . విష్ణు పరాక్రమం వల్ల శివ ధనుస్సు జడమై , నిర్వీర్యమైనది కనుక దేవతలు , ఋషులు , శివకేశవులలో కేశవుడే అధికుడని తెలుసుకున్నారు .

ధనూ రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః
దేవరాతస్య రాజర్షే దదౌ హస్తే ససాయకం

ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయం
ఋచీకే భార్గవే ప్రాదాద్విష్ణుః స న్యాసముత్తమం

ఋచీకస్తు మహాతేజాః పుత్రస్యా ప్రతికర్మణః
పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః

యుద్ధంలో స్తభించిన కారణాన రుద్రుడు క్రోధంతో తన ధనువును సాయకాలతో సహా (బాణాలతో సహా ) విదేహ రాజైన రాజర్షి దేవరాతుడి హస్తానికి అందించాడు . ఇతరుల పురాలను నాశనం చేయగల శక్తి కలిగిన తన ధనుస్సును మహావిష్ణువు భృగువంశీయుడైన ఋచీకునికి ఉత్తమమైన న్యాసంగా ఇచ్చాడు . మహా తేజుడైన ఋచీకుడు ఆ ధనుస్సును మహాత్ముడైన నా తండ్రి జమదగ్నికి ఇచ్చాడు . నా తండ్రి సాటి లేని కార్యాలు చేయడంలో మేటి .