Monthly Archives: జూన్ 2015

రామాయణం

రాజాభూదేష ధర్మాత్మాదీర్ఘకాలమరిందమః
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః

ప్రజాపతి సుతశ్చాసీత్ కుశోనాం మహీ పతిః
కుశస్య పుత్రో బలవాన్ కుశనాభ సుధార్మికః

కౌశికుడు  పూర్వాశ్రమంలో ధర్మాత్ముడైన రాజు . తన రాజ్యంలోని ప్రజలకు మేలుచేస్తూ , ధర్మానుసారంగా , శత్రుకంటకంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు . సకల విద్యా పారంగతుడీ కౌశికుడు .

బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు (కౌశిక గోత్రానికి మూల పురుషుడు కుశుడు ) . కుశుని కుమారుడు కుశనాభుడు . ఆతని పుత్రుడు గాధి . అమిత తేజశ్శాలి విశ్వామిత్రుడు గాధి కుమారుడు . రాజైన పిదప వేలకొలది సంవత్సరాలు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు .IMG_6100

రామాయణం

తత్ శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం
శతానందో మహాతేజా రామం వచనమబ్రవీత్

స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ
విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితం

అచింత్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః
విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిం

నాస్తి ధన్యతరో  రామ త్వత్తోన్యో భువి కశ్చన
గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః

శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః
యథా బలం యథావృత్తం తన్మే నిగదతః శృణు

విశ్వామిత్ర మహర్షి పలికిన పలుకులను విన్న తేజశ్శాలి శతానందుడు ” రామా ! దైవానుగ్రహం చేత విశ్వామిత్ర మహర్షిని అనుసరించి ఇచటికి వచ్చావు . నీకు స్వాగతం . మహాత్ముడైన విశ్వామిత్రుడు సాధించిన కార్యాలు ఊహకు కూడా అందవు .తపోప్రభావం చేత సాటిలేని శరీర కాంతి ఈతని స్వంతమయింది . బ్రహ్మర్షిత్వాన్నే సాధించాడు . ప్రభావశాలి అయిన మహర్షిని గతిగా గ్రహించావు . ఆ కారణంచేత తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా మారాడు . ఈ లోకంలో నీకంటే ధన్యుడు మరొకడు లేడు . విశ్వామిత్రుని శక్తి ఎంతటిదో ఆతని కథ వింటే తెలుస్తుంది . అది నేను నీకు చెబుతాను . విను ” అని అన్నాడు .
నోట్ : విశ్వామిత్ర మహర్షి చేసిన పనులు అసామాన్యాలు . సృష్టికి ప్రతి సృష్టి చేసిన తపస్వి . గాయత్రీ మంత్రాన్ని లోకానికి అందించిన యశస్వి . బల అతిబల విద్యలకు ఆద్యుడు . పట్టుదలతో పనులు సాధించవచ్చని నిరూపించిన మహర్షి . ఏదైనా పని మొదలుపెడ్తే సాధించే వరకూ వదలని స్వభావం ఈతని స్వంతం . ఎవరికీ వెరువని ధైర్యం . మనిషికి పట్టుదల ఉంటే అసాధ్యమన్నది లేదని ఉదాహరణ పూర్వకంగా నిరూపించిన వాడు విశ్వామిత్రుడు . ఒక్క మాటలో చెప్పాలంటే సౌభాగ్యాలకు నిలయం ఈ మహర్షి నామం . ప్రాతః స్మరణీయం .

My opinion :

His life is an inspiration. If understood correctly and followed we can lead a life full of action and thrill and achieve the purpose for which we are born . He yields to nobody . Achieved every thing by hard work . Passes on what he learnt without hesitation . Stands for what he believes is correct . He failed  to achieve set goals many a time but bounced back with greater vigour .This is the quality found only in men of high caliber and achievement .

IMG_6098

The temple shown is at Kigga near Sringeri . Sage Rushyasrunga did penance here . He is the sage who did putrakameshti  for king Dasaratha . The land where ever the feet of this sage steps in will receive rains .