Monthly Archives: అక్టోబర్ 2012

రామాయణము

అథ  తస్యాప్రమేయస్య  తద్వనం  పరిపృచ్ఛతః
విశ్వామిత్రో  మహాతేజా  వ్యఖ్యాతుముపచక్రమే

ఇహరామ  మహాబాహో  విష్ణుర్దేవరః  ప్రభుః
వర్షాణి  సుబహూనీహ  తథా  యుగశతానిచ
తపశ్చరణ యోగార్థమువాస  సుమహాతపాః

ఏషపూర్వాశ్రమో  రామ  వామనస్య మహాత్మనః
సిధ్ధాశ్రమ  ఇతి  ఖ్యాతః  సిధ్ధో  హ్యత్ర   మహాతపాః

అప్రమేయ   ప్రభావుడైన   రాముడు   ప్రశ్నించగానే   మహాతేజస్కుడైన   విశ్వామిత్రుడు    ” సురులలో   శ్రేష్ఠుడూ , సర్వశక్తిమంతుడూ   అయిన    నారాయణుడు    ఎన్నో   వందల  యుగాలు  తపస్సు  చేస్తూ  ఈ  ప్రదేశంలో  నివసించాడు . వామనావతారానికి    పూర్వం  విష్ణుమూర్తి   నివసించిన  ఆశ్రమమిది .  కశ్యప  మహర్షి ఈ  ఆశ్రమంలోనే  సిధ్ధి పొందాడు . అందుచేత   దీనికి   సిధ్ధాశ్రమమని  పేరు . “

రామాయణము

స చ తాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిం
గచ్ఛన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్

కిం న్వేత న్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః
వృక్షషణ్డమితో భాతి పరం కౌతూహలం హి మే

దర్శనీయం మృగాకీర్ణం మనో రమయతీవ చ
నానాప్రకారైః శకునైర్వల్గునాదైరలంకృతం

సకలకళాభి రాముడు రఘురాముడు దివ్యాస్త్రాలను , అస్త్ర   ఉపసంహారమంత్రాలను గ్రహించిన పిదప విశ్వామిత్ర మహర్షి అడుగు జాడలలో నడుస్తూ ” ఈ ప్రదేశం చిక్కనైన వృక్షాలతో , మృగాలతో , మధురంగా శబ్దాలు చేసే పక్షుల కిలకిలారావాలతో మనోరంజకంగా ఉన్నది . కొండల నడుమ ఉన్న దట్టమైన వృక్షాలు , మేఘాలలాగా ఉన్నాయి .

నిస్సృతాః స్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమహర్షణాత్
అనయా త్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా
సర్వం మే శంస భగవన్ కస్యాశ్రమపదం త్విదం

ఈ ప్రదేశం శరీరానికి సుఖాన్ని కలిగిస్తున్నది , అందువలన మనం భయంకరమైన అరణ్యాన్ని దాటినామని అనిపిస్తున్నది . మనకు కనిపించే ఈ ఆశ్రమ మెవరిది ?

సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః
తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే
భగవన్ తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ
రక్షితవ్యా క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసా
ఏతత్సర్వం మునిస్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో !

ఇంతకూ దుష్టులూ , దుర్మార్గులూ , బ్రహ్మహత్యలు చేసే రాక్షసులు ఏ ప్రదేశంలో తమ తపస్సుకు విఘ్నం కలిగిస్తున్నారు . నరబక్షకులైన రాక్షసులను నేను చంపవలసిన ప్రదేశమేది ? నాకు ఈ విషయాలను తెలుసుకోవాలని కోరికగా ఉంది అని మృదు మధుర స్వరంతో , స్నిగ్ధ గంభీరంగా , వినయం ఉట్టిపడుతుండగా విశ్వామిత్రుని ప్రశ్నించాడు .

రామాయణము

 

బాఢమిత్యేవ    కాకుత్సః   పృహృష్టేనాంతరాత్మనా
దివ్యభాస్వరదేహాశ్చ   మూర్తిమంతః  సుఖప్రదాః
కేచిదఙ్గారసదృసాః    కేచిధ్ధూమోపమాస్తథా
చంద్రార్కసదృశాః    కేచిత్ప్రహ్వాఞ్జలి   పుటాస్తథా
రామం  ప్రాఞ్జలయో  భూత్వాబ్రువన్  మధురభాషిణః
ఇమే స్మ నరశార్దూల     శాధి కిం    కరవామతే

విశ్వామిత్రుడు   ప్రేమతో    తనకొసగిన  ఆయుధాలను  సంతోషంతో   అందుకొన్నాడు  రఘుపతి .  కౌశికుడొసగిన  అస్త్రదేవతలలో   భాస్వరంవలె  ప్రజ్వలిస్తున్న  దేవతలు  కొందరైతే , అఙ్గారక  (  నిప్పు కణికలవంటివారు)  సదృశులు మరికొందరు .  ధూమంలాగా  కొందరుంటే  ,  చంద్రసూర్యులలాగా  మెరిసిపోతున్న వారు   మరికొందరు . ఏది ఏమైనా   అస్త్రాధిపతులందరూ  మహాతేజోవంతులు .  వారందరూ    మనోహరమైన  మధురస్వరాలతో     ” మహానుభావా !  మీ   ఆజ్ఞ శిరసావహించడానికి   సిధ్ధంగా  ఉన్నాము .  ఏమి  చేయాలో  ఆజ్ఞాపించండి ”    అని  రామచంద్రుని  ప్రార్థించారు .

మానసాః  కార్యకాలేషు  సాహయ్యం  మే  కరిష్యథ
గమ్యతామితి   తానాహ  యథేష్తం  రఘునందన
అథ తే   రామమామంత్ర్య  కృత్వాచాపి  ప్రదక్షిణం
ఏవమస్త్వితి   కాకుత్థ్స  ముక్త్వా  జగ్ముర్యథాగతం

” సదా   నా    మనసులో   మెదలుతూ నా   కవసరమైనప్పుడు    సహాయంగా   నిలవ ”  మన్నాడు  రఘునందనుడు  . ” ఆ  విధంగానే  చేస్తామని”  పలుకుతూ   శ్రధ్ధతో   రామునికి  ప్రదక్షిణం   చేసి    సెలవుగైకొన్నారు  అమిత  బలవంతులూ , అత్యంత    తేజోవంతులూ  అయిన  ఆ  అస్త్రాధి   దేవతలు .

Picture  taken from :   http://www.behance.net/gallery/Brahmastra/5148179