Monthly Archives: సెప్టెంబర్ 2013

రామాయణం

బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః
అక్లిష్టవ్రత ధర్మజ్ఞః సజ్జన ప్రతిపూజకః

స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్
వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్ సుతాన్
కుశాంబం కుశనాభం చ అధూర్తరజసం వసుం

అర్థం :

కుశుడు బ్రహ్మ మానస పుత్రుడు . తపస్సంపన్నుడు . ధర్మాత్ముడు . సజ్జనులూ సాధుజనుల పూజ చేసేవాడు . నియమాలను పాటిస్తూ తలపెట్టిన వ్రతాలను అవలీలగా చేసే వాడు . ఆ మహాత్ముని భార్య విదేహ రాజకుమారి . కాలక్రమంలో ఆ పుణ్యదంపతులకు కలిగారు నలుగురు శక్తివంతులూ ,సుగుణవంతులైన  కుమారులు . కుశాంబుడు , కుశనాభుడు , అధూర్తజనుడు , వసువు .

మహర్షుల   జ్ఞానం  అపారం . అంతేకాదు    జ్ఞానాన్ని  శిష్యులకు  ఇవ్వడం  కూడా  వారికి  వెన్నతో  పెట్టిన విద్య . కథారూపకంగా , దృశ్యకావ్యాలతో , ప్రత్యక్షంగా  అనుభూతినిస్తూ  వారు  విద్యను  వ్యాప్తి  చేసారు .  ప్రస్తుతం  కథల  రూపంలో  విషయాన్ని  వివరిస్తున్నాడు  బ్రహ్మర్షి   విశ్వామిత్రుడు .

మహర్షులను  దృష్టలంటారు .వారికి   భూత , భవిష్యత్   వర్తమాన  కాలాల జ్ఞానం   ఉండేది . ఇవి పుక్కిటి  పురాణాలని మనకనిపించ  వచ్చు .  ప్రస్తుతం  ఈ  జ్ఞానం ఎవరికీ  లేదు కనుక  అలా  అనిపించడం  సహజం . కానీ  కొద్ది  లోతుగా  ఆలోచించండి . రామాయణ  కాలంలో విమానాలున్నాయి , విస్తృతమైన  ఖగోళ జ్ఞానమూ ఉంది , అంతే కాదు వారికి ఔషధీ     జ్ఞానమూ    వారికి  తెలుసు . మంత్ర విద్యకు  ఆద్యుడు  విశ్వా మిత్రుడు .  గాయత్రీ  మంత్రానికి  కర్త .  బలాతిబల  విద్యలే   మహాత్ముని  స్వంతం. ఆ  మంత్రాలు  మనకు  ఈ రోజున  కూడా  లబ్ధమవుతున్నాయి . అయితే వాటినుండి  లబ్ధి పొందడమెలాగో  మనకు తెలియదు . ఈ  మధ్యనే  చదివిన వార్త . మంత్రాలనూ  , శబ్దాలనూ  విశ్లేషించి , వాటి  ఉచ్చారణ  లోనుండి బయల్వెడలే  శబ్దతరంగాలలో  గాయత్రీ  మంత్ర  శబ్ద తరంగాలు  బలమైనవని  నిర్ధారణకు వచ్చాడు ఒక  పాశ్చాత్య   సైంటిస్ట్   . ఒక వేళ ఇవి నిజం కాదనుకున్నా ఇంత పెద్ద ఊహలు వారికి రావడం ఆశ్చర్యం కాదా ? అయినా నిప్పు లేకుండా పొగ వస్తుందా ? రామాయణంలో వాల్మీకి రాసిన దాంట్లో కొద్దిగా నైనా నిజం ఉండదా ? ఇవన్నీ  చెప్పడానికి  కారణం  ” మనజాతి  చరిత్ర  మనకు  గర్వకారణమేనని ” తెలపడానికి “.

ब्रह्म योनिर् महान् आसीत् कुशो नाम महातपाः

अक्लिष्ट व्रत धर्मज्ञः सज्जन प्रति पूजकः

स महात्मा कुलीनायाम् युक्तायाम् सुमहाबलान्
वैदर्भ्याम् जनयाम् आस चतुरः सदृशान् सुतान्
कुशाम्बम् कुशनाभम् च आसूर्तरजसम् वसुम्

Meaning : Viswamitra started his narration :” In good old days  Kusha , son of Lord Brahma ( brahma manasa putrudu ) ruled this place . A great king . He meticulously performed religious austerities as prescribed in the scriptures ( tapas ) , never flouted laid down rules  and paid respects to good people . He could differentiate between  right and wrong and followed the right path ( Dharma ) . He married beautiful princess of vidarbha . A good  natured and amicable lady . The king and the queen were made for each other . In course of time the couple were blessed with four children . Kusaamba ,kusanaabha , adhuurtajana and vasu” .

Reflections : India is ancient . Every nook and corner of the country carries a story of its own . Not only it has a story , the story is recorded and passed on by  Sages like Viswamitra , Valmiki ec., The sages  were good observers and excellent  story tellers . They also had the uncanny ability to visualize the past , present and future . Imagine the amount of information and knowledge they passed on . Ramayana describes the sun ,the stars and their celestial movements to perfection . The star positions mentioned are precise and accurate . This is when the discussion whether the earth is flat or round has not even  commenced  elsewhere . They named every plant and tree that they came across . Don’t you think this requires vast knowledge , observation , dexterity and wisdom ? They described the rivers , the surroundings as they existed in those days . The telltale signs exist even today  . The variety of plants they researched  for medicinal value is mind boggling . Ayurveda was their invention , which holds its head high even today in the medical field . Their understanding of human psychology was amazing .  Imagine their ingenuity in  passing of all that information to the future generations by word of mouth ( literally ) and also ensuring that future generations will remember their stories ( without googling ) They were widely travelled ( no trains , no aero planes ) . They created literature which is amenable to music . The rhyming words ensured that general public retained what is passed on to them in the form of songs . A unique feet unparalleled anywhere in the world where huge amount of information was remembered in the form of songs . Mind boggling amount of information of the  past is passed onto their progeny  . Ramayana has happened 7000 years back . still the story is remembered , recited and enjoyed and revered . Amazing .

రామాయణం

భగవన్ కోన్వయం దేశః సమృధ్ధవనశోభితః
శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్వతః

చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః
తస్య దేశస్య నిఖిలమృషిమధ్యే మహాతపాః

भगवन् कः नु अयम् देशः समृद्ध वन शोभितः 
श्रोतुम् इच्छामि भद्रम् ते वक्तुम् अर्हसि तत्त्वतः 

चोदितो राम वाक्येन कथयामास सुव्रतः
तस्य देशस्य निखिलम् ऋषि मध्ये महातपाः 

అర్థం :

” శోభాయమానంగా ఉన్నదీ వనం . ఫలాలు పుష్పాలు సమృధ్ధిగా ఉన్నాయిచట . ఈ ప్రదేశాన్ని గురించిన వివరాలు దయతో మాకు తెలపండి ” అని రాఘవుడు కోరగా , మహాతపశ్శాలి అయిన కౌశికుడు ఆ దేశానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు .

నా ఆలోచనలు : విశ్వామిత్రుడు తేజస్వి . తపశ్శాలి . జ్ఞానవృధ్ధుడు . ఆతనికి తెలియని విషయాలు అరుదు . తానెప్పుడో విన్న శోణానదీ తీరాన జరిగినదిగా భావింపబడుతున్న కథ ఋషులకూ , రామలక్ష్మణులకూ చెప్పడానికి ఉపక్రమించాడు . ఈ కథలు లేకపోయినా రామాయణ మూలకథకు లోపమేమీ కలుగదు .

నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకోవడం మానవ సహజం . నాలాంటివాడైతే ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధిచేస్తారు . పిల్లలూ , యుక్తవస్కులకైతే కుతూహలం ఇంకా ఇమ్మడి ముమ్మడిగా ఉంటుంది . నవయువకుడు రామచంద్రుడు . ప్రశాంతమైన సాయంసమయంలో అందంగా , నూతనంగా కనిపించే ఆ ప్రదేశాన్ని గురించి తెలుసుకోవాలనుకోవడం శ్రీరాముని మానవ ప్రవృత్తిని సూచిస్తుంది . ఇక చెప్పేవాడు విశ్వామిత్రుడు . విశ్వంలో ఆతనికి తెలియని విషయాలుంటాయా ? ఒక్కసారి విశ్వామిత్రుడినీ , ఆతని ముందు వినయంగా కూర్చుని కథలు వింటున్న రామచంద్రుడి రూపాన్నీ మనస్సులో ఊహించుకొండి . జన్మ ధన్యమై పోతుంది . రాముడు దేవుడైనా రామాయణంలో మాత్రం అచ్చు మనలాగే అలోచిస్తాడు. ఆ కాలంలోని దేశపరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తాడు . మనమనుసరించవలసిన మార్గాన్ని ఆచరణద్వారా సూచిస్తాడు .

ఈ  శ్లోకంతో బాలకాండ  లోని  ముప్పైఒక్క  అధ్యాయాలు  పూర్తి అయినాయి .

 

Meaning : Lord Srirama enquires with humility ” Please let me know the history of this serene place filled with flora , fauna and greenery and wonderful woodlands  . I am very eager to hear from you . peace be upon you .”

Viswamitra was pleased with Lord Rama’s query .( He is widely travelled and also capable of viewing the past ) . He started narrating the story of the place where they camped for the night .

Reflections : For a true teacher there is no happiness  greater than answering questions posed by curious students . This is the way knowledge spreads and does not become extinct . The master also adopts means to ensure that the knowledge  passed on is etched in the minds of the students for long time . One of the methods adopted is to use exciting stories which naturally kindles the interest of the student . Is it not true that we were all eager to listen to stories during our young days . The stories heard in those days still reverberate in our minds and leave a pleasant taste . With this we complete  thirty first Sarga of Balakanda of Srimadramayana authored by Sage Valmiki .

రామాయణం

తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే
వాసం చక్రుమునిగణాః శోణాకూలే సమాహితాః

తేస్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః
విశ్వామిత్రం పురస్కృత్య నిషేదుర మితౌజసః

రామోపి సహసౌమిత్రిర్మునీంస్తానభిపూజ్య చ
అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః

అథ రామో మహా తేజాః విశ్వామిత్రం మహామునిం
పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహల సమన్వితః

 

ते गत्वा दूरम् अध्वानम् लम्बमाने दिवाकरे

वासम् चक्रुर् मुनि गणाः शोणा कूले समाहिताः |

ते अस्तम् गते दिनकरे स्नात्वा हुत हुताशनाः

विश्वामित्रम् पुरस्कृत्य निषेदुर् अमित ओजसः

रामो अपि सह सौमित्रिः मुनीम् तान् अभिपूज्य च

अग्रतो निषसाद अथ विश्वामित्रस्य धीमतः |

अथ रामो महातेजा विश्वामित्रम् तपोधनम्

पप्रच्छ मुनिशार्दूलम् कौतूहल समन्वितः |

అర్థం :

తెల్లవారుజామున మొదలు పెట్టిన ప్రయాణం సాయంత్రం వరకూ సాగింది . నీలి నీడలు అలముకుంటున్న సమయంలో శోణా నదీ తీరం వారికి కనిపించింది . రాత్రి అక్కడ గడపడానికి నిశ్చయించుకున్నారు . దినకరుడు అస్తమిస్తున్న సమయంలో స్నానాదులు ముగించుకొని , అగ్నులను వెలిగించి హోమాలను చేసారు . పిదప తేజస్కులైన ఆ మహర్షులు విశ్వామిత్ర మహర్షి చెంతకు చేరి ఉపవిష్టులైనారు . అనుజునితో కూడి దశరథ రాజ నందనుడు ఆ మునులకు అభివాదం చేసి తాను కూడా విశ్వామిత్ర మహర్షి చెంత చేరాడు . సహజంగానే కుతూహలం రఘురామునికి . పూర్వాపరాలు చక్కగా తెలిసినవాడు విశ్వామిత్రుడు . ” భగవన్ ! ఈ ప్రదేశం ఏపుగా పెరిగిన వనాలతో శోభాయమానంగా వెలిగిపోతున్నది . ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది . నాకు ఈ స్థల విశేషాలను వివరించండి . తమకు భద్రమగు గాక ” , అని వినయంగా పలికాడు . 

 

శోణా  నది  కథ : కథలల్లడంలో  మొనగాళ్ళు  మన పూర్వీకులు . శోణా  నది  , నర్మదా  నది  భిన్న  దిశలలో  ఎందుకు  ప్రవహిస్తాయో  తెలపడానికి  ఒక  అందమైన కథ అల్లారు . ఈ  కథల వల్ల  ఈ  రెండు నదుల  ప్రవాహ  దిశలు  మన మనస్సులలో  స్థిరంగా నిలచిపోతాయి . పూర్వకాలంలోని  విద్యావిధానానికి  ఇది ఒక ప్రతీక .  పంచతంత్రం  కథలు  కూడా  ఇలాంటివే .విచిత్రమేమిటంటే నర్మదా నది కూడా అమరకంటక సానువులలోనే జన్మిస్తుంది . అయితే అది పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తుంది . శోణా నది దీనికి విరుధ్ధంగా ఉత్తరదిశగా ప్రయాణిస్తుంది . ఈ విధంగా ఎడముఖం పెడముఖంగా , భిన్న దిశలలో ఈ నదులు ఎందుకు ప్రయాణిస్తాయో తెలిపే కథను   అవలోకించండి : రాకుమారి నర్మద మైకాలుడి ప్రియ పుత్రిక . ( అమరకంటకం , మైకాల్ అనబదే పర్వత సానువులలోని ఒక కొండ ప్రదేశం ) . ఈడువచ్చిన కుమార్తెకు వివాహం చేయాలని తలపెట్టాడు మహారాజు మైకాలుడు . స్వయంవరం చాటించి ఏ రాజకుమారుడు గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తాడో ఆతనికి తన కుమార్తె నిచ్చి రంగ రంగ వైభోగంగా పెళ్ళి చేస్తానని ప్రకటించాడు . అందమైన నర్మద పొందు కోరి ఎంతోమంది రాజకుమారులు గులేబకావళిని తీసుకొని రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు . అయితే నర్మదకు రాజకుమారుడు శోణుడంటే ఇష్టం . శోణుడు గులేబకావళిని సాధించడంలో కొద్దిగా ఆలస్యమయింది . ఈ ఆలస్యాన్ని భరించలేని నర్మద , తన మనసులోని ప్రేమను తెలపడానికి జోహిల అనే తన సేవకురాలిని రాజకుమారుడి వద్దకు పంపిస్తుంది . శోణుడు నర్మదను గురించి వినడమే గాని ఎప్పుడూ చూడలేదు . అందమైన జోహిలను చూసి నర్మద అని అనుకున్నాడు . ఆవిడతో ప్రేమాయణం సాగించాడు . జోహిల ఎంతకూ తిరిగిరాకపోవడంతో తనే శోణుడి వద్దకు బయలుదేరి వెళ్ళింది నర్మద . అక్కడ ఆవిడకు కనిపించింది వీరి ప్రేమాయణం . దెబ్బతిన్న నాగుపాములాగా కోపం వచ్చింది . అంతే ఆ మోసగించిన రాజకుమారుడి ముఖం చూడకూడదనుకుంది . పశ్చిమాభిముఖంగా ప్రయాణం సాగించింది . ఈ విషయం శోణుడికి తెలిసింది . నర్మదకోసం ఉత్తర దిశగా వెతికాడు . ఎంత వెదికినా నర్మద కనిపించలేదు . కొంతకాలం గడిచాక జోహిలను వివాహం చేసుకున్నాడు . నర్మద మాత్రం కన్నెపిల్లగా మిగిలి పోయింది . అమ్మ , గంగమ్మ వొడిలో తల దాచుకొని తన కష్టాన్ని కొంతవరకూ తీర్చుకుంటోంది .

 

Meaning :  Viswamitra and his entourage commenced their journey and covered quite a bit of distance by evening and reached the river sona . They decided to camp on the banks  of the serene river . After taking bath  , they performed the daily rituals and sat near the sage Kaushika . Lord Rama  and Lakshmana joined this group after paying due respects . As ever Rama was full of enthusiasm and curiosity . In a pleasing voice he requested the all knowing kaushika to enlighten him about the place they rested .

Reflections : The entourage covered  85 kms (approx ) from Buxar by evening . They rested at present day Pareo village after crossing river Sonabhadra ( Sone )  . Even Valmiki says they coverd considerable distance in a single day through the forests .

 

Legend of Shona river :

Sone is a 780 kms long river . It was called as Shona during Ramayana days . Taking birth in Amarkantak hills of Maikal ranges , it meanders through Madhya Pradesh , Uttar Pradesh ,  Bihar and culminates its journey by joining  the mighty Ganges somewhere near Patna . Sone is also called Maikal sut as it originates in the Maikal Ranges ( sut is son in Sanskrit )  . In ancient times, Sone was known as Shona . Interstingly river Narmada also originates in Amarkantak hills but flows westwards while Sone flows towards  East . An interesting story  explains why these two rivers flow in opposite directions.

Princess Narmada (the river) was the daughter of King Maikal (the mountain). Maikal announced that the prince who could bring Gulebakawali – a flower supposed to have the power to cure all kinds of eye ailments – would be the ideal match for his daughter. Prince Shona brought Gulebakawali, but he took much longer to get it than he was supposed to. But Princess Narmada was so impressed by the attractive Shona that she decided to marry him and sent her hairdresser, Johila, to inform Shona about her feelings. Prince Shona, who had never seen Narmada, mistook the beautiful Johila to be Narmada and started flirting with her. When Johila didn’t return for a long time, Narmada became impatient and went to see what had delayed Johila. Seeing Johila with Shona angered Narmada so much that she went away towards the west. When Shona discovered his folly, he jumped off the mountain Amarkantak, in despair, and wandered eastwards through jungles. Later, he returned and married Johila, while Narmada remained a maiden.

రామాయణం

తంప్రయాంతం మునివరమన్వయాదనుసారిణం
శకటీశతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినాం

మృగపక్షిగణాశ్చైవ సిధ్ధాశ్రమనివాసినః
అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం
నివర్తయామాస తతః పక్షిసంఘాన్ మృగానపి

तम् व्रजंतम् मुनिवरम् अन्वगात् अनुसारिणाम् |
शकटी शत मात्रम् तु प्रयाणे ब्रह्म वादिनाम्

मृग पक्षि गणाः चैव सिद्ध आश्रम निवासिनः |
अनुजग्मुर् महात्मानम् विश्वामित्रम् तपोधनम् ||
निवर्तयामास ततः स ऋसि सन्घः स पक्षिणः

అర్థం : విశ్వామిత్రుడు బయలుదేరి వెడుతుండగా వంద బండ్లలో బ్రహ్మజ్ఞానం కలిగిన ఋషులు ఆతనినిని అనుసరించారు . మహాముని వెంట ఆశ్రమంలో నివసించే పశుపక్ష్యాదులు కూడ బయలుదేరాయి . కానీ ఆ పశుపక్ష్యాదులను మహర్షి బుజ్జగించి ఆశ్రమంలోకి మరలిపోయేలా చేసాడు .

నా ఆలోచనలు : విశ్వామిత్రుడు సార్థక నామధేయుడు .సిధ్ధాశ్రమంలోని పశుపక్ష్యాదులు తమ మిత్రుని వదలిపోలేక ఆతని వెంట ప్రయాణానికి సిధ్ధమయ్యాయి . ఒకసారి మనసులో ఈ సుందర దృశ్యాన్ని ఊహించుకొండి . ఈ రోజున కూడా యజమాని బయటకు వెడుతుంటే ఆతనిని ప్రేమతో అనుసరించే శునకాలు కనబడతాయి . నా చిన్నప్పుడు మా తండ్రిగారి వెనుకగా ప్రేమతో అనుసరించే మా పాడియావు , ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తోంది . విశ్వామిత్రుని వెంట పశువులతో బాటు పక్షులు కూడా ప్రయాణానికి సిధ్ధమయ్యాయట . నిజంగా ఇది ఒక సుందర దృశ్యం.

Meaning : From  sidhdhaaSrama , several scholars  well versed in vedic lore , accompanied  sage ViSwamitritra in hundred carts . The birds and beasts of sidhdhsrama also followed the sage . The sage displaying lot of love and care slowly turned them back into the hermitage .

My thoughts : It is human nature and desire to be close to their loved ones . One can understand the scholars accompanying VisWamitra . However , as the name suggests Viswamitra is friend of every living thing in nature . The birds and beasts of Sidhdhasram followed the great sage as they could not bear seperation from the great soul . Even today we have examples of this behavior from animals . Dogs will not allow their master to leave the house . You can see tears in their eyes when they are not allowed to accompany the master . I remember my family cow trying to  accompany my father wherever he went . In the case of Viswamitra every animal ex: Deers etc.,  and even birds tried to follow him . The love and affection shown by the sage towards the animals , surely is exemplary . Valmiki observes and captures nuances of life meticulously .

2 . Another interesting aspect is that in hindu culture if a guest is leaving the  house , it is customary and good manners to accompany him for a short distance . Valmiki maharshi may be indicating that the birds and beasts are showing courtesy to the sage by accompanying him . Even today we follow this tradiion in India , particularly when respected people or elders visit our home .

రామాయణం

తధ్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః
యాచితం నరశార్దూల సునాభం సర్వ దైవతైః

ఆయాగభూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ
అర్చితం వివిధైర్గంధై ర్ధూపైశ్చాగురుగందిభిః

మిథిలా నగరానికి రాజు దేవరాతుడు . అతడొక యజ్ఞం చేసాడు. ఆ యజ్ఞానికి ప్రతిఫలంగా దేవతలను అడిగి ఉత్తమమైన ఈ ధనస్సును వరంగా పొందాడు . అప్పటినుండీ ఈ ధనువును మిథిలానగరంలో రాజగృహంలో ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తున్నారు .

Mithila was ruled by king Devarata . He performed a havan (vedic ritual ) . The deities were pleased and gave him this mighty bow as a fruit of the havan . ( According to Padma purana , lord shankara gave this bow to Janaka as he performed the ritual of Devavrata ) .

( ప్రస్తుతం  మిథిలా నగరాన్ని  జనక మహారాజు  పరిపాలిస్తున్నాడు ) .

ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా
సర్షిసంఘః స కాకుత్స ఆమంత్ర్య వనదేవతా

స్వస్తి వోస్తు గమిష్యామి సిధ్ధః సిధ్ధాశ్రమాదహం
ఉత్తరె జాహ్నవీ తేరే హిమవంతం శిలోచ్చయం .

ప్రదక్షిణం తతః కృత్వా సిధ్ధాశ్రమమనుత్తమం
ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతు ముపచక్రమే

ధనస్సు గొప్పతనాన్ని వివరించిన పిదప విశ్వామిత్ర మహర్షి , రామలక్ష్మణులు , మహాఋషుల సమక్షంలో వనదేవతలకు వీడ్కోలు చెప్పాడు . ” వనదేవతలారా మీకు స్వస్తి ( క్షేమం) . నేను తలపెట్టిన కార్యక్రమం జయప్రదంగా పూర్తి అయింది . నాకు సంకల్ప సిధ్ధి కలిగింది . ఇక  నేను  గంగానదికి  ఉత్తరంగా ఉన్న హిమవత్పర్వతానికి వెడతాను ” అని పలికి ఆ సిధ్ధాశ్రమానికి ప్రదక్షిణ చేసాడు . ఉత్తరదిశగా పయనించడానికి ఉపక్రమించాడు .

After describing the  greatness of the mighty bow , Viswamitra bid goodbye to Siddhasram and commenced his journey to Himalaya mountains .

Siddhasram is in today’s  Buxar district of Bihar . Varanasi can be taken as reference point and buxar is 125 Kms from varanasi in north east direction .

Three kilometers from Buxar is Ahroli . Here lies the hermitage of Gautama , the husband of Ahalya .  Rama liberated  Ahalya from her curse at this place .

రామాయణం

తధ్ధనుర్నర శార్దూల మైథిలస్య మహాత్మనః
తత్రద్రక్ష్యసి కాకుత్స యజ్ఞం చద్భుత దర్శనం

నరశార్దూలా ( మనుష్యులలో పులి ) ! రామా ! జనక మహారాజు చేసే యజ్ఞం చూడడానికి వెడితే మనం ఆ ధనస్సును చూడవచ్చు . యజ్ఞం కూడా చూడవచ్చు .

ఈ మాటలలో అంతరార్థం ఉంది . జనకుడు చేసే యజ్ఞం రామలక్ష్మణులను అంతగా ఆకర్షింపక పోవచ్చు . That is not their subject . కానీ విచిత్రమైన విల్లు తప్పకుండా ఆకర్షిస్తుంది . They will definitely be interested in having a look at a great weapon . అందుకే మహర్షులు శివధనస్సును గురించి వర్ణించారు . యజ్ఞ వివరణ చాలా తక్కువ . జనకుని రాజ్యానికి రామలక్ష్మణులను  తీసుకు  వెళ్ళడానికి  ఈ వివరణ తాయిలంలాగా పనిచేస్తుందని మనస్తత్వ శాస్త్రాన్ని ఎరిగిన ఆ మహర్షులకు తెలుసు .

” Rama ! if we go to Mithila , we can have a look at the great bow “. 

Valmiki uses tact everywhere in this magnum opus . Here the sages of Sidhdhasram want rama and Lakshmana to accompany them to Mithila . They  have to show some thing which interests the princes . What can interest them more than a great weapon ? The bow of Lord siva was used as bait knowing their psychology . Now the princes themselves are keen to accompany the sages . In the narration these things are not explicitly spelt by Valmiki . These are left to the reader to analyze . In fact in every Sloka one can unearth gems in Ramayana . 

 

రామాయణం

తధ్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః
అప్రమేయబలం ఘోరం మఖే పరమ భాస్వరం
నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసా
కర్తుమారోపణం శక్తా న కథం చన మానుషాః
ధనుషస్తస్య వీర్యం తు జిజ్ఞాసంతో మహీక్షితః
న  శేకురారోపయితుం  రాజపుత్రా  మహాబలాః

జనకుని వద్ద ఉన్న విల్లును వర్ణిస్తున్నారు విశ్వామిత్రుని ఆశ్రమంలో నివసించే ఋషులు : అప్రమేయమైన బలంతో , భయంకరంగా , వెలుగులు చిమ్ముతూ ఉంటుంది ఈ ధనస్సు . పూర్వకాలంలో ఒక యుధ్ధ సమయంలో ఈ ధనుస్సును దేవతలు యజ్ఞఫలంగా ఇచ్చారు . దేవతలైనా , రాక్షసులైనా ,గంధర్వులైనా ఈ ధనస్సును వంచి నారి (అల్లె తాడు) కట్టలేరు . మనుష్యులు ఏ పాటి ?   రాజవంశాలలో పుట్టిన మహావీరులూ , మహారాజులూ ఈ ధనుస్సును ఎక్కుపేట్టాలని ప్రయత్నించారు . కానీ సిగ్గుతో తలవంచుకొనవలసి వచ్చింది .