Monthly Archives: జూలై 2017

రామాయణం

పుత్రా దశరథస్యేమే రూపయౌవన శాలినః
లోకపాలసమాః సర్వే దేవతుల్య పరాక్రమాః

ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతాం
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః

విశ్వామిత్ర వచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా
జనకః ప్రాంజలిర్వాక్య మువాచ మునిపుంగవౌ

కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ
సదృశం కులసంబంధం యదాజ్ఞాపయథః స్వయం

ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతావుభౌ

విశ్వామిత్రుడు ఇంకా ఈవిధంగా పలికాడు : “ఈ దశరథ పుత్రులందరూ రూప యౌవన లావణ్యాలతో శోభిస్తున్నారు . దేవతలతో సమానమైన పరాక్రమం వీరి పరాక్రమం . లోకపాలురు అంటే చంద్రుడు , సూర్యుడు , యముడు , అగ్ని , వాయువు , ఇంద్రుడు ,కుబేరుడు , వరుణుడు . వారొతో సమానులైనవారు ఈ దశరథ రాజ కుమారులు . ఈ వివాహ సంబంధం ఉభయుల కులాలకు సంబంధాన్ని దృఢపరుస్తుంది . ఈ బంధాన్ని తమరు ఆమోదించండి “.

వసిష్ఠుని అనుమతితో విశ్వామిత్రుని నొటినుండి వెడలిన ఈ పలుకులు విని జనక మహారాజు వారిరువురకూ అంజలి ఘటించాడు . వారితో ” మునిపుంగవులైన మీరు మమ్ములను కులసంబంధం చేసుకొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు .ఈ ఆజ్ఞ వలన మా కులం ధన్యమయింది . అలాగే జరుగుతుంది . మీకు శుభమగుగాక . కుశధ్వజుని కుమార్తెలు మాండవీ శ్రుతకీర్తులు భరత శత్రుఘ్నులకు భార్యలయి వారిని సేవిస్తారు .

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే
పాణీన్ గృహ్ణంతు చత్వారో రాజపుత్రా మహాబలా

ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషినః
వైవాహిక ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః

మహామునీ ! ఒకే సమయంలో , ఒకే దినాన మహా బలశాలులైన నలుగురు రాజపుత్రులూ నలుగురు రాజపుత్రికలను వివాహం చేసుకుంటారు . ప్రజాపతి అయిన భగుడు దేవతగా ఉన్న ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో వివాహం చేసుకోవడం శ్రేష్ఠమని విద్వాంసులు చెబుతారు .

విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో  ,మహర్షి విశ్వామిత్రుడు జనకునితో

దాశరథులు నలుగురు కకు
భేశ సమానులు , సుపర్వ విశ్రుత శౌర్యుల్
ధీశబలులు భరతుండును
నీ శత్రుఘ్నుండు నిద్దఱిద్దఱికి సముల్

మేమిచ్చెద మంటివి యం
దేమోనను ఘుశధ్వజుండు నిచ్చుట యుండెన్
మీ మాండవి శ్రుతకీర్తియు
జామలగుట వలయు భరత శత్రుఘ్నులకున్

వెంటనే జనకుడు

విచ్చేయుడు బ్రహ్మర్షులు
పచ్చాకును వక్క గొనుడు – బ్రహ్మర్షులు మే
మిచ్చెదము మాదు కూతుల
గ్రచ్చర ఋషివరుల మాట కాదనగలమే

ఋషుల మాటలకు ఎదురు చెప్పగలనా అంటూ తన ఋషి భక్తిని ప్రకటించుకున్నాడ

IMG_0992

 

 

 

 

రామాయణం

తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపం

అచింత్యాన్యప్రమేయాని కులాని నరపుంగవ
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోస్తి కశ్చవ

సదృశో ధర్మసంబంధః సదృశౌ రూపసంపదా
రామలక్ష్మణయో రాజన్ సీతా చోర్మిళయా సహ

రామలక్ష్మణులతో సీతా ఊర్మిళల వివాహం చేస్తానని జనక మహారాజు మాట ఇచ్చాక ఆ మహరాజుతో వసిష్ఠ విశ్వామిత్ర మహర్షులు ” నరపుంగవా ! ఇక్ష్వాకు , విదేహ వంశాలకు సమానమైన వంశాలు పృథ్విలో లేవు . అప్రమేయమైన ( సరిగా తెలియ రానటువంటి , ఏ పరిమితికీ లోనుబడనటువంటిది ) , అద్వితీయమైన మీ వంశాలకు చెందిన శ్రీరామ చంద్రుడితో సీతా దేవి వివాహం , ఊర్మిళతో లక్ష్మణుడి వివాహం మీ ఇరువురి కులగౌరవాన్ని పెంచుతుంది .  రూప సంపదలకు తగిన సంబంధమిది .

వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ
భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః

అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణా ప్రతిమం భువి
సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే

 

భరతస్య కుమారస్య శతృఘ్నస్య చ ధీమతః
వరయామః సుతే రాజన్ తయోరర్థే మహాత్మనో

నరశ్రేష్ఠుడవైన జనక మహారాజా ! మేము పలికే వాక్యాలను వినండి . మీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మజ్ఞుడు . భూలోకంలో సాటిలేని రూపంతో వెలుగొందుతున్న  కుశధ్వజ మహారాజు ఇరువురు కుమార్తెలను (మాండవి , శ్రుతకీర్తి ) భరత శతృఘ్నులకు భార్యలుగా వరిస్తున్నాము . మీ తమ్ముని కుమార్తెలను వధువులుగా కోరుతున్నాము .

IMG_3551

రామాయణం

IMG_3316

దదామి పరమప్రీతో వధ్వౌ తే రఘునందన
రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ
పితృకార్యం చ భద్రంతే తతో వైవాహికం కురు

మఘాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో
ఫల్గున్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు
రామలక్ష్మణ్యో రాజన్ దానం కార్యం సుఖోదయం

రఘునందనా ! నేను పరమ ప్రీతితో కన్యాదానం చేస్తున్నాను . రామ లక్ష్మణులతో గోదానం చేయించండి . అటుపిమ్మట నాందీ కార్యక్రమాలను (నాందీ శ్రాద్ధం ) చేసి వివాహం చేయవలసింది అని ప్రార్థించాడు . రఘునందనుడు అంటే ఈ సందర్భంలో దశరథుడని తెలుస్తూనే ఉంది .

మహాబాహువులతో ఒప్పే దశరథ మహారాజా ! నేడు మఘా నక్షత్రం ( ఇరవై ఏడు నక్షత్రాలలో పదవ నక్షత్రం) . నేటికి సరిగా మూడవ రోజున ఫల్గుణీ నక్షత్రం (ఉత్తర ఫల్గుని ) . ఆ శుభ దినాన రామలక్ష్మణులకు భావికాలంలో శుభాన్ని కలిగించే ఇతర దానాలను కూడా చేయించడి (భూదానం ,హిరణ్యదానం మొదలగునవి ) అని దశరథునితో వినయంగా పలికాడు జనక మహారాజు .

 

IMG_3130

Additional information:

పూర్వ ఫల్గుణి ,ఉత్తర ఫల్గుణీ నక్షత్రాలు జంట నక్షత్రాలు (బైనరీ పేర్ ). పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి అధిపతి భగుడు .ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి అధిపతి అర్యముడు . పూర్వ ఫల్గుణీ నక్షత్రంలో ప్రేమలో పడడం , ఆకర్షణకు గురికావడం లాంటివి జరుగుతాయి . ఉత్తర ఫల్గుణీ నక్షత్రం దీర్ఘ కాల సంబంధాలకు దోహదం చేస్తుంది .అంటే వివాహం వలన కలిగే సంబంధం . వివాహం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలోచేస్తే ఆ జంట చాలాకాలం కలిసికట్టుగా ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతుంది . ఉత్తర ఫల్గుణీ నక్షత్రాన్ని వివాహాలు చేయడానికి అనువైనదని భావిస్తారు . ఈ నక్షత్రాన్ని ఐశ్వర్య ప్రదాతగా భావిస్తారు .ఈ నక్షత్రాధిపతి జీవితంలో పడేందుకు దోహదం చేసి , భార్యా భర్తల అనురాగాన్ని వృద్ధి చేసి వారికి సత్సంతాన్నిస్తాడని మనవారి నమ్మకం .

పాశ్చాత్యులు ఈ నక్షత్రాన్ని “దెనెబోలా ( Denebola)” అని అంటారు . సింహ రాసిలో 26.40 డిగ్రీల నుండి మొదలై కన్యా రాసిలో 10 డిగ్రీల వద్ద సమాప్తమవుతుంది . ఈ నక్ష్తత్రపు గుర్తు మంచం (లేక మంచపు ముందు కాళ్ళు ) . నక్షత్ర రాసిలో ఇది 12 వ నక్షత్రం . ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి అధిపతి సూర్యుడు  . ఇది సూర్యుడికంటే పెద్దదైన నక్షత్రం .

 

రామాయణం

తస్మా ప్రదానాద్ బ్రహ్మర్షే యుద్ధ మాసీన్మయా సహ
స హతో భిముఖో రాజా సుధన్వా తు మయా రణే

నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపం
సాంకాశ్యే భ్రాతరం వీరమభ్యషించం కుశధ్వజం

శివధనుస్సును , సీతను తన కివ్వలేదని క్రుద్ధుడై నాతో యుద్ధం చేసాడు . రణంలో ఆ సుధన్వుణ్ణి నేను నిర్జించాను . ఆ సుధన్వుని సంహరించినాక సంకాశ్యపురానికి కుశధ్వజుని రాజుగా అభిషేకించాను .

కనీయా వేష మే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే
దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుంగవ
సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ

మహామునీ ! సోదరులిద్దరిలో నేను పెద్దవాడను . కుశధ్వజుడు చిన్నవాడు .

నా కుమార్తె సీతను శ్రీరామునికీ , రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునికీ ఇచ్చి వివాహం సంతోషంగా చేస్తాను .

వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమాం
ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్దదామి న సంశయః

19745766306_f0ed600bb9_o
“సీత వీర్య శుల్క అని నా ప్రతిజ్ఞ . సురసుతలతో (దేవకన్యలతో ) సమానమైన నా సీతను రామునికిచ్చి వివాహం చేస్తాను .అలాగే రెండవ కుమార్తె యైన ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహం చేస్తాను . ఇస్తాను , ఇస్తాను ,ఇస్తాను అని మూడుమార్లు వక్కాణించి పలుకుతున్నాను . సంశయింప వలసిన పనిలేదు” .

విశేషం : మూడు సంఖ్యకు మనదగ్గర అతి ప్రాధాన్యం . మూడు మార్లు నేనీ పని చేస్తానని పలికితే , తలచిన పని తప్పకుండా చేసి తీరాల్సిందే . మూడు మార్లు చెప్పడమంటే మనో వాక్కాయ కర్మలచే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని శపథం చేయడం . ఇక ఆ మాటకు తిరుగు లేదు . సందేహ పడవలసిన పనిలేదు . జనక మహారాజు ఈ సమయంలో అటువంటి ప్రతిజ్ఞ చేసాడు .

రామాయణం

IMG_0161

హర్యశ్వస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రతింధకః
ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః

పుత్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతి స్మృతః
దేవమీఢస్య విబుధో విభుదస్య మహీధృకః

మహీధృక సుతో రాజా కీర్తిరాతో మహాబలః
కీర్తిరాతస్య రాజర్షేర్మహారోమో వ్యజాయత

మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణ్రోమా వ్యజాయత
స్వర్ణరోమస్తు రాజర్షేర్ హ్రస్వరోమా వ్యజాయత

తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః
జ్యేష్ఠోహ మనుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః

హర్యశ్వునకు మరుడు , మరునికి ప్రతిబంధకుడు , ఆతనికి ధర్మాత్ముడైన కీర్తిరథుడు పుట్టారు . కీర్తిరథునికి దేవమీఢుడు , దేవమీఢునికి విబుధుడు ఆతనికి మహీధృకుడు , ఆతనికి కీర్తిరాతుడు , కీర్తిరాతునికి మహారోముడు జనించారు . మహారోముని కుమారుడు స్వర్ణరోముడు అతడు రాజర్షి , ఇతని కొడుకే హ్రస్వరోముడు .హ్రస్వరోమునికి ఇద్దరు పుత్రులు . నేను పెద్దకుమారుడను .వీరుడైన కుశధ్వజుదు నా సహోదరుడు .

మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే సోభిషిచ్య నరాధిపః
కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః

వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహం
భ్రాతరం దేవసంకాశం స్నేహాత్పస్యన్ కుశధ్వజం

కస్య చిత్త్వథ కాలస్య సాంకాశ్యాదగమ త్పురాత్
సుధన్వా వీర్యవాన్రాజా మిథిలా మవరోధకః

స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమం
సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి

మా జనకుడు నాకు రాజ్యాభిషేకం చేసి రాజ్య భారము , కుశధ్వజుని భారము నాపై మోపి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు .వనంలో వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థులైనారు . నేను దేవసంకాశుడైన కుశధ్వజుని స్నేహ భావంతో చూస్తూ ధరా భారాన్ని భరించాను .

కొంత కాలం ఇలా గడిచింది . పిదప సాంకాశ్య పురానికి రాజు సుధన్వుడు తనకు ఉత్తమమైన శివధనుస్సును ఇచ్చి ,సీతా దేవితో వివాహం గావించమని వార్త పంపాడు .

రామాయణం

ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః
శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితం

ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః
వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే

రాజా భూత్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా
నిమిః పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వరః

వరుడి వంశ మహారాజులనూ వారి గుణగణాలనూ విన్న జనక మహారాజు అంజలి ఘటించి వసిష్ఠ మహర్షితో ” మహాత్మా తమకు మంగళమగుగాక . నా వంశాన్ని గురించి చెబుతాను . దయచేసి వినవలసింది . కన్యాదాన సమయలో సద్వంశంలో జనించిన వారు తమ పూర్వీకులను గురించి పరిపూర్ణంగా చెప్పాలి . పూర్వం త్రిలోకాలలో అతి బలవంతుడైన నిమి చక్రవర్తి ఉండేవాడు . తను స్వయంగా చేసిన మంచి పనుల వలన ఆతడు ప్రసిద్ధుడు .ఆతడు పరమ ధర్మాత్ముడు , శ్రేష్ఠుడు .

తస్య పుత్రో మిథిర్నామ మిథిలా యేన నిర్మితా
ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః

ఆతని పుత్రుడే మిథి . మిథి నిర్మించిన నగరం ఈ మిథిలా నగరం . మిథి మహారాజే మొదటి జనకుడు .మిథి కుమారుడు ఉదావసువు . (మిథిలా నగరాన్ని పరిపాలించిన రాజులందరూ జనకులేనేమో ?)

IMG_2911

ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః
నందివర్ధన పుత్రస్తు సుకేతుర్నామ నామతః

సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః
దేవరాతస్య రాజర్షేర్ బృహద్రథ ఇతి స్మృతః

బ్రహద్రథస్య శూరో భూన్మహావీరః ప్రతాపవాన్
మహావీరస్య ధృతిమాన్ సుధృతిః సత్యవిక్రమః

సుధృతేరసి ధర్మాత్మా దృష్టకేతుస్సుధార్మికః
దృష్టకేతోస్తు రాజర్షే హర్యస్య ఇతి విశ్రుతః

ఉదావసువునకు నందివర్ధనుడు ,ఆతని కుమారుడు సుకేతువు . దేవరాతుడు సుకేతువు కుమారుడు . ధర్మాత్ముడు ,మహా బలుడు . రాజర్షి అయిన దేవరాతునకు పుత్రుడు బృహద్రథూడు . ఆతని కుమారుడు మహావీరుడు . అతనికి పుట్టిన వాడు సుధృతి . సుధృతి కి జనించినవాడు ధృష్టకేతువు . ఆతని పుత్రుడు హర్యశ్వుడు .

 

రామాయణం

సుదర్శనః శంఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్
శీఘ్ర గస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః సుతః
మరోః ప్రశు శుక్రస్త్వాసీద్ అంబరీషః ప్రశుశ్రుక్రాత్

అంబరీషస్య పుత్రో భూన్నహుషః పృథివీపతిః
నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః

నాభాగస్య బభూవాజః అజాద్దశరథో భవత్
అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ

శంఖణునికి సుదర్శనుడు , ఆతనికి అగ్నివర్ణుడు , అగ్నివర్ణునికి శీఘ్రగుడు , అతనికి మరువు , మరువుకు ప్రశుశుక్రుడు , ఆతనికి అంబరీషుడు , అంబరీషునికి నహుష మహారాజు , నహుషునకు యయాతి అనే కుమారుడు జనించారు .

నాభాగుని కుమారుడు అజ మహారాజు . అజమహారాజు కుమారుడే “దశరథ మహారాజు “. దశరథుని సుపుత్రులే ఈ రామ లక్ష్మణులు ” .

ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమ ధర్మిణాం
ఇక్ష్వాకు కులజాతానాం వీరాణాం సత్యవాదినం

రామ లక్ష్మణ యోరర్థే త్వత్సుతే వరయే నృప
సదృశాభ్యాం నృపశ్రేష్ఠ దాతుమర్హసి .

“మానవులలో ఉత్తముడవైన జనక మహారాజా ! మొదటి నుండీ పరిశుద్ధమైన వంశం కలవారూ , వీరులూ , సత్యవంతులూ , పరమ ధార్మికులూ , ఇక్ష్వాకు వంశీయులూ అయిన రామలక్ష్మణులకొరకై నీ కుమార్తెలను వరించుచున్నాను . కన్యాదానం చేయడానికి నీవు అర్హుడవు . శ్రేష్ఠులైన రామలక్ష్మణులకు నీ కుమార్తెలతో వివాహం జరిపించవలసినది .” అని కోరాడు .

విశేషం :IMG_2938

వివాహంలో పెద్దల పేర్లను చెప్పడం వలన తమ వంశీయుల గురించీ వారి గొప్పదనాన్ని గురించీ వధూ వరులకు తెలుస్తుంది . వంశీయుల కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింప జేయాలనే కోరిక కలుగుతుంది . అందువలన ఉత్తమమూ , ధర్మమూ , ప్రజారంజకమూ అయిన మార్గంలో పయినించడానికి తగిన్ స్ఫూర్తి కలుగుతుంది . స్వర్గంలో ఉన్న పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది . అందుకే ఈ అచారం . జెనెటిక్స్ ప్రకారం చూసినా మన “కారెక్టెరిస్టిక్స్ ” పూర్వీకులైన ఏడు తరాల వారి నుండి లభిస్తాయి . కన్యాదాతలకు తమ వంశాన్ని గురించి వివరిస్తే పూర్వీకుల పూర్వీకుల సద్గుణాలు కొన్నైనా  వధూ వరులకు వచ్చి  ఉంటాయని నమ్మకం . ఆ నమ్మకంతో  నిశ్చింతగా ఉండగలరు . అందుకే గోత్ర ప్రవరలు బహిరంగంగా చెప్పే ఆచారం .

 

 

 

రామాయణం

సపత్న్యాతు గరస్తస్యై దత్తో గర్భ జిఘాంసయా
సహ తేన గరేణైన జాతః స సగరో భవత్

సగరస్యాస సమంజస్తు అసమంజాత్తథాంశుమాన్
దిలీపోంశుమంతః పుత్రో దిలీపస్య భగీరథః

భగీరథాత్ కకుత్థస్య రఘుః సుతః రఘు@ సుతః
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః
కల్మాషపాదోహ్య భవత్తస్మాజ్జతస్తు శంఖణః

గరళం ప్రయోగించినా చ్యవన మహర్షి అనుగ్రహంతో సజీవంగా పుట్టాడు . గరళం బాలుని శరీరంలో ఉన్నది .” గరళం లేక గర” సహితంగా పుట్టాడు కనుక ఆ బాలుడు సగరుడయ్యాడు . ఆతని కుమారుడు అసమంజసుడు . అసమంజసుని కొడుకు అంశుమంతుడు . ఆతని పుత్రుడు దిలీపుడు . దిలీపుని కుమారుడు గంగమ్మను పృథ్వీతలానికి కొనివచ్చిన భగీరథుడు . భగీరథుని కకుథ్సుడు , ఆతనికి రఘు మహారాజు , ఆతనికి పురుషాదకుడు , ఆతనికి కల్మాషపాదుడు ఆతనికి శంఖణుడు వరుసగా పుట్టారు .

IMG_3023.JPG

రామాయణం

యశస్వీ ధ్రువసంధేస్తు భరతో నామ నామతః
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్ 

యస్యైతే ప్రతిరాజాన ఉపపద్యంత శత్రవః
హైహయాస్తా తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః

తాంస్తు స ప్రతియుధ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసితః
హిమవంత ముపాగమ్య భృగుప్రస్రవణే వసత్
అసితోల్పబలో రాజా మంత్రిభిః స హితస్తదా

ధ్రువసంధికి భరతుడు , భరతునికి అసితుడు జనించారు . హైహయ , తాలజంఘ , శశిబిందు వంశాలకు చెందిన రాజులు అసిత మహారాజుకు శత్రువులు .వారు అసిత మహారాజును యుద్ధంలో ఓడించారు . మిగిలిన కొద్దిపాటి సైన్యంతో అశితుడు హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి భృగుశ్రవణ మనే ప్రదేశంలో నివసించాడు .

ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతం
ఏకా గర్భనాశాయ సపత్న్యై సగరం దదౌ

తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః
భార్గవశ్చ్యవనో నామ హిమవంత ముపాశ్రితః

తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసం
వవందే పద్మ పత్రాక్షీ కాంక్షంతీ సుతం ఉత్తమం

తమృషిం సాభ్యుపాగమ్య కాళిందీ చాభ్యవాదయత్
స తామభ్య వరద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని

అసిత మహారాజుకు ఇరువురు భార్యలు . భృగుశ్రవణంలో ఉన్నప్పుడు వారిద్దరూ గర్భవతులు . అసూయతో సవతి గర్భాన్ని భంగం చేయడానికి ఒక రాజ భార్య ఆవిడకు విషంతో కూడిన ఆహారాన్ని ఇచ్చింది .అదే సమయంలో రమ్యమైన పర్వతాలంటే ఇష్టపడే భృగువంశ సంజాతుడైన చ్యవన మహర్షి హిమవత్పర్వత ప్రాంతానికి అరుదెంచాడు . పద్మ పత్రాక్షి అయిన అసిత మహారాజు భార్య తనకు కుమారుడు కావలెనని కోరికతో దేవతల వంటి వర్ఛస్సుతో వెలుగొందే చ్యవన మహర్షికి వందనం చేసింది .

తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సు మహాబలః
మహావీర్యౌ మహాతేజా అచిరాత్సంభవిష్యతి
గరేణ సహితః శ్రీమాన్మా శుచః కమలేక్షణే

చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా
పతిశోకాతురా తస్మాత్పుత్రం దేవీ వ్యజాయత

మహారాణికి విషం పెట్టిన రాణి పేరు కాళింది . ఆవిడ కూడా చ్యవన మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించింది . మహారాణిని ఉద్దేశించి చ్యవన మహర్షి ” మహాభాగే ! నీకు సుపుత్రుడు పుడుతాడు . మహాబలుడు , మహావీరుడు నీ కుక్షిలో పెరుగుతున్నాడు . గరళ (విషం ) సహితంగా కొద్దికాలంలో ఐశ్వర్యవంతుడై పుడతాడు ” అని పలికాడు . .కొంత సమయం గడిచాక చ్యవన మహర్షి అనుగ్రహం వలన రాజపుత్రి , రాజ పత్ని , భర్తృమరణం చే శోకంతో నిండి ఉన్న ఆ మహారాణి ఒక కుమారుని కన్నది .

అసిత మహరాజు చనిపోయినట్టు ఇంతకు ముందటి శ్లోకాలలో చెప్పబడలేదు . యుద్ధంలో ఓడిపోయాడనే చెప్పబడింది

IMG_6379.JPG

రామాయణం

వివస్వాన్ కాశ్యపాద్ జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః
మనుః ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోస్సుతః

తమిక్ష్వాకు మయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకం
ఇక్ష్వాకోస్తు సుతః శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుతః

కుక్షే రథాత్మజః శ్రీమాన్ వికుక్షిరుద పద్యత
వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్

పరమాత్మతో మొదలు పెట్టిన వంశంలో వరుసగా బ్రహ్మ దేవుడు , మరీచి , కాశ్యపుడు , సూర్యుడు , సూర్యకుమారుడు మనువు , ఇక్ష్వాకువు పుట్టారు . ఇక్ష్వాకువు అయోధ్యా నగరానికి మొట్ట మొదటి రాజు . అతని కుమారుడు కుక్షి . కుక్షి కుమారుడు వికుక్షి . వికుక్షి కుమారుడు ప్రతాపవంతుడైన బాణుడు .

బాణస్య తు మహాతేజా అనరణ్యః ప్రతాపవాన్
అనరణ్యాత్పృథు ర్జజ్ఞే త్రిశంకుస్తు పృథో సుతః

త్రిశంకోరభవత్పుత్రో దుందుమారో మహాయశాః
యువనాశ్వ సుతస్త్వాసీన్ మాందాతా పృథివీ పతిః

మాంధాతస్తు సుతః శ్రీమాన్ సుసంధిరుదపద్యత
సుసంధేరసి పుత్రౌ ద్వౌ ధ్రువ సంధిః ప్రసేనజిత్

మహా తేజస్వి అనరణ్యుడు బాణ కుమారుడు . అనరణ్యునకు పృథువు, పృథువునకు త్రిసంకువు , ఆతనికి దుందుమారుడు (దుందుమారునికి యవనాశ్వుడని ఇంకో పేరు ) , దుందుమారునికి మాంధాత చక్రవర్తి . మాంధాత కుమారుడు శ్రీమంతుడైన సుసంధి . అతనికి ధ్రువ సంధి , ప్రసేనజిత్ అని ఇరువురు కుమారులు . DSC01869.JPG