Monthly Archives: డిసెంబర్ 2013

రామాయణం

కస్యచిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః
జజ్ఞే పరమ ధర్మిష్టో గాధిరిత్యేవ నామతః
స పితా మమ కాకుత్స గాధిః పరమధార్మికః
కుశవంశప్రసూతోస్మి కౌశికో రఘునందన

కాలక్రమంలో కుశనాభునికి ధీమంతుడైన గాధి జన్మించాడు . రఘురామా ! ఆ గాధి నాకు తండ్రి . పరమ ధార్మికుడు . కుశుని వంశంలో జన్మించడం వలన నాకు కౌశికుడనే పేరు కలిగింది .

నా భావాలు :

ఫలపుష్పాదులతో పరిమళిస్తూ ఉన్న ప్రదేశాన్ని గురించిన కథ చెప్పమంటే విశ్వామిత్రుడు తన జన్మవృత్తాంతం చెప్పాడు . తన వంశానికి మూలం బ్రహ్మ దేవుడని , కుశుడు పుట్టిన వంశంలో పుట్టినందున తనను కౌశికుడని అంటారనీ చెప్పాడు .  మన  పూర్వీకుల  పేర్లను   పెట్టుకోవడం పరిపాటిగా వస్తున్న సంస్కృతి .