Monthly Archives: అక్టోబర్ 2014

రామాయణం

ఉపాధ్యాయ వచః శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివః

షష్టిం పుత్రసహస్రాణి వాక్యమే తదువాచ హ

గతిం పుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభాః
మంత్రపూతైర్మహాభాగైరాస్థితో హి మహా కృతుః

తద్గచ్ఛత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు వః
సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్ఛత

పవిత్రులైన ఋత్విక్కుల మాటలు విన్న మహారాజు ” యజ్ఞాశ్వాన్ని అపహరించడానికి రాక్షసులు – మంత్ర ప్రభావంతో పునీతులైన మహర్షులున్న ఈ యజ్ఞవాటికలో ప్రవేశించలేరు . ( అయినా యజ్ఞాశ్వం మాయమయింది ) . మీరు వెంటనే బయలుదేరి సముద్రమే మాలగా కలిగిన భూభాగాన్నంతా వెదకి యజ్ఞాశ్వాన్ని కనుగొనండి . మీకు భద్రమగు గాక ” అని పలికాడు . ఇంతేకాదు ,

ఏకైక యోజనం పుత్రా విస్తారమధిగచ్ఛత
యావత్తురగ సందర్శస్తావత్ఖనత మేదినీం
తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా

దీక్షితః పౌత్రసహితః సోపాధ్యాయగణో హ్యహం
ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగ దర్శనం

” మీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క యోజన భాగాన్ని పంచుకుని అశ్వాన్ని అపహరించినవానికై వెదక వలసింది . ( అవసరమైతే ) గుఱ్ఱం కోసం భూమిని త్రవ్వండి . హయం కనిపించే వరకు దీక్షలో ఉన్న నేనూ , ఋత్విజులూ   ఈ యజ్ఞభూమిలోనే ఉంటాము ” అని అజ్ఞాపించాడు .