Monthly Archives: నవంబర్ 2013

రామాయణం

కృతోద్వాహే  గతే  తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ

అపుత్రః పుత్రలాభాయ పౌత్రీమిష్టిమకల్పయత్

ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిం

ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుతస్తదా

పుత్రస్తే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః 

గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతాం

ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిం
జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం

కుమార్తెల  కళ్యాణం  కమనీయంగా  చేసిన   కుశనాభునికి   పుత్రులు  లేరు . ఈ  లోటు  తీర్చుకోవడానికి  పుత్రకామేష్టి  యాగాన్ని  చేసాడు . బ్రహ్మదేవుని కుమారుడూ   కుశనాభుని  తండ్రీ అయిన   కుశ  మహారాజు  కుశనాభుని ” కుమారా ! రాబోయే కాలంలో నీకు గాధి  అనే  పేరుగల కుమారుడు  పుడతాడు .  సుధార్మికుడైన  గాధిని కన్నందువలన  లోకంలో   నీ  కీర్తి  శాశ్వతంగా  నిలిచిపోతుంది ”  అని  ఆశీర్వదించి , అకాశమార్గంద్వారా   శాశ్వతమైన  బ్రహ్మలోకానికి  వెళ్ళిపోయాడు .

నా  భావాలు :

హిందూ  ధర్మంలో  తలితండ్రుల కన్నా  మించిన  దైవం వేరే  లేదు . అందుకే  తలితండ్రుల  ఆశీర్వచనాలకు  అంత  ప్రాధాన్యత .  వారినోట  మంచిమాట  మనకు  సర్వ సుఖాలనూ  ఇస్తుంది .  ఇది సత్యం , పునస్సత్యం .

రామాయణం

స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగత జ్వరాః
యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా
స ద్ర్ష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః
బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః
కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః
సదారం ప్రేషయామాస సొపాధ్యాయగణం తదా
సోమదా చ సుసంహృష్ట్వా పుత్రస్య సదృశీం క్రియాం
యథాన్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత
స్పృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ

బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేయగానే కుశనాభుని కుమార్తెల గూని రూపం మటుమాయమయింది . పరిపూర్ణంగా అరోగ్యవంతులైనారు . తేజస్సు తిరిగి వచ్చింది . పున్నమినాటి పూర్ణచంద్రుని శోభతో వెలిగిపోతున్న పుత్రికలను చూసి ఆనందించాడు కుశనాభుడు . తన కుమార్తెలనూ , అరణంగా వేదవేత్తలైన ఉపాధ్యాయ గణాన్నీ బ్రహ్మదత్తుని రాజ్యానికి పంపాడు .

సుసంపన్నలైన కోడ్శళ్ళను చూసిన సోమద మురిసిపోయింది . ఒక్కొక్కరినీ ప్రేమతో స్పృశించింది . వివాహం చెసుకున్న కుమారుణ్ణి అభినందించింది . కుశనాభుణ్ని పొగిడింది .
కన్యల కథ సంతోషంగా సమాప్తమయింది .

నా ఆలోచనలు :
సంపన్నుడైన బ్రహ్మదత్తునికి అరణంగా ఇవ్వడానికి తగిన సంపదలు కుశనాభుని వద్ద లేవు . అందుకే సరియైన మార్గం చూపి సంసారాన్ని సుఖమయం చేయగల శక్తికలిగిన ఋత్విక్ గణాన్ని అరణంగా కుమార్తెలతో పంపాడు .
అత్తా కోడళ్ళ మధ్య సయోధ్య ఉండేదాకాలంలో . కోడళ్ళను తడిమి తడిమి చూసి మురిసి ఆనందించిన సోమదే దీనికి ఉదాహరణం . కోడళ్ళ మనసులు దోచుకోవడానికి వారి పుట్టింటివారిని పొగిడింది సోమద . అత్తా కోడళ్ళు అనుకూలంగా ఉంటే ” గృహం స్వర్గ సీమ అవుతుందన్నది ” జగమెరిగిన సత్యం . అది మన వారసత్వం . ఈ వారసత్వాన్ని గమనించి పాటించడం ప్రస్తుత కాలంలో కూడా ముఖ్యం .

దీనితో ముప్పది మూడవ సర్గ కూడా ముగిసింది .

स दृष्ट्वा वायुना मुक्ताः कुशनाभो महीपतिः
बभूव परम प्रीतो हर्षम् लेभे पुनः पुनः

कृत उद्वाहम् तु राजानम् ब्रह्मदत्तम् महीपतिः
सदारम् प्रेषयामास स उपाध्याय गणम् तदा

सोमदा अपि सुतम् दृष्ट्वा पुत्रस्य सदृशीम् क्रियाम्
यथा न्यायम् च गन्धर्वी स्नुषाः ताः प्रत्यनंदत
स्पृष्ट्वा स्पृष्ट्वा च ताः कन्याः कुशनाभम् प्रशस्य च

kuSanaabha was more than pleased watching his daughters freed from all their physical difficulties caused by Vayu . The girls sparkled like brightly shining a full moon as soon as they regained their health at the hands of Brahmadatta .The wedding  over  Kusanabha bade goodbye to his daughters  . They were received at Kampilya city by their beautiful celestial mother in law Somada . She caressed her daughters in law with lots of love and affection . Happiness was spread everywhere .

the story and thirty third sarga end at this point .

స రాజా సౌమదేయస్తు పురీమధ్య వసత్తదా
కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివం
స బుధ్ధిం కృతవాన్ రాజా కుశనాభః సుధార్మికః
బ్రహ్మదత్తాయ కాకుత్స దాతుం కన్యాశతం దదా
తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః
దదౌ కన్యాశతం రాజా సుప్రీతే నాంతరాత్మనా
యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునందన
బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా

అర్థం :

సోమిద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరానికి ప్రభువై , ప్రజాపాలనం చక్కగా చేస్తూ ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేవాడు . బ్రహ్మదత్తునికి తన కుమార్తెలనిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు కుశనాభుడు . ప్రేమపూర్వకంగా బ్రహ్మదత్తుని ఆహ్వానించి తన కుమార్తెలనందరినీ అతనికి ధారాపూర్వకంగా ఇచ్చి , వైభవంగా వివాహం చేసాడు . ఆ కన్యల పాణిగ్రహణం చేసి సంతుష్టుడైనాడు ఇంద్రునితో సమానమైన బ్రహ్మదత్తుడు .

నా ఆలోచనలు :

కుమార్తెలకు  తగిన వరుని చూచి  వివాహం  చేయడం  తండ్రి  బాధ్యత .  తండ్రి  కంటే  బిడ్డల మేలు కోరే  వారెవరుంటారు ?  కానీ  కుమార్తెలు  తమంతట  తాము  ఇష్టపడి  ఎవరిననా  వివాహం చేసుకోదలచుకుంటే , ఆ యువకుడి  గుణగణాలను  పరికించి  ఆతనితో  వివాహం  చేయడం  ఉత్తమమని  నా  ఆలోచన . కానీ కుమార్తె వరించిన వరుడు తగినవాడు కాక పోతే ఆ విషయం  కుమార్తెకు మనసు నొప్పించకుండా  అర్థమయ్యేలా  చెప్పాల్సిన బాధ్యత కూడా తండ్రిదే .

स राजा ब्रह्मदत्तः तु पुरीम् अध्यवसत् तदा
कांपिल्याम् परया लक्ष्ंया देवराजो यथा दिवम्

स बुद्धिम् कृतवान् राजा कुशनाभः सुधार्मिकः
ब्रह्मदत्ताय काकुत्स्थ दातुम् कन्या शतम् तदा

तम् आहूय महातेजा ब्रह्मदत्तम् महीपतिः
ददौ कन्या शतम् राजा सुप्रीतेन अंतरात्मना

यथा क्रमम् ततः पाणिम् जग्राह रघुनंदन
ब्रह्मदत्तो महीपालः तासाम् देवपतिर् यथा

स्पृष्ट मात्रे ततः पाणौ विकुब्जा विगत ज्वराः
युक्ताः परमया लक्ष्ंया बभौ कन्या शतम् तदा

Brahmadatta ruled Kampilya city with great aplomb and poise . His kingdom was prosperous . Personally he was pious and as a  King he was without any blemish . His name spread far and wide .  Kusanabha thought that Brahmadatta would be ideal husband for his aggrieved daughters . His presence will relieve them from the troubles caused by Vayu . Acccordingly he sent an  invitation to Somada’s son offering the hands of his daughters . Brahmadatta gleefully accepted the offer  and reached Mahodayapura  . Wedding was conducted befitting the greatness of both the parties . The moment Brahmadatta touched the hands of the girls ( In Hindu culture Panigrahana is another name for marriage – Pani is hand ), as if by magic all  ailments of the girls vanished . Such was the power of  the son of Chuuli , the sage .

My thoughts :

The progeny of a person born out of the thought process of a great soul is great . Brahmadatta is a blessed soul because of his father . Mere nearness to such people relieves you from difficulties .

ఊరక రారు మహాత్ములు

వారు వచ్చుటలెల్లం కారణములగు మంగళములకు

which means the arrival of great people ( to our houses ) leads to good things and good tidings .

 

 

 

రామాయణం

స రాజా సౌమదేయస్తు పురీమధ్య వసత్తదా
కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథాదివం
స బుధ్ధిం కృతవాన్ రాజా కుశనాభః సుధార్మికః
బ్రహ్మదత్తాయ కాకుత్థ్స దాతుం కన్యాశతం తదా
తమహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః
దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా
యథాక్రమం తతః పణ్ణీన్ జగ్రాహ రఘునందన
బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా

సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు అలకాపురిలోని మహేంద్రునివలె , కాంపిల్యమనే నగరంలో భోగభాగ్యాలతో తులతూగుతూ నివసించేవాడు . కుశనాభుడు తన కుమార్తెలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు . అనుకున్నదే తడవుగా ఆ మహాత్ముని సకల మర్యాదలతో నగరానికి ఆహ్వానించి తన కుమార్తెలనిచ్చి వివాహం చేసాడు . దేవేంద్రునితో సమానంగా తులతూగే బ్రహ్మదత్తుడు ఆ కన్యలందించిన హస్తాలను  గ్రహించాడు . పాణి  గ్రహణం చేసాడు .

స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః
యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా

బ్రహ్మదత్తుని చేయి తగిలిన మరుక్షణం వాయుదేవుని వలన కలిగిన గూని రూపం మాయమయింది . జ్వరం తొలగిపోయింది . ఆ కన్యలు కాంతితో వెలిగిపోయారు .

చూళి మానస పుత్రుడు బ్రహ్మదత్తుడు . తపశ్శక్తి వలన జన్మించినవాడు . సోమద చూళి మహర్షిని కోరింది ” బ్రహ్మతేజస్సుతో ” అలరారే పుత్రుని ప్రసాదించమని కదా ! అందువలన బ్రహ్మదత్తుడు సహజంగానే బ్రహ్మతేజస్సు కలిగినవాడు , మహాత్ముడు . మహాత్ముల సామీప్యం సర్వ మంగళదాయకం . అందుకే ఆ మహాత్ముని చేయి తగిలిన మరుక్షణం కన్యల కష్టాలన్నీ తొలగిపొయాయి .

అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్
బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతం
తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ పుత్రమనుత్తమం
బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళినస్సుతం

” కుమారుని మీద కోరిక ఉంది కానీ నాకు భర్త లేడు . నేనెవరికీ భార్యను కాను . అపారమైన నీ తపోబలాన్నుపయోగించి అపురూపమైన కొడుకును నాకు ప్రసాదించు . నీకు భద్రమగు గాక ” అని యుక్తి యుక్తంగా పలికింది సోమద . ప్రసన్నుడైన ఆ మహర్షి , తన తపోబలాన్ని ఉపయోగించి సోమదకు ఒక పుత్రుని ప్రసాదించాడు . అతడు బ్రహ్మదత్తు డనే పేరుతో ఖ్యాతి చెందాడు . అతనికి ” చూళి మానస పుత్రు” డని మరోపేరు .

अपतिः च अस्मि भद्रम् ते भार्या च अस्मि न कस्यचित् 

ब्राह्मेण उपगतायाः च दातुम् अर्हसि मे सुतम्  

तस्याः प्रसन्नो ब्रह्मर्षिर् ददौ ब्राह्मम् अनुत्तमम् 

ब्रह्मदत्त इति ख्यातम् मानसम् चूलिनः सुतम् 

” I am unmarried and nobody’s wife . Using your power you obtained from observing austerities and devotion to the God , please bless me with son . Bhadram ( Be safe ) ” said Somada . The resplendent sage acceded to her request . Brahmadatta is the son born to Somada . He was also known as ” brain child of ChuuLi ” .

 

 

 

 

 

రామాయణం

సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణా
ఉవాస కాలే ధర్మిష్టా తస్యాస్తుష్టో భవద్గురుః
స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన
పరితుష్టోస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియం
పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధుర స్వరా
ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్య కోవిదం
లక్ష్మ్యా సముదితో బ్రహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః
బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మిక .

అర్థం :

సోమద శుశ్రూషకు ఫలం లభించే కాలమాసన్నమయింది . శ్రధ్ధతో సేవ చేస్తున్న సోమద పై “చూళి ” మహర్షికి అనుగ్రహం కలిగింది . ” నీకు భద్ర మగు గాక ! నీ సేవలచేత నాకు సంతోషం కలిగింది . నేను నీకు ఏ విధంగా ప్రతిక్రియ చేయగలను ( సంతోషం కలిగించగలను )” అని పలికాడు .

ముని అనుగ్రహించినాడని తెలియగానే సంభాషణలో సామర్థ్యం గల సోమదకు సంతోషం కలిగింది . ముద్దు ముద్దుగా ” మహర్షీ ! తపశ్శాలివైన నీవు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నావు . బ్రహ్మతేజస్సులో నీకు దీటైన పుత్రుని నాకు ప్రసాదించు ” అని మధుర స్వరంతో పలికింది .

నా భావనలు :

సత్పురుషులకు సేవ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి . ఒక ఉవిదకు తేజశ్శాలియైన పుత్రునికి మాతృమూర్తి కావడం కంటే భాగ్యమేముంటుంది . ముని అడిగిన వెంటనే తన మనస్సులోని మాటను నిర్భయంగా బయట పెట్టింది .
కోరిక తీర్చమని అడీగే సమయంలో మహర్షి బ్రహ్మ తేజస్సు కలవాడనే విషయాన్ని తెలిపింది . బ్రహ్మ తేజస్సుతో కూడిన పుత్రుని ప్రసాదించమని కోరింది . ఒక రకంగా ఇది పొగడ్త . పొగడ్తలకు పొంగిపోని వాడెవడుంటాడు . ” సకల లోకాలకు ప్రభువైన విష్ణుమూర్తి కూడా స్తోత్ర ప్రియుడే కదా ” . అందుకే సోమదను ” వాక్యజ్ఞా ” అనే శబ్దంతో సంబోధించాడు వాల్మీకి . మధురమైన స్వరంతో మగువ కోరితే కాదనేవాడుంటాడా ? ఏకాలంలోనైనా .

सा च तम् प्रणता भूत्वा शुश्रूषण परायणा 
उवास काले धर्मिष्ठा तस्याः तुष्टो अभवत् गुरुः 

स च ताम् काल योगेन प्रोवाच रघु नंदन 

परितुष्टो अस्मि भद्रम् ते किम् करोमि तव प्रियम् 

परितुष्टम् मुनिम् ज्ञात्वा गन्धर्वी मधुर स्वरम् 

उवाच परम प्रीता वाक्यज्ञा वाक्य कोविदम् 

लक्ष्ंया समुदितो ब्राह्ंया ब्रह्म भूतो महातपाः 

ब्राह्मेण तपसा युक्तम् पुत्रम् इच्छामि धार्मिकम् 

Time has come for fruition of her  efforts . The sage was pleased with the services rendered by Somada . He wished to return the favours .” Somada ! I am pleased with your devotion . May good things happen to you and your desires be fulfilled . Let me know what can I do to please you ” .

Intelligent and articulate Somada seized the opportunity instantly . ” Resplendent sage ! Because of the penance and rituals performed by you , you are blessed with radiance similar to Lord brahma’s . Bless me and present me with a son who is as brilliant and as radiant as you ” .

My thoughts :

When you render service to great souls with love and devotion your wishes will be fulfilled . The celestial lady Somada has rendered unstinted service . The resplendent sage said he will return her favours by satisfying any desire she has .

Somada was intelligent and articulate . She knows how to speak and how to please and get what she wants . She has great communication capabilities . In one word she praises the sage and  explains her wish in a pleasing voice with poise and elegance . She has not  minced the words , used  minimum words , yet explains what she wants in totality . The art of expressing our thoughts  precisely is a pre requisite and hallmark of  educated and successful  persons . This needs to be cultivated .

Further she knows what she wants . A clear goal to be attained . Another recipe for success .

విసృజ్య కన్యాః కాకుత్స రాజా త్రిదశ విక్రమః
మంత్రజ్ఞ్యో మంత్రయామాస ప్రదానం సహ మంత్రిభిః

దేశేకాలే చ కర్తవ్యం సదృశే ప్రతిపాదనం

కుమార్తెలను అంతఃపురానికి వెళ్ళమని చెప్పి మంత్రజ్ఞ్గ్యుడైన మహారాజు , తన కుమార్తెలకు కలిగిన కష్టాన్ని తొలగించడానికి మంత్రులతో కూడ కలిసి అలోచించాడు . కన్యకలకు సరియైన వరుని చూసి వివాహం చేయడం ద్వారా వారి బాధలను తొలగించవచ్చనే నిశ్చయానికి వచ్చాడు .

ఏతస్మిన్నేవ కాలే తు చూళీ నామ మహాద్యుతిః  
ఊర్ధ్వరేతా శుభాచారో బ్రాహ్మం తపముపాగమత్

తపస్యంతం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే
సోమదా నామ భద్రం తే ఊర్మిళా తనయా తదా

ఆ కాలంలో ఊర్ధ్వ రేతస్కుడూ మంచి నడవడీగల “చూళి ” మహర్షి వేదోక్తమైన మార్గంలో తపస్సు చేస్తూ ఉండేవాడు . ఆ మహర్షికి ఊర్మిళ కుమార్తె సోమద అనే గంధర్వ స్త్రీ సేవ చేస్తూ ఉండేది . ఋషి విషయంలో , శ్రధ్ధతో , వినయంతో ధర్మమార్గంలో సేవ చేస్తూ ఉన్న సోమదను ఆ మహర్షి అనుగ్రహించాడు . రామా నీకు మంగళమగుగాక .

నా అలోచనలు :
శక్తి కలిగీ వాయుదేవునికి శాపమివ్వలేదు కుశనాభుడు . తన కుమార్తెలకు క్షమా గుణం గొప్పదని చెప్పిన పిదప తను కూడా ఆ క్షమా గుణాన్నే పాటించాడు . ఆచరించి చూపడమే ఆచార్యుని లక్షణం . కానీ కుమార్తెల కష్టాలను చూచి చలించిపోయాడు . వారి కష్టాలను తొలగించదలచుకున్నాడు . ఉత్తముడిన వరుని వెదికి వివాహం చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని అనుకున్నాడు . వెంటనే వరాన్వేషణ ప్రారంభించాడు .

కథ చెబుతూ “భద్రం ” అంటే ” మంగళం ” అనే పదాన్ని ఎక్కువగా పలికేవాడు విశ్వామిత్రుడు . శిష్యులకు మంచి కలగాలనే ఉత్తమమైన కోరిక గురువు మనసులో మెదులుతూ ఉంటుంది . అనుకోకుండా ఆ మాటే అప్పుడప్పుడూ పెదవులు దాటి పైకి వస్తుంది . ” భద్రం ” అనే శబ్దాన్ని విశ్వామిత్రుడు ఎన్నో సందర్భాలలో పలికాడు . ఈ కాలంలో కూడా పెద్దలు ” క్షేమగా వెళ్ళి , లాభంగా రమ్మని ” చెప్పడం మనం గమనించవచ్చు . ఈ రకమైన ఆలోచనలకు మూలం రామాయణం .

विसृज्य कन्याः काकुत्स्थ राजा त्रिदश विक्रमः 
मंत्रज्ञो मंत्रयामास प्रदानम् सह मंत्रिभिः 
देशे काले च कर्तव्यम् सदृशे प्रतिपादनम् 

एतस्मिन् एव काले तु चूली नाम महाद्युतिः 
ऊर्ध्व रेताः शुभाचारो ब्राह्मम् तप उपागमत् 

तपस्यंतम् ऋषिम् तत्र गंधर्वी पर्युपासते 
सोमदा नाम भद्रम् ते ऊर्मिला तनया तदा 

Meaning :

King Kushanabha along with his ministers started looking for solutions to relieve his daughters from their  suffering . He came to a conclusion that  marrying them off  to a great sage will get them rid of troubles caused by Vayu .

In those days a great sage ” Chuuli ” was performing  tapas ( ascetic practice as specified in Veda )  .In his endeavour   Somada , the daughter of urmila , a celestial lady , stayed and served him with great care and aplomb .

Rama let good things happen to you and you be safe .

My thoughts :

In spite of being capable, the thought of punishing Vayu  did not occur to King Kusanabha . He believed in and practiced kshama ( pardoning the persons who cause harm to self ) . At the same time  he had great love for his daughters and wished to relieve them from their suffering . He and his ministers deliberated  and came to a conclusion that marrying them off to a great person will help .

Doesn’t it reflect the thoughts of Jesus . ” if some one strikes you on the right cheek , show him the other also” . This kind of action is resorted to by strong people .” I will not resort to revenge because I am stronger than that ” -they seem to say .

రామాయణం

తాసాం తద్వచనేన శ్రుత్వా రాజా పరమధార్మికః
ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమం
క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్త్తవ్యం సుమహత్కృతం
ఐకమత్య ముపాగమ్య కులం చావేక్షితం మమ
అలఙ్కారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా
దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః
యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వా సామ విశేషతః

 

మహాతేజఃశాలి కుశనాభుడు . ధర్మాన్ని అనుసరించే ఆ మహారాజు తన తనయల పలుకులు విని , ” తప్పు చేసిన వారిని క్షమించడం ఓర్పుగల వారు చేయవలసిన పని . ( వాయుదేవునికి శాపాన్నివ్వగల శక్తి కలిగిన ఆ కన్యకలు శాపాన్ని ఇవ్వలేదు ) . ప్రశంసనీయమైన పని చేసి మీరు నా వంశ గౌరవాన్ని కాపాడినారు . పురుషులకు కానీ , స్త్రీలకు కానీ క్షమ అలంకారంగా భాసిస్తుంది . చెప్పడానికి సులభమైనా తనను కష్టపెట్టేవాడిని క్షమించడం కష్టమైన పని . దేవతా స్త్రీలకు ఇది దాదాపుగా అసాధ్యం . ( కన్యకల తల్లి ఘృతాచి – దేవతా స్త్రీ ) . అందునా మీ అందరికీ క్షమా గుణం ఉండడం విశేషం ” అని కుమార్తెలను పరిపరి విధాలుగా పొగిడాడు కుశనాభుడు .

క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః
క్షమా యశః క్షమా ధర్మః క్షమయావిష్తితం జగత్

క్షమ గొప్పతనాన్ని వివరిస్తూ ” ఓర్పే దానము , యజ్ఞము , సత్యము , కీర్తి , ధర్మము . వేయేల ! క్షమా గుణం వల్లనే జగత్తు    నిలిచియున్నది  ఉన్నది ” అని కుమార్తెలతో అన్నాడు కుశనాభుడు .

నా  అలోచనలు :

క్షమించడమన్నది ఉత్తమగుణం . ఏసుక్రీస్తు ” ఇతరులెవరనా చెంప మీద కొడితే వారికి ఇంకో చెంప కూడా చూపించమన్నాడు “. అయితే క్షమా గుణం శక్తిగల వారి చేతిలో మాత్రమే రాణిస్తుంది . తనకపకారం చేసిన వాడికి అపకారం చేసే శక్తి కలిగిఉండి కూడా క్షమించడమన్నది గొప్పగుణం . ఎందుకంటే దీనివల్ల శత్రుత్వం శాశ్వతంగా నశించి పోతుంది . ప్రపంచం క్షేమంగా ఉంటుంది .

శక్తి కలిగిన వందమంది ఒకే విధంగా అలోచించి క్షమించడం ఇంకా కష్టం . ఇక్కడ ” మాబ్ మెంటాలిటీ ” ముందుకు వస్తుంది . అందుకే కుశనాభుని కుమార్తెల ఓర్పు నిజంగా ప్రశంసనీయమైనది . సుమతీ శతక కారుడు ఒక అడుగు ముందుకు వేసి అపకారం చేసినవాదికి ఉపకారం చేయమంటాడు . ” ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ ” .
అయితే క్షమ అన్నది అందరికీ సమానంగా వర్తించదు , వర్తించకూడదు . ఉదాహరణకు రాజ్యాన్ని పాలించే వారు కఠినంగానే ఉండాలి . లేకపోతే దుష్టులు సామాన్య ప్రజలను సుఖంగా బతకనీయరు . సమయానుసందర్భంగా క్షమను చూపాలి . శక్తి ఉన్నప్పుడే చూపాలి .