Monthly Archives: నవంబర్ 2014

రామాయణం

పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవంతశ్చ సూదితాః
దేవదానవ రక్షాంసి పిశాచోరగకిన్నరాః

న చ పశ్యామహేశ్వం తమశ్వహర్తారమేవ చ
కిం కరిష్యామ భద్రం తే బుధ్ధిరత్ర విచార్యతాం

అసఫలంగా తిరిగి వచ్చిన సగర తనయులు తండ్ర్రితో ” భూభాగాలన్నీ వెదికాము . దేవ ,దానవ , రాక్షస , కిన్నర , పిశాచాల పీచమడిచాము ( సంహరించాము ) . యజ్ఞాశ్వాన్ని అపహరించినవాడు కనిపించలేదు . మాకు తదుపరి కర్తవ్యాన్ని ఉపదేశించండి . తమకు క్షేమమగుగాక ” అని పలికారు .

తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం రాజసత్తమః
సమన్యుర  బ్రవీద్వాక్యం సగరో రఘునందన
భూయః ఖనత భద్రం వో నిర్భిద్య వసుధాతలం
అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తథ .
పితుర్వచన మాసాద్య సగరస్య మహాత్మనః
షష్టిః పుత్ర సహస్రాణి రసాతల మభిద్రవన్

కుమారుల అసమర్థతకు సగరునికి కోపం వచ్చింది . ” భూతలాన్ని మరొకమారు త్రవ్వండి . అశ్వాన్ని అపహరించిన వాడిని పట్టుకొని , అటుపిమ్మట మాత్రమే ఇచటకు రండి ” అని తీవ్రంగా ఆదేశించాడు . తండ్రి ఆజ్ఞ అనుసరించి అరువది వేల మంది సగర కుమారులు మరల  అశ్వాన్ని వెదకడానికి  బయలు దేరారు .

రామాయణం

సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీన్మహాత్మనాం
పృథివ్యాం భిద్యమానాయాం నిర్గాతసమనస్వినః
తతో భిత్వా మహీం సర్వే కృత్వా చాభి ప్రదక్షిణం
సహితాః సగరాః సర్వే పితరం వాక్యమబ్రువన్

భూభాగాన్ని త్రవ్వుతున్నప్పుడు పిడుగు పడినప్పుడు వెడలే భయంకర శబ్దాల లాంటి శబ్దాలు వచ్చాయట . అవి ఆ రాజపుత్రుల వినాశనాన్ని సూచిస్తున్నాయని విశ్వామిత్ర మహర్షితో పలికించాడు వాల్మీకి . భూగోళ్ళాన్ని అంతా ఒక మారు త్రవ్వి తిరిగి తామ రాజ్యాన్ని చేరుకున్నారు . కానీ అశ్వం కనిపించలేదు .

రామాయణం : నలుబదియవ అధ్యాయం

దేవతానాం వచః శ్రుత్వా భగవాన్వై పితామహః
ప్రత్యువాచ సుసంతప్తాన్ కృతాంతబలమోహితాన్

యస్యేయం వసుధాకృత్స్నా వాసుదేవస్య ధీమతః
మహిషీ మాధవస్య స ఏవ భగవాన్ ప్రభుః

కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః

పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః
సగరస్య చ పుత్రాణాం వినాశో దీర్ఘజీవినాం

పితామహవచః శ్రుత్వా త్రయస్త్రింశదరిందమ
దేవాః పరమ సంహృష్టాః పునర్జగ్ముర్యథాగతం

సగర కుమారుల ఆగడాలకు భూమిమీద నివశించే ప్రాణులు నశిస్తాయేమోనని భయపడి తన వద్దకు వచ్చిన దేవతలతో ధాత  “మహి మాధవుని ఇల్లాలు . ధరాతలమంతా  వాసుదేవునిదే . ప్రస్తుతం విష్ణువు , కపిల మహర్షి అవతారంలో తపస్సు చేస్తున్నాడు . ఆ మహర్షి కోపాగ్నికి సగర పుత్రులు భస్మమవుతారు .ఇదంతా ( కపిల మహర్షిని సగర పుత్రులు అవమానించడం , సగర పుత్రులు బూడిదై పోవడం ) ఏనాడో లిఖించబడ్డది ” అని పలికాడు .

పితామహుని పలుకులు విన్న ముప్పది మూడు మంది దేవతలు ( బ్రహ్మ దేవుని వద్దకు ముప్పది మూడు మంది దేవతలు మాత్రమే వచ్చారట . వారు వరుసగా “అష్ట వసువులు , ఏకాదశ రుద్రులు , ద్వాదశాదిత్యులు , ఇరువురు అశ్వినీ దేవతలు ) సంతోషంతో తమ స్వస్థానాలకు మరలిపోయారు .

కపిల మహర్షి : బిందు సరోవరం
కపిల మహర్షి విష్ణ్వాంశ సంభూతుడు . కర్దమ ప్రజాపతి దేవభూతి దంపతుల ప్రియ పుత్రుడు . కన్న తల్లికి సాంఖ్య యోగాన్ని బోధించి ఆమెను మోక్షమార్గం వైపు మరల్చిన మహా జ్ఞాని . తల్లికి బిందు సరోవరంలో ( గుజరాత్ రాష్ట్రంలో , సిధ్ధపుర్ తాలుకాలో ఉన్నది బిందు సరోవరం . దీనినే మాతృగయగా పిలుస్తారు . ఈ ప్రదేశంలో తల్లికి మాత్రమే పిండప్రదానం చేయ బడుతుంది . తండ్రికీ , ఇతర పితరులకూ ఇక్కడ శ్రాధ్ధం పెట్టడం నిషేధం) . తపస్సు చేసుకునే తనను వేధించిన సగర పుత్రులను తన చూపులతో బూడిదగా మార్చాడు . తల్లికి మాత్రమే కర్మలు చేయడం ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే జరుగుతుంది . కపిల మహర్షి ఆలయాన్ని మనమిక్కడ చూడవచ్చు .

రామాయణం

తే దేవాః సగంధర్వాః సాసురాః సహపన్నగాః
సంభ్రాంతమనసః సర్వే పితామహముపాగమన్

తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణ్వదనాస్తదా
ఊచుః పరమసంత్రస్తాః పితామహ మిదం వచః

భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః
బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసినః

అయం యజ్ఞ్యహవోస్మాకమనేనాశ్వోపనీయతే
ఇతి తే సర్వ భూతాని నిఘ్నంతి సగరాత్మజాః

బాధ భరించలేక గంధర్వులూ , పన్నగులూ ,  దేవతలూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు . పూజించి , విధాత అనుగ్రహం సంపాదించారు . కలత చెందిన వారు కన్నీళ్ళతో ” భగవన్ ! తండ్రి యజ్ఞాశ్వం కొరకు సగర కుమారులు భూమిని త్రవ్వుతున్నారు . ఆ క్రమంలో పాతాళంలో నివసించే ప్రాణులను హింసిస్తున్నారు . కనిపించిన మనుష్యులను ,వీడే మన అశ్వాన్ని అపహరించాడు , అని పలుకుతూ సంహరిస్తున్నారు . మహాత్ములను కూడా వదలడం లేదు ” అని సృష్టికర్తతో మొర పెట్టుకున్నారు .

రామాయణం

శూలరశనికల్పైశ్చ హలైశ్చాపి సుదారుణైః
భిద్యమానా వసుమతీ ననాద రఘునందన

నాగానాం మధ్యమానామసురాణాం చ రాఘవ
రాక్షసానాం చ దుర్ధర్షః సత్త్వానాం నినదో భవత్

యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునందన
భిభిదుర్ధర రణీం వీరా రసాతలమనుత్తమం

ఏవం పర్వత సంబాధం జంబూ ద్వీపం నృపాత్మజాః
ఖనంతో నృపశార్దూల సర్వతః పరిచక్రముః

ఆ రాజకుమారులు భూమిని త్రవ్వుతున్నప్పుడు భయంకరంగా , భయాన్ని కలిగించే పెద్ద శబ్దాలు వెలువడ్డాయి . వసుమతి (భూదేవి) ఆర్తనాదం చేసినట్ట్లుగా ఉన్నాయి ఆశబ్దాలు . భూమాతతో బాటు భూమిలో నివాసముండే పాములు , రాక్షసులు , ఇతర జీవులూ నలిగిపోయి , బాధ భరించలేక ఆర్తనాదాలు చేసాయి . 

అరవై వేల మంది వీరులు అరవై యోజనాల భూమిని పెకలించి వేసారు . పర్వతాలతో నిండి ఉన్న జంబూ ద్వీపాన్ని ( భారత దేశాన్ని ) ఎక్కడా విడవకుండా త్రవ్వారు తండ్రి ఆజ్ఞ పాలించే ఆ తనయులు .

కల్పైశ్చ హలైశ్చాపి సుదారుణైః
భిద్యమానా వసుమతీ ననాద రఘునందన

నాగానాం మధ్యమానామసురాణాం చ రాఘవ
రాక్షసానాం చ దుర్ధర్షః సత్త్వానాం నినదో భవత్

యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునందన
భిభిదుర్ధర రణీం వీరా రసాతలమనుత్తమం

ఆ రాజకుమారులు భూమిని త్రవ్వుతున్నప్పుడు భయంకరంగా , భయాన్ని కలిగించే పెద్ద శబ్దాలు వెలువడ్డాయి . వసుమతి (భూదేవి) ఆర్తనాదం చేసినట్ట్లుగా ఉన్నాయి ఆశబ్దాలు . భూమాతతో బాటు భూమిలో నివాసముండే పాములు , రాక్షసులు , ఇతర జీవులూ నలిగిపోయి , బాధ భరించలేక ఆర్తనాదాలు చేసాయి .
అరవై వేల మంది వీరులు అరవై యోజనాల భూమిని పెకలించి వేసారు . పర్వతాలతో నిండి ఉన్న జంబూ ద్వీపాన్ని ( భారత దేశాన్ని ) ఎక్కడా విడవకుండా త్రవ్వారు తండ్రి ఆజ్ఞ పాలించే ఆ తనయులు .

రామాయణం

ఇత్యుక్తా హృష్టమనసో రాజపుత్రా మహాబలా
జగ్ముర్మహీతలం రామ పితుర్వచనయంత్రితా

యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలం
బిభిదుః పురుషవ్యాఘ్ర వజ్రస్పర్శసమైర్నఖైః

సగర మహారాజు అజ్ఞాపించగానే రాజపుత్రులు సంతోషంగా భూమిని తవ్వడానికి పూనుకున్నారు . ఒక యోజనం పొడవు ఒక యోజనం వెడల్పు గల భూభాగాన్ని ఒక్కొక్కరూ పంచుకొని , వజ్రసదృశమైన తమ గోళ్ళతో  ఛేదించడానికి పూనుకున్నారు .

ఇది అంత సమంజసంగా లేదు . భూభాగాన్ని గోళ్ళతో బద్దలు కొట్టడమేమిటని సందేహం కలగడం కద్దు . అవి గోళ్ళ వంటి పనిముట్లేమో ? తదుపరి శ్లోకం ఆ రాజకుమారులు పనిముట్లతో భూమిని తవ్వారని చెబుతుంది .