Monthly Archives: జూలై 2013

రామాయణం

మంత్రవచ్చ   యథాన్యాయం  యజ్ఞోసౌ  సంప్రవర్తతే 

ఆకాశే  చ  మహాన్  శబ్దః  ప్రాదురాసీద్భయావహః

 

 ఆవార్య  గగనం  మేఘో  యథా  ప్రావృషి  నిర్గతః 

తథా  మాయాం   వికుర్వాణౌ  రాక్షసాభ్యధావతాం .

 

మారీచశ్చ  సుబాహుశ్చ  తయోరనుచరాశ్చ  యే 

ఆగమ్య  భీమసఙ్కాశౌ  రుధిరౌఘ  మవాసృజన్  
మంత్రపూర్వకంగా యజ్ఞం జరుగుతోంది . అకస్మాత్తుగా హోమానలం చెన్నొంది వెలిగింది , కాదు కాదు  జ్వలించింది . మంటలు  మిన్ను ముట్టాయి . ఏదైనా ఘటన అకస్మాతుగా ఘటిస్తే అది ప్రమాదాన్ని సూచిస్తుందట . అంతలోనే , అది  నిజమే  అన్నట్లుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ పెద్ద శబ్దం వినిపించింది . కారు మబ్బు రీతి కాటుక చందాన ( మొల్లమ్మ భాషలో ) , అకాశాన్నంతా ఆవరిస్తూ పరుగు పరుగున వచ్చారు స్వాహా శబ్దాలను విన్న మారీచ సుబాహులు . తమ పరివారాలతో విజృంభించారు . మాయలు చేస్తూ మహాధూర్తంగా ప్రవర్తించసాగారు . యజ్ఞ వేదికలో రక్తవర్షాన్ని కురిపించారు . యజ్ఞ విధ్వంసానికి పూనుకున్నారు .

 

 

 

రామస్యైవం  బ్రువాణస్య  త్వరితస్య  యుయుత్సయా 

ప్రజజ్వాల  తతో  వేదిః  సోపాధ్యాయ  పురోహితా

 

సదర్భ  చమసస్రుక్కా  ససమిత్కుసుమోచ్చయా 

విశ్వామిత్రేణ  సహితా  వేదిర్జజ్వాల  సర్త్విజా  

 

యుధ్ధానికి  సర్వ సన్నధ్ధంగా  ఉండమని  లక్ష్మణునికి   రాముడు  తెలుపుతూ  ఉండగానే దర్భలతో , పానపాత్రలతో , స్రుక్కులతో ( హోమం  చేసే  గరిటెలు ) ,    సమిధలతో  , పుష్పాలతో , విశ్వామిత్రమహర్షితో ,  ఉపాధ్యాయులూ , పురోహితులతో ,  కూడి  సుందరంగా కనిపిస్తూ  ఉన్న యజ్ఞవేదిక   ఒక్కసారిగా  భగ్గుమని  మండింది .

అకస్మాత్తుగా  యజ్ఞవేదిక  నుండి   మంట  రావడం,  ఆపదను  సూచిస్తుందట .  రాక్షసులు  రాబోతున్నారన్న  నిజాన్ని  హోమగుండంలో  వెలిగిన  అగ్ని  సూచిస్తోంది . అది  చూసిన  రామలక్ష్మణులు  యుధ్ధానికి  సన్నిధ్ధమయ్యారు .

The sages informed Rama that the yagnyaa  will continue for six days . Rama and  Lakshmana guarded the place  for five days without  sleep  and   with  utmost  caution .   No untoward incident has taken place and they entered sixth day . Rama cautioned Lakshmana  not to step down the guard , infect to increase it . He was sure that the demons will attack on the sixth day . In a war the attacking party’s greatest strength is the element of surprise . The defending party should keep  utmost vigil and deny the enemy the surprise element . Lord Rama is aware of this fact and did not lower his guard . Even today this doctrine of surprise is valid , and to deny the enemy this surprise , umpteen  number of devices are deployed . The electronic support measures ,  the electronic counter measures and the electronic counter counter measures are all aimed at this  . The acronyms for these measures being ESM , ECM ,ECCM . The sophistication of an army largely depends on these devises . Of course in the old days physical observations were the only means . 

 

While Rama was cautioning Lakshmana to step up the guard , the fire in the Yaagakunda  flared all of a sudden . sudden  flaring of fire was indicative of impending danger as per the belief in those days .

రామాయణం

అద్యప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం
దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిత్యతి

తౌతు తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ
అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతాం

ఉపాసాఞ్చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ

అథ కాలే గతే తస్మిన్ షష్తేహని సమాగతే
సౌమిత్రిమబ్రవీద్రామో యత్తోభవ సమాహితః

” ముని మౌనం వహించాడు . ఆరు రాత్రులు యాగం జరుగుతుంది . మీరిద్దరూ యాగ రక్షణ భారం వహించండి ” అని ఆనతిచ్చిన మునుల అదేశాన్ని అక్షరాలా అమలుపరచారు అన్నదమ్ములు . రేయింబవళ్ళు నిద్రపోకుండా విశ్వామిత్రమహర్షినీ , మహర్షి యాగాన్ని కనురెప్ప వాల్చకుండా కాచారు . అయిదు రోజులు గడిచాయి . రాక్షసులెవ్వరూ యాగభూమి సమీపంలోకి రాలేదు . ఆరవ రోజున శ్రీరామచంద్రుడు తమ్మునితో ” ఈ రోజున అప్రమత్తంగా , యుధ్ధానికి సన్నధ్ధంగా ఉండాలని ” చెప్పాడు .
యుధ్ధంలో అన్నిటికన్నా కష్టమైనది శత్రువు రాకకై ఎదురు చూడడం . ఒక సైనికునిగా నాకిది అనుభవైక వేద్యం . అనుకోని సమయంలో ( శత్రువు ) అకస్మాత్తుగా వచ్చి యుధ్ధం చేయడం మనకు చాలా నష్టాన్ని సమకూరుస్తుంది . అందుకే యుధ్ధ సమయంలో క్షణం కూడా ఆదమరిచి ఉండడానికి అవకాశముండదు . ఈ విషయం తెలిసిన రామచంద్రుడు తనను తాను ఉత్సాహ పరుచుకుంటూ తన సోదరుణ్ణి కూడా అప్రమత్తంగా ఉండమని ఉద్బోధిస్తున్నాడు .

అయినా రాముడే రక్షణ భారం వహిస్తుంటే ఈ ప్రపంచంలో కావలసిందేముంది ప్రపంచభారాన్ని మోస్తున్న రాముడికి యాగభారమొక లెక్కా . ఆందరికీ ” శ్రీ రామ రక్ష “.

రామాయణం

అథ తౌ దేశకాలజ్ఞౌ రాజ్పుత్రావరిందమౌ
దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః

భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్ కాలే నిశాచరౌ
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తెత తత్ క్షణం

రామలక్ష్మణులు ఏ సమయంలో ఏవిధంగా ప్రవర్తించాలో తెలిసిన వారు . శత్రువులను మట్టుపెట్టగల సమర్థులు . సమయానుకూలంగా సముచితమైన సంభాషణ చేయగల చతురులు . వారు విశ్వామిత్ర మహర్షితో ” బ్రహ్మర్షీ ! రాక్షసులను ఏ సమయంలో రక్షించాలో మాకు వివరించండి . ఆ క్షణం దాటకూడదు గదా ” అని పలికారు . సంరక్షణమంటే ఈ సందర్భంలో సంహరించడమే .

విచిత్రంగా ఉంది కదూ . రాక్షసులను రక్షిస్తానని ( సంరక్షణీయౌ ) అని రామచంద్రుడు అంటున్నాడు . దానికి తగిన సమయమేదో చెప్పమని మహర్షిని ప్రార్థిస్తున్నాడు . సంహరించడానికి పూనుకున్న రామచంద్రుడు సంరక్షిస్తానని చెప్పడంలో మర్మమేమిటి ? నామటుకు నాకు , భగవంతుడు శిక్ష విధించడం కూడా ఒక విధంగా రక్షించడమే . రాముడు సంహరించిన రావణ , కుంభకర్ణాదులందరూ ముక్తిని పొందారని అందరికీ తెలిసిన విషయమే .
అనుకోకుండా ఆ మాటను రామచంద్రుడు పలికాడు . వాల్మీకి మహర్షి దానిని గ్రంధస్థం చేసారు .

ఏవం బ్రువాణౌ కాకుత్సౌ త్వరమాణౌ యుయుత్సయా 

సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ

యుధ్ధానికి సన్నిధ్ధమై , సమరోత్సాహంతో శత్రువుల ఆగమనం కోసం ఉవ్విళ్ళూర్తున్న రామలక్ష్మణులను ఆశ్రమ వాసులైన మునులు ప్రశంసించారు . ” నేటినుండీ ఆరు రాత్రులు యాగ రక్షణగావించమని ఆనతిచ్చారు . యాగదీక్ష వహించిన మహర్షి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడని  రామలక్ష్మణులకు   తెలిపారు .

Lord  Srirama approached  Viswamitra in all humility  and requested him ” revered sage ! please let us know how we can save the demons ” . These were words are rather surprising . Lord has come to Sidhdhasrama to kill the demons . He is now requesting the sage as to the  manner in which he can save these demons . ” In my opinion God  never punishes anybody , eventhough at the outset  some of his actions appear as punishing his opponents . Even God’s killing the demons is an act of protecting them  . For example Ravana after getting killed by the Lord attains heaven . So are the demons , who will have the good fortune of dying in the Lord’s hands are going to attain heaven . Thus Lord is protecting them from the miseries of hell . Hence , I believe the word “saMrakshneeyou ”  was inadvertently   spoken by Lord Rama as truth comes out first when we speak . Myriad are the miracles of God  and it is difficult / impossible for mere  mortals  to understand him .

 

 

 

రామాయణం

కుమారావపి తాం రాత్రిముషిత్వా సుసమాహితౌ
ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాముపాస్య చ

స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాస్య నియమేన చ
హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్ర మనందతాం

రాత్రిసమయం ఆశ్రమంలో సావధానం (విజిలంట్ ) గా గడిపారు రామలక్ష్మణులు . తెలవారగానే  లేచి ఆచమనం చేసి పవిత్రులైనారు . పిదప ప్రాతః సంధ్యావందనాన్ని పూర్తిగావించుకొని , నియమబధ్ధంగా  గాయత్రీ మంత్రాన్ని ఉపాసించారు . అటుపిదప ముకుళిత హస్తాలతో మహర్షి చెంత చేరి నమస్కరించారు .

యజ్ఞ దీక్షలో విశ్వామిత్ర ముని ప్రవేశించాక , మహర్షి రక్షణ భారం రామలక్ష్మణులది . ఆ బాధ్యతను శ్రధ్ధగా నిర్వర్తించారు . ప్రాతఃకాలంలో చేయవలసిన సంధ్యావందనాదులను చేసి , మహర్షి వద్దకు వెళ్ళారు . అగ్నిహోత్రం ముందర ఆశీనుడై కనిపించాడు మహర్షి .

After requesting sage Viswamitra to commence his rituals , Rama and lakshmana took the responsibility of protecting the sage and his ashram . They guarded the place with alacrity and vigilance in the night . No untoward incident has happened in the night . Early in the morning after performing sandhyavandana and reciting gayatri mantra , they approached maharshi for further guidance and information on the task ahead .
twenty ninth chapter of Balakanda concludes here .

రామాయణం

ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహాన్ ఋషిః
ప్రవివేశ తదా దీక్షాం నియతో నియతేంద్రియః

 

రామలక్ష్మణుల పలుకులు విని , ఇంద్రియాలను నిగ్రహించి , నియమబధ్ధంగా యజ్ఞ దీక్షను స్వీకరించాడు మహాతేజశ్శాలి విశ్వామిత్రుడు .
యజ్ఞ రక్షణ భారమంతా రామలక్ష్మణుల మీద వదిలేసాడు విశ్వామిత్రుడు . తన శిష్యుల సామర్థ్యం మీద అపారమైన నమ్మకం మహర్షికి . అందుకే యాగ రక్షణభారం వారికి వదిలేసి నిశ్చింతగా యజ్ఞాన్ని కొనసాగించాడానికి అవసరమిన ఇంద్రియనిగ్రహాన్నీ , ఇతర నియమాలనూ పాటిస్తూ యజ్ఞదీక్ష పుచ్చుకున్నాడు . ఏదైనా కార్యాన్ని సాధించుకోవాలంటే సమర్థులైన వారి సహాయం తీసుకోవాలి . వారిమీద నమ్మకం పెంపొందించుకోవాలి .

Viswamitra delegated the task of  protecting his yaaga from the rakshas to Rama and lakshmana , and took vow to contemplate and concentrate on conducting the yaaga as per procedures . He had total belief in his disciples and was sure of their capability  to destroy the demons as and when they attempt to spoil his ritual . Proper delegation is important to accomplish difficult and daunting tasks .

 

ముహూర్త మథ విశ్రాంతౌ రాజపుత్రా వరిందమౌ
ప్రాఞ్జలీ మునిశార్దూలమూచతూ రఘునందనౌ

అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపిఙ్గవ
సిధ్ధాశ్రమోయం సిధ్ధః స్యాత్సత్యమస్తు వచస్తవ

సిధ్ధాశ్రమాన్ని తన పాదాలతొ పావనం చేసిన రఘు రాముడు ముహూర్తకాలం విశ్రమించాడు . పిదప విశ్వామిత్రునకు అంజలి ఘటించి ” మహర్షీ తమరు ఈ దినమే యజ్ఞ్య దీక్ష స్వీకరించండి . తమకు భద్రమవుతుంది . ఇది సిధ్ధాశ్రమం . తమ సిధ్ధి ఫలిస్తుంది . సిధ్ధాశ్రమం పేరు సార్థక మవుతుంది . తమ వచనం సత్యమవుతుంది ” అని మంగళ కరమైన వాక్యాలు పలికారు .
ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మంగళకరమైన అలోచనలు మనసును కమ్ముకోవాలి . చేసే పని సమర్థవంతంగా చేయగలననే నమ్మకం ఉండాలి . పని చేయాలనే ఉత్సాహమూ , నేనున్నాను మీ కార్యక్రమం జయప్రదంగా ముగుస్తుంది ఇంకేమీ ఆలోచించకుండా శ్రీఘ్రంగా యాగం మొదలుపెట్టండని మహనీయుడైన మహర్షికి భరోసా ఇవ్వడం శ్రీరామునకు తన సామర్థ్యం మీద తనకు ఉన్న నమ్మకాన్ని మనకు తెలుపుతుంది .

 

When you commence a work , encouraging words  increase  your confidence . Lord sri rama is seen here , encouraging  sage  Viswamitra  with positive  words and assuring  him that he will succeed in his endeavors . He in fact requests the sage not to waste time and start his work immediately . The traits of a successful man are positive thinking and getting on with the job quickly  and not to rest till the task is accomplished . This to repeat is the recipe for success and should be imbibed .

 

 

రామాయణం

తం దృష్ట్వా మునయః సర్వే సిధ్ధాశ్రమ నివాసినః
ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయేన్
యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే
తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియాం
విశ్వామిత్రుని ఆగమనంతో ఆనందించిన ఆశ్రమవాసులు తేజోమూర్తులయిన ఆ మహనీయులకు స్వాగతం పలికి యథావిధిగా పూజించారు .
పెద్దలైన వారికీ , గృహానికి విచ్చేసిన అతిథులకూ  సముచితంగా స్వాగతం పలుకడం , పూజ చేయడం ,  భారతీయ ధర్మంలో భాగం .