Monthly Archives: సెప్టెంబర్ 2012

రామాయణం

యోగంధర  హరిద్రౌ  చ దైత్య  ప్రశమనౌ  తథా
సార్చిర్మాలీ  ధృతిర్మాలీ  వృత్తిమాన్  రుచిరస్తథా
పితృసౌమనసం    చైవ    విధూతమకరావుభౌ
కరవీరకరం  చైవ  ధనధాన్యౌ  చ రాఘవ

రాఘవా !  యోగంధరము , హరిద్రము , దైత్యము ,  ప్రశమనము ,  సార్చిర్మాలి , ధృతి , మాలి , వృత్తిమంతము , రుచిరము , పిత్రుసౌమనసము ,  విధూతము ,  మకరము , కరవీరము ధనము , ధాన్యము  అనే నామాలతో  వర్ధిల్లే  శక్తివంతాలైన  అస్త్రాలిక  నీవి .

కామరూపం  కామరుచిం మోహమావరణం  తథా
జృంభకం  సర్వనాభం  చ   సంతానవరణౌ  తథా
భృశాశ్వ  తనయాన్  రామ  భాస్వరాంకామరూపిణః
ప్రతీచ్చ  మమ భద్రం  తే  పాత్రభూతో సి  రాఘవ

వీటితో  బాటుగా  కామరూపము ,  కామరుచి , మోహము , ఆవరణము , జృంభకము ,  సర్వనాభము ,  సంతానము ,  వరణము , అనబడే   అస్త్రాలను  నావద్దనుండి  స్వీకరించు . శక్తివంతాలూ ,  దీప్తివంతాలూ అయిన  ఈ అస్త్రాలు  పొందడానికి నీవు  పాత్రుడవు . భద్రమస్తు (నీకు  మంగళమగుగాక ) అని   విశ్వామిత్రుడు  రామునితో  పలికాడు .

రామాయణం

లక్షాక్షవిషమౌ   చైవ   ధృఢనాభ    సునాభకౌ
దశాక్షశతవక్త్రౌ  చ  దశశీర్ష  శతోదరౌ

పద్మనాభ  మహానాభౌ  దుందునాభ సునాభకౌ
జ్యోతిషం   కృశనం   చైవ   నైరాశ్య   విమలావుభౌ

” లక్షాక్షము ,  విషమము ,  ధృఢనాభము ,   సునాభము ,  దశాక్షము ,  శతవక్త్రము , దశశీర్షము , శతోదరము ,  పద్మనాభము ,  మహానాభము , దుందునాభము ,  సునాభము ,  జ్యోతిషము ,  కృశనము ,  నైరాశ్యము , విమలము ” అనబడే  అస్త్రాలను  రాముని పరం చేసాడు మహర్షి  విశ్వామిత్రుడు . అంతతో  ఆ  మహాత్మునికి  సంతోషం  కలుగలేదు . ఇంకా కొన్ని  అస్త్రాలను  ఇవ్వాలనుకొన్నాడు . ఆ  అస్త్రాల పేర్లు  రేపటి  పోస్ట్ లో  పేర్కొంటాను .

రామాయణం

సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవచ
ప్రతిహారతరం నామ పరాఙ్ముఖ మవాఙ్ముఖం

శిష్యుడు నాకీ విద్య నేర్పించమని కోరితే సంతోషించని గురువెవరైనా ఉంటాడా ? అడిగిన ఉపసంహార విద్యలను ఇవ్వడమే కాకుండా అతిశక్తివంతమైన మరికొన్ని అస్త్రాలను రామునికి ధారాదత్తం చేసాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు . ఆ అస్త్రాలు భృశాశ్వమహర్షి కుమారులట . కామరూపాలు ధరించి శత్రువులను చీకాకు కలిగించే శక్తి కల ఆ అస్త్రాల పేర్లు
: సత్యవంతం , సత్యకీర్తి , ధృష్టం , రభసం , ప్రతిహారతరం , పరాఙ్ముఖం , అవాఙ్ముఖం .