Monthly Archives: అక్టోబర్ 2013

తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః
శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యాశతమభాషత

కుశనాభుని మాటలు విన్న తనయలు తండ్రి పాదాలను తమ శిరస్సుతో స్పృశించి పాదాభివందనం చేసారు . తమకు కలిగిన కష్టానికి కారణం చెప్పసాగారు .

నా అలోచనలు :

ఎంత కష్టంలో ఉన్నా తండ్రికి ప్రణామం చేయడం మరిచిపోలేదు కుశనాభుని కుమార్తెలు . అది భారతీయుల సంస్కారం .

तस्य तद् वचनम् श्रुत्वा कुशनाभस्य धीमतः
शिरोभिः चरणौ स्पृष्ट्वा कन्या शतम् अभाषत

Meaning :

The girls carefully listened King  KuSanaabha’s words . Then they  touched the feet of their father with forehead and started explaining the cause of their suffering .

My thoughts :

In spite feeling ashamed and undergoing  immeasurable  suffering the girls did not forget to pay respects to their father . Then they answered him in simple and crisp words which were to the point .

వాయుః సర్వాత్మకో రాజన్ ప్రధర్షయితు మిచ్ఛతి

అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే

పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛందే న వయం స్థితాః

పితరం వో వృణీష్వ త్వం యది నో దాస్యతే

తేన పాపాను బంధేన వచనం నప్రతీచ్ఛతా
ఏవం బ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశం

అర్థం :

సర్వవ్యాపి అయిన వాయుదేవుడు మమ్ములను అవమానింప దలచి చెడ్డ మార్గాన్ని ఎంచుకున్నాడు . ధర్మ మార్గాన్ని లెక్క చేయడం లేదు . ( తనను వివాహం చేసుకొనమని మమ్ములను అడిగాడు ) . ” నీకు భద్రమగు గాక ! మేము తండ్రి చాటు బిడ్డలము . వివాహ విషయంలో స్వతంత్రులము కాదు . మా తండ్రి గారు నీకిచ్చి వివాహం చేస్తారో లేదో కనుగొనమని చెప్పాము . పాపాత్ముడైనవాయువు మా మాటలను లెక్కచేయలేదు . అంతే కాక కోపించి ఈ విధంగా మమ్ములను పీడిస్తున్నాడు .” అని తండ్రికి తెలిపారు .

నా అలోచనలు :

ఆ కాలంలో పిల్లలు తండ్రి మాట జవదాటే వారు కాదు . తండ్రులు కూడా తమ పిల్లల బాగోగులు చక్కగా చూసుకొనే వారు . వివాహాది విషయాలలో పిల్లల అభిప్రాయానికి విలువ నిచ్చే వారు కూడా . ఉదాహరణకు స్వయంవరం ఏర్పాటు చేయడం . సాటి రాజులనాహ్వానించి వారిలో తన కిష్టమైన వారినెన్నుకొనమని కుమార్తెలకు చెప్పడం ఈ సంస్కృతిలోని భావమే . కన్యలకు కావలసినది రూపమే కదా !

కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా శ్రుతం
బాంధవా కులమిఛ్ఛంతి
మృష్టాన్నమితరే జనాః

తమకు కావలసిన వరుణ్ణి తలితండ్రుల అనుమతితో వివాహం చేసుకోవడం చక్కని ఫలితాలనిస్తుంది . వరుణ్ణి వెదుకుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు . ఒక కవి భావమే పై శ్లోకం . కన్య రూపాన్ని చూసి మురిసి పోతుందట . తల్లి వరుడి వద్ద ధనముందా లేదా అని ఆలోచిస్తుంది . ఇదీ ముఖ్యమే కదా ! తండ్రి వరుడు చదువుకున్నవాడా , శీల సంపద కలిగిన వాడా అని చూస్తాడట . నిజంగా ఇవి అన్నీ ఉన్నవాడు దొరికితే ఆ కుటుంబం ఆదర్శ కుటుంబమవుతుంది కదా !
ఏది ఏమైనా పిల్లల భావాలకు విలువ నిచ్చి వారికి నచ్చిన వారితో వివాహం జరిపించడం పెద్దల బాధ్యత .

वायुः सर्वात्मको राजन् प्रधर्षयितुम् इच्छति

अशुभम् मार्गम् आस्थाय न धर्मम् प्रत्यवेक्षते

पितृमत्यः स्म भद्रम् ते स्वच्छन्दे न वयम् स्थिताः

पितरम् नो वृणीष्व त्वम् यदि नो दास्यते तव

तेन पाप अनुबन्धेन वचनम् न प्रतीच्छता 
एवम् ब्रुवंत्यः सर्वाः स्म वायुना अभिहता भृषम् 

Meaning :

” Father ! All pervasive  Vayu God has requested us to marry him . We refused and informed him that we are not free to chose our husband .  We are bound to oblige our father and marry the person selected by him as that is the path of virtuousness . We requested him to ask you rather than us ” .  At this Vayu was enraged and decided to dishonour and disfigure us . He approached us inappropriately overlooking the correct conduct .

My Thoughts

This leads to a debate . Are arranged marriages better than love marriages , After all what is the sin committed by vayu . He only expressed his love . In Hindu culture the girls were given enough freedom to chose their husbands . At the same time parents were required to approve the match . Each one in the family looked from different angles before entering into an alliance . The final decision rests with either the girl or parents . Look at this poem

कन्या वरयते रूपम

माता वित्तं पिता श्रुतं

बान्धवा कुलमिच्छन्ति

मर्ष्टान्ना मितरा जनाः

Taking opinions from everybody but accepting the decision if elderly person is part of our culture . This in my opinion is a wise thing to do and leads to happiness of family  in a majority of cases .
The sin of  Vayu is not in asking the girls to marry but troubling them  when they refused to marry him . This is akin to throwing acid on the faces of the girls when they spurn the love of boys in today’s world . This is abhorrent and against the culture .

రామాయణం

తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః
ప్రవిశ్య సర్వ గాత్రాణి బభఞ్జ భగవాన్ ప్రభుః
తాః కన్యా వాయునా భగ్నా వివిశురంపతేర్గృహం
ప్రాపతన్ భువి సంభ్రాంతాః సలజ్జాః సాస్రలోచనా

కన్యలు నిరాకరించడం సహించలేక పోయాడు వాయుదేవుడు . ఆ కన్యల శరీరల్లోకి ప్రవేసించి వారి అవయవాలను దుర్బలం చేసాడు .వారి  అవయవాలు  కుచించుకు పోయి వారు  కుబ్జలైనారు . వాయుదేవుని ప్రవర్తనతో ఆ కన్యలు సిగ్గు పడ్డారు . తొట్రుపడుతూ రాజగృహంలోకి ప్రవేశించి కన్నీళ్ళు కార్చారు . బాధ భరించ లేక భూమి పడి ఏడ్చారు .

స చ తా దయితా దీనాః కన్యాః పరమ శోభనః
దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్
కిమిదం కథ్యతాం పుత్ర్యః కోధర్మమన్య్తే
కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టంత్యో నాభిభాషతః
ఏవం రాజా వినిఃస్వస్య సమాధిం సందధే తతః

 కుమార్తెల కొచ్చిన కష్టాన్ని చూచి చలించిపోయాడు కుశనాభుడు . పరమ శోభనులైన  తన కుమార్తెల దీన స్థితిని చూచి” మీరీ విధంగా  మారడానికి  కారణమేమని ప్రశ్నించాడు . మిమ్ములను ఎవరు అవమానిస్తున్నారు ? మిమ్ములను కుబ్జలుగా మార్చిన వాడెవడు ? మీరు ఎందుకు మాటలాడడం లేదు ? ” అని అడిగాడు .

 

स च ता दयिता भग्नाः कन्याः परम शोभनाः

दृष्ट्वा दीनाः तदा राजा संभ्रांत इदम् अब्रवीत्

किम् इदम् कथ्यताम् पुत्र्यः को धर्मम् अवमन्यते
कुब्जाः केन कृताः सर्वाः चेष्टन्त्यो न अभिभाषथ
एवम् राजा विनिःश्वस्य समाधिम् संदधे ततः

Meaning :

Refusal to accept his proposal angered god vayu . He entered the bodies of the girls and disfigured and dwarfed them . The girls returned to their palace crying and ashamed .

Kusanabha saw  the miserable condition of his beautiful  daughters   . Moved by the plight of his daughters he enquired ” Who turned you into midgets – my beautiful daughters . who humiliated integrity and uprightness of my children “. then he waited for reply from his daughters .

My thoughts : Vayu behaved like today’s deranged boys who tease the young and innocent girls calling it love and go to the extent of throwing acid to disfigure them . 

With this thirty second chapter of  balakanda concludes .

 

 

 

రామాయణం

మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినం
అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే
పితా హి ప్రభురస్మాకం పరమం దైవతం హి సః
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి
అర్థం :
” దుర్మేధా (చెడ్డ బుద్ధికలవాడా ) ! మాకు మా తండ్రియే దైవం . ఆతడే ప్రభువు . ఆ మహాత్ముడు ఎవరి చేతిలో పెడతాడో ఆతడే మా భర్త . సత్యవాది అయిన మా తండ్రి మాటను కాదని మేము స్వయంగా మా భర్తను ఎన్నుకోవడమనే కాలము , దురవస్థ ఎన్నటికీ రాకుండు గాక ” అని పలికారు .

నా అలోచనలు :

సత్య కాలమది . తలిదండ్రులంటే అత్యంతమైన గౌరవం ఆ కాలం వారికి . అన్ని విషయాలూ సమగ్రంగా పరిశీలించి తమ జీవితాన్ని ఆనందంగా కొనసాగించడానికి కావలసిన విధంగా తమ మాతపితరులు వ్యవహిరిస్తారనే నమ్మకం ఆకాలం వారికి . తమ భాగస్వామిని ఎన్నుకోవడంలో తండ్రి అదేశం వారికి శిలాశాసనం . ఇంకో విధంగా చేయడం పరమ పాపం వారి దృష్టిలో . తలిదండ్రులకు కూడా తమ సంతానం అభివృద్ధే పరమ ధ్యేయం ( ఈ కాలంలో కూడా ఈ మాటలు నిజం ) . కుటుంబంలో ఒకరికోసరం ఇంకొకరు ఆలోచించడం , జీవించడం చాలా అవసరం . అసలు కుటుంబ వ్యవస్థకు పునాది . అలా అని పెద్దలు తమ పిల్లల ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా ఉండేవారు కాదు . ఉదాహరణకు ” స్వయంవరం ” అన్న ఊహ ఆ కాలం వారిదే . పెద్దల సమక్షంలో తమ కిష్టమైన వారిని వారు ఎన్నుకోవచ్చు . ఉత్తములూ , తమకు దీటైన వారూ అయిన వారిని మాత్రమే స్వయంవరానికి ఆహ్వానించి , వారి శక్తి సామర్థ్యాలకో పరీక్ష పెట్టి తమ పిల్లలకు వారు సరియైన జోడీ అని నిశ్చయించుకొన్నాకే వివాహం చేసేవారా తలిదండ్రులు .
పెద్దల ప్రమేయం లేకుండా ప్రేమించి పెళ్ళి చేసుకోవడం తప్పేమీ కాదు . కానీ కన్నెపిల్లల బుద్ధి పరిపక్వం కాని వయసులో వారు పైపై మెరుగులకు మోసపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అవకాశాలు కొద్దిగా ఎక్కువ . అనుభవం ఎక్కువగా ఉన్న తలిదండ్రులకు ఆ బాధ్యత ఒప్పగించడం విజ్ఞత .

मा भूत् स कालो दुर्मेधः पितरम् सत्य वादिनम्
अवमन्यस्व स्व धर्मेण स्वयम् वरम् उपास्महे

पिता हि प्रभुर् अस्माकम् दैवतम् परमम् च सः
यस्य नो दास्यति पिता स नो भर्ता भविष्यति

Meaning :

Kushanabha’s daughters to the god of Wind  ” Oh ! you with evil mind . listen . We marry according to the wishes of our father . Let the time not come where in we have to chose life partner on our own . We marry  whomsoever our father wishes . He is the our Lord and God ” . 

My thoughts :

Hindus consider marriage is sacrosanct . It unites families , not just the bride and bride groom . Hence careful consideration is given before choosing a boy .     It was the duty of parents to look for a good match for their daughters . The parents are in better position to chose life partners partners for their daughters due to their experience and non emotional outlook . They  knew the antecedents of the boy  , his parents , his family and also made appropriate enquiries discretely before choosing the match . Generally such marriages used to continue for a life time and also family life flourished . Even today 75% are arranged marriages . In fact in earlier days in almost all cultures of the world arranged marriages were prevalent – whether it is China , Russia or Africa . Love marriage vs arranged marriage is an interesting subject with each one having its own merits and demerits .

తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్ఠ కర్మనః
అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్
అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ
ప్రభావజ్ఞాః స్మ తే సర్వాః కిమస్మానవమన్యసే
కుశనాభసుతాః సర్వాస్సమర్థాస్త్వాం సురోత్తమ
స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపోవయం .

అర్థం :

వాయుదేవుని అభ్యర్థన ఆ కన్యకలకు నచ్చలేదు . వాయువు ఏ పని అయినా అవలీలగా చేయగలడని వారికి తెలిసిన విషయమే . అయినా భయపడలేదు . వాయుదేవుని అపహాస్యం చేస్తూ ” సురోత్తమా ! సర్వప్రాణుల శరీరాలలో నీవు సంచరిస్తావు . నీ ప్రభావం మాకు తెలుసు . అయినా మమ్ములను ఈ విధంగా అవమానం చేయడానికి కారణమేమిటి . మేము కుశనాభుని కుమార్తెలము .  నీవు దేవతవైనా సరే , నీ ఉన్నత స్థానాన్నుండి నిన్ను దింపడానికి సామర్థ్యం కలవారం . మా తపస్సును పరి రక్షించుకోవడానికి ఆ విధంగా చేయడం లేదు .

तस्य तद् वचनम् श्रुत्वा वायोः अक्लिष्ट कर्मणः 

अपहास्य ततो वाक्यम् कन्या शतम् अथ अब्रवीत् 

अन्तः चरसि भूतानाम् सर्वेषाम् त्वम् सुर सत्तम 

प्रभावज्ञाः च ते सर्वाः किम् अर्थम् अवमन्यसे 

कुशनाभ सुताः देवम् समस्ता सुर सत्तम 
स्थानात् च्यावयितुम् देवम् रक्षामः तु तपो वयम्

Meaning :

The beautiful girls were not charmed by the sweet words of  Vayu .  They knew that the wind god was capable of taking revenge . That did not instil any fear in them . They replied , ” We are aware of the fact that you roam in every part of our body . We are also aware of your strength . But why are you insulting us . You should remember that we are the daughters of  king Kushanabha . We are powerful . Remember that even if you are god , because of our meditation and prayers we have acquired the capability to relegate you from your high position . We are not doing so in order to preserve the capabilities we acquired through long time penance and prayers .

My thoughts: The girls knew that to ward off evil , one has to be powerful and spell it out in unambiguous terms . They threatened even the mighty god of wind . Further all the girls of today should acquire powers ( Physical or otherwise ) to protect them from evil persons . Begging and pleading will not be of any use . This is a lesson we need to teach our progeny .

Strength — Physical , moral and spiritual is a  important  and absolutely essential .

 

రామాయణం

తాః సర్వగుణసంపన్నా రూపయౌవన సంయుతాః
దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్

అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ
మానుష్తస్య జ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ

చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః
అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ

ఆర్థం : 

అందమైన రూపం , అలరించే యవ్వనం , సద్గుణాలకు ఆలవాలం అయిన ఆ కన్యలను చూచిన వాయుదేవునికి వారి మీద మక్కువ కలిగింది . ” నేను మీమీద మనసు పడ్డాను . నన్ను వివాహం చేసుకుంటే మీకు మనుష్యత్వం పోతుంది . దేవతలవుతారు . దీర్ఘాయువు లభిస్తుంది . యౌవనం అస్థిరం . నన్ను పరిణయమాడితే మీకు శాశ్వతమైన యౌవనం లభిస్తుంది ” అని వారితో పలికాడు .

నా ఆలోచనలు :

అమ్మాయిలను చూస్తే ” బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు ” అని అన్నాడు కదా పోతన్న . ఇక వాయుదేవునికి తెగులు పుట్టకుండా ఉంటుందా ?తుచ్ఛమైన  కోరికలనుండి  దూరం కావాలంటే  భగవదనుగ్రహం  తప్ప  వేరే మార్గం లేదు .  రండి  ” శ్రీమన్నారాయణ  చరణౌ శరణం  ప్రపద్యే ” అని  భగవంతుని  వేడుకుందాం .

ताः सर्वगुण संपन्ना रूप यौवन संयुताः
दृष्ट्वा सर्वात्मको वायुर् इदम् वचनम् अब्रवीत्

अहम् वः कामये सर्वा भार्या मम भविष्यथ 
मानुषः त्यज्यताम् भावो दीर्घम् आयुर् अवाप्स्यथ

चलम् हि यौवनम् नित्यम् मानुषेषु विशेषतः
अक्षयम् यौवनम् प्राप्ता अमर्यः च भविष्य्थ 

Meaning :

” Beautiful to look at – young in age – sterling qualities ”  who can resist the temptation to marry such girls. Wind God Vayu fell for them , ” I like you all . Become my wives and  acquire divinity . youth is temporary and will fade with time . If you marry me  you will remain young and beautiful forever ” the God of wind pleaded .

My thoughts :

Even Gods are not exempt from getting  tempted by the beautiful young girls with spotless character  . This is their  way of saying ” I love you ” in the days of yore . They also try to lure girls with promises and goodies . They were direct in expressing their views . Are modern boys any different ? They get down on their knees to propose . God only can save us from this temptation and falling into abyss . Let’s chant  ” sreemannaaraayaNa charaNou SaraNam prapadyea ” .

This is a story told by sage Viswamitra to entertain the lord .

రామాయణం

కుశనాభస్తు రాజర్షిః కన్యా శతం అనుత్తమం 

జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన

తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలఙ్కృతాః 
ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహ్రదాః

గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః 
ఆమోదం పరమం జగ్ముర్వరా భరణభూషితాః

అథ తాశ్చారు సర్వాఙ్గ్యో రూపేణాప్రతిమా భువి 
ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాంతరే

అర్థం :
కుశనాభుడు రాజర్షి . ధర్మాత్ముడు . ఆతనికి ఘృతాచి అనే అప్సర స్త్రీ యందు వందమంది అత్యుత్తమమైన కన్యలు జనించారు . ఆ కన్యలు యుక్త వయస్కులైనారు . సౌందర్యవంతులైన ఆ కన్యకలు అందంగా అలంకరించుకొని , జ్యావల్లి లాగా ( మెరుపు తీగ లాగా ) ప్రకాశిస్తూ తమదైన ఉద్యాన వనంలో విహరించేవారు . మధురంగా గానం చేస్తూ , నృత్యంచేస్తూ , సంగీత వాద్యాలను వాయిస్తూ ఆనందంగా కాలం గడిపేవారు . అతి సుందరులు ఆ కన్యలు . భూలోకంలో  వారికి  సాటిరాగల  వారు  ఎవరూ  లేరు. నల్లని  మేఘమధ్యంలో   నక్షత్రం   ప్రకాశించే  విధంగా  వారు  ప్రకాశించారు .  అంటే  ఒక  మెరుపు  మెరిసే  వారన్నమాట .

నా అలోచనలు :

పూర్వకాలంలో ఏ విధమైన లోటులేని  అందమైన  ఆడపిల్లలు  ఏ  విధంగా  కాలం గడిపేవారో  ఈ  శ్లోకాలు  చక్కగా  వివరిస్తాయి .  షోడశ కళల్లో    పరిపూర్ణులై  ఉండేవారు . ఆటపాటల్లో   ఆనందంగా  కాలం  గడిపే  వారు . ఇప్పుడు  కూడా  డబ్బుగలవారింట  పుట్టిన  ఆడపిల్లలు చేసేపని  ఇదే  కదా ?

 

कुशनाभः तु राजर्षिः कन्या शतम् अनुत्तमम् 
जनयामास धर्मात्मा घृताच्याम् रघु नंदन 

ताः तु यौवन शालिन्यो रूपवत्यः स्वलंकृताः 
उद्यान भूमिम् आगंय प्रावृषि इव शतह्रदाः 

गायंत्यो नृत्यमानाः च वादयंत्यः च राघव 
आमोदम् परमम् जग्मुर् वर आभरण भूषिताः 

अथ ताः चारु सर्व अंग्यो रूपेण अप्रतिमा भुवि 
उद्यान भूमिम् आगंय तारा इव घन अन्तरे 

 

Meaning :

Kusanaabha was a kingly saint . Through a celestial maiden Ghratachi he begot hundred beautiful daughters . The girls came of age and gained proficiency in singing , dancing  and playing musical instruments  . Their pass time was to wear beautiful dresses adorned with jewels and play in their gardens . When they  moved in the garden they shone brilliantly like hundred lightning streaks of rainy season . No other girl on earth was comparable to them  beauty . They looked like stars amidst thick black clouds .

Thoughts :

1 .  Even today the girls from rich families like spending their time in fun and frolic . Most of these girls are trained in singing and classical dances . Nothing appears to have changed since the days of Ramayana . 

2 .  The kings used to marry celestial maidens who are known for their beauty . Naturally their off springs were also beautiful .

 

 

 

 

 

 

 

 

రామాయణం

కుశాంబస్తు మహా తేజాః కౌశాంబీమకరోత్పురీం 
కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయం
అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతిః 
చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజం

అర్థం :

మహాతేజశ్శాలి కుశాంబుడు .ఆతడు నిర్మించిన నగరం కౌశాంబి . ధర్మాత్ముడు కుశనాభుడు నిర్మించిన నగరం మహోదయపురం . అధూర్తజనుడు ధర్మారణ్యమనే నగరానికి రూపకల్పన చేయగా వసురాజు గిరివ్రజ పురాన్ని నిర్మించాడు .

 

ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః 

ఏతే శైలవరాః పఞ్చ ప్రకాశంతే సమంతతః
సుమాగధీ నదీ రమ్యా మగధాన్ విశ్రుతా యయౌ 
పఞ్చానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే
సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః 
పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్య మాలినీ

అర్థం :

మనం బస చేసిన ప్రదేశం వసువు యొక్క వసుమతి ( భూమి ) . ఈ ప్రదేశం చుట్టూ అయిదు పర్వతాలు శోభాయమానంగా వెలుగొందుతున్నాయి . మగధ దేశంలో పుట్టి రమ్యంగా ప్రవహిస్తూ అయిదు పర్వతాల మధ్యన , శోణానది ఒక పుష్పమాలికలాగా ప్రకాశిస్తున్నది . తూర్పు నుండి పశ్చిమంగా ప్రవహించే శోణానది పరీవాహక ప్రాంతాలలో సుక్షేత్రాలైన సస్యభూములున్నాయి . ఈ మాగధి కూడా (శోణా నది) వసు మహారాజు కు చెందినదే .

స్థల విశేషాలు :

వసురాజు నిర్మించిన గిరివ్రజ పురాన్నే ప్రస్తుతం ” రాజగృహ ” మనే పేరుతో పిలుస్తారు . గిరివ్రజమనే పేరు మహాభారత కాలంలో కూడా ఉండేది . ఇది జరాసంధుని దేశం . ఈ ప్రదేశంలోనే భీముదు , కృష్ణుని సహాయంతో జరాసంధుని వధించాడు . మగధ సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజధాని రాజగృహం . మౌర్యవంశం ఉద్భవించిన ప్రదేశమిదే . పచ్చని లోయలో , చుట్టూ ఉన్న పర్వతాలతో బహు రమణీయంగా కనిపిస్తుందీ గిరివ్రజ పురం కాదు కాదు రాజగృహం .

మన చరిత్ర సంస్కృతుల మీద అభిమానమున్నవారు తప్పక చూడాలి ఈ ప్రదేశాన్ని .

 

कुशाम्बः तु महातेजाः कौशांबीम् अकरोत् पुरीम्
कुशनाभः तु धर्मात्मा पुरम् चक्रे महोदयम् 

असूर्तरजसो राम धर्मारण्यम् महामतिः

चक्रे पुरवरम् राजा वसुर् नाम गिरिव्रजम् 

Meaning :

Prince  Kusamba built Kausambi and prince kushanabha built Mahodayapura . Dharmaranya was built by prince Adhurtajana and Prince Vasu built Girivraja . 

 

एषा वसुमती नाम वसोः तस्य महात्मनः 

एते शैलवराः पंच प्रकाशन्ते समंततः 

सुमागधी नदी रंया मागधान् विश्रुता आययौ 
पंचानाम् शैल मुख्यानाम् मध्ये माला इव शोभते 

सा एषा हि मागधी राम वसोः तस्य महात्मनः 

पूर्व अभिचरिता राम सुक्षेत्रा सस्य मालिनी 

Meaning :

Viswamitra continued  ” The land where we are presently camping , belongs to Prince VAsu . It is surrounded by  five magnificient hills . After taking birth in Magadha ( present day Madhya Pradesh ) , river Sone flows in between these hills . It adorns these hills like a garland of flowers .

Reflections :

The river Sone takes birth in Amarkantak hills in Madhya Pradesh . It flows in north west direction , parallel to the hills of Kaimur range  and  travels through present day Uttar Pradesh , Jharkhand , and Bihar . Near Patna it joins Ganges . Viswamitra describes the place accurately . According to history  Ancient Kausambi  was on the Jamuna river- about 35 miles south-west of Allahabad . To know and describe the geographical locations precisely in the good old days is no mean task . 

King Vasu’s Girivrajapura is today’s Rajgir . It was ruled by King Jarasandha , whom Bhima  killed with the help of Lord Krishna . It is also a seat of budhdhism and reportedly one of the favourite places of Gautama the budhdha . Even today one can visit Vishwasanti stupa , one of the eighty peace pagodas of the world . It is located in a green valley surrounded by beautiful hills . This also the capital city of Magadh kings and Mourya kings ( King Ashoka is from this clan ) . Fahian and Xuanzang , two wellknown chinese scholars visited this place . Even the jaina mahavira is associated with this place .

This being a religious place and also a historical place apart from being beautiful should be included in a tourist itinerary .

 

 

 

రామాయణం

దీప్తి యుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మ చికీర్షయా
తానువాచ కుశః పుత్రాన్ ధర్మిష్టాన్ సత్యవాదినః

క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలం
ఋషేస్తు వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః

నివేశమ్మ్ చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా

అర్థం :

క్షత్రియ ధర్మాన్ని అనుసరించాలనే కోరికతో ఉన్నవారూ , ప్రకాశంతో వెలిగిపోతున్న వారూ , మహా ఉత్సాహం కలవారూ , సత్య ధర్మ నిరతులూ అయిన తన పుత్రులతో కుశమహారాజు ” కుమారులారా ! రాజ్యాన్ని పరి పాలించండి . మీరు పుష్కలంగా ధర్మాన్ని పొందగలరు ” అని ఆనతిచ్చాడు . ఋషివంటి తండ్రి మాటప్రకారం , నలుగురు రాజకుమారులూ నాలుగు పట్టణాలను నిర్మించారు .

నా అలోచనలు : 

తండ్రి  మాట ప్రకారం  నడుచుకోవడం  హిందువుల సంస్కృతి . తల్లీ , తండ్రీ , గురువు  ముగ్గురూ  తమఅభివృద్ధి కంటే  తమ పిల్లల  అభివృద్ధి  నే ఎక్కువగా కోరుతారు . ఇది  లోక సహజం .   అటువంటి   వారి  మాటలను  జవదాటరు  వారి  పిల్లలు . రాజ్యాలను  ఏర్పాటు  చేసుకోమని తండ్రి  ఆనతిచ్చే  వరకూ  ఆగారు  బుధ్ధికుశలులైన   కుశ   మహారాజు పుత్రులు . 

 

दीप्ति युक्तान् महोत्साहान् क्षत्रधर्म चिकीर्षया 

तान् उवाच कुशः पुत्रान् धर्मिष्ठान् सत्यवादिनः 

क्रियताम् पालनम् पुत्रा धर्म प्राप्यथ पुष्कलम

 कुशस्य वचनम् श्रुत्वा चत्वारो लोक सत्तमाः

निवेशम् चक्रिरे सर्वे पुराणाम् नृ वराः तदा 

 

Meaning :

King kusa had an aspiration that his brilliant ,enthusiastic , truthful and law abiding sons will be able to provide a just rule . He told them  ” Establish your own kingdoms and rule them justly . Achieve abundant dharma (righteousness ) “. The dutiful sons established four kingdoms .

Reflections :

In good old days the sons used start living on their own , only after being permitted by their father . It is believed that only mother , father and the teacher place the interests of the children above their own interest . Respecting parents and teachers is part of culture .