Monthly Archives: డిసెంబర్ 2015

రామాయణం

కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీం
అక్షౌహిణీపరివృతః పరిచక్రామ మేదినీం

నగరాణి  సరాష్ట్రాణి  సరితశ్చ  తథా  గిరీన్
ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామ హ

వసిష్ఠ స్యాశ్రమపదం నానావృక్షసమాకులం
నానామృగ గణాకీర్ణం సిద్ధచారణ సేవితం

దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితం
ప్రశాంతహరిణాకీర్ణం ద్విజసంఘ నిషేవితం

మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు ఒక అక్షౌహిణి సంఖ్యలో ఉన్న పరివారాన్ని సమకూర్చుకొని దేశ సంచారానికి బయలుదేరాడు . నగరాలు , నదీ ప్రదేశాలు , మున్యాశ్రమాలు దర్శిస్తూ వసిష్ట మహర్షి ఆశ్రమాన్ని చేరాడు .ఆ ఆశ్రమం , వివిధ వృక్షాలతో , మృగాలతో , పక్షులతో నిండి శోభాయమానంగా ఉంది . దేవ దానవ గంధర్వ కిన్నరులతో , ప్రశాంతాన్ని ప్రసాదించే జింకలతో ఆ ప్రదేశం అలరారుతూ ఉంది

IMG_7981

రామాయణం

 

కుశనాభ సుతస్త్వా సీద్గాధిరిత్యేవ విశ్రుతః

గాధేః పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహామునిః
విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీం

బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్

బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు . కుశుని కుమారుడు కుశనాభుడు . ఆతని పుత్రుడు గాధి . అమిత తేజశ్శాలి విశ్వామిత్రుడు గాధి కుమారుడు . రాజైన పిదప వేలకొలది సంవత్సరాలు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు .

విశ్వామిత్రుని గాధలు మనోరంజకాలు . ఆ మహాత్ముడు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు . కష్టాలు కలిగినప్పుడు చలించలేదు . ద్విగుణీకృతోస్థాహంతో తన ప్రయత్నాన్ని కొనసాగించి విజయాన్ని సాధించాడు . ఆ మహాత్ముని గాధలను రాముడికి వివరంగా చెబుతున్నాడు శతానందుడు .

 

IMG_7999.JPG