Monthly Archives: ఆగస్ట్ 2014

రామాయణం

తస్యశ్వచర్యాం కాకుత్స్థ దృఢధన్వా మహారథః
అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః
తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః
రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్

తాత సగరుడు యజ్ఞాశ్వానికి రక్షణగా వెళ్ళమని అంశుమంతుని కోరాడు . మహారథుడు అంశుమంతుడు దృఢమైన ధనువును ధరించి యజ్ఞ్యాశ్వానికి రక్షణగా దాని వెనకనే వెళ్ళాడు . కానీ రాక్షస రూపాన్ని ధరించి సగరుని యజ్ఞాశ్వాన్ని నేర్పుగా దొంగిలించాడు ఇంద్రుడు .

హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్నశ్వే మహాత్మనః
ఉపాధ్యాయగణాః సర్వే యజమాన మథాబ్రువన్
అయం పర్వణి వేగేన యజ్ఞీ యాశ్వోపనీయతే
హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవోపనీయతాం

యజ్ఞచ్ఛిద్రం భవత్యేతత్సర్వేషామశివాయ నః
తత్తథా క్రియతాం రాజన్ యథాచ్ఛిద్రః క్రతుర్భవేత్

యజ్ఞాశ్వం మాయమవడాన్ని కనిపెట్టిన ఋత్విక్కులు  ” కాకుత్స్థ చక్రవర్తీ ! యజ్ఞాశ్వాన్ని ఎవరో అపహరించి తమతో తీసుకొని వెడుతున్నారు . దొంగిలించిన వాడిని మట్టు పెట్టి అశ్వాన్ని తీసుకొని రావాలి . అలా చేయకపొతే అమంగళం , మనందరికీ అనర్థం . ఈ అపచారం కలుగకుండా చూడవలసింది ” అని సవినయంగా పలికారు .

( మహాభారత కథనం ప్రకారం సగరుడు తన అరువదివేల మంది పుత్రులను యజ్ఞాశ్వానికి రక్షణగా వెళ్ళమని చెప్పినట్టు ఉంది . రామాయణంలో అంశుమంతుడు అశ్వరక్షకుడుగా ఉన్నట్లు చెప్పబడింది . సగరుడు ఇంద్రపదవికోసం అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడేమోనన్న అపోహతో యజ్ఞభంగానికి పూనుకున్నాడు ఇంద్రుడు . మహాభారత కథనమే సరైనదేమో అని నా అనుమానం ) .

విశ్వామిత్రస్తు కాకుత్సమువాచ ప్రహసన్నివ
శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః

 

కుతూహలంతో కథను వినడానికి కదలకుండా కూర్చున్న రఘురాముణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు కౌశికుడు . సరే సగరుని కథ వివరంగా చెబుతాను శ్రధ్ధగా వినమని పలికి కథ చెప్పడానికి ఉపక్రమించాడు కథలు చెప్పడంలో దిట్టయైన విశ్వామిత్రుడు .
శఙ్కరశ్వశురో నామ హిమవానచలోత్తమః
వింధ్య పర్వత మాసాద్య నిరీక్షేతే పరస్పరం
తయోర్మధ్యే ప్రవృత్తో భూదజ్ఞ స్స పురుషోత్తమ
స హి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి

రామా ! సగర మహర్షి యాగాన్ని చేయడానికి హిమాలయాలకూ , వింధ్య పర్వతానికీ ఉన్న స్థలాన్ని ఎంచుకున్నాడు . యజ్ఞం చేయడానికి ఆ ప్రదేశం అన్నివిధాలా అనుకూలం , ప్రశస్తం .

Note :The  Vindhyas extend to Gujarat in the west and modern Uttar Pradesh and Bihar in the east .According to public lore the vindhyas divide North and South India .

DSC04083