Monthly Archives: జూన్ 2013

రామాయణం

ప్రవిశన్నాశ్రమపదం   వ్యరోచత  మహామునిః
శశీవ  గతనీహారః  పునర్వసు   సమఞ్చితః

పుణ్యుడు  రామచంద్రుడు  ముదంతో   ఆశ్రమ  ప్రవేశం చేసాడు .  మహాముని   విశ్వామిత్రుడు ,  మంచు తొలగినపుడు  కనిపించే ,  పునర్వసు నక్షత్రంతో  కూడిన  చంద్రుని  లాగా  భాసించాడు .

మంచు తొలగిన సమయంలో  మహా శోభాయమానంగా  వెలుగుతాడు    పునర్వసు  నక్షత్రంతో కూడిన చంద్రుడు . అంతకంటే  మిరుమిట్ట్లు  గొలుపుతూ  కనిపించాడు  ,  రామలక్ష్మణులతో  సిధ్ధాశ్రమంలోని    తన    ఆశ్రమప్రవేశం చేసిన   మహాముని    విశ్వామిత్రుడు — ఆశ్రమవాసుల  నేత్రాలకు .

పునర్వసు నక్షత్రం ” జెమిని ”  కాన్స్టిలేషన్ ”  లో  “కాస్టర్ ” ,  “పొలక్స్ ” అనబడుతూ  , ఉజ్వలంగా  ప్రకాసించే  రెండు  తారల  సమూహం . వేల సంవత్సరాల క్రితం ,   లక్ష్మణ  రామచంద్రులను  ఈ  రెండు తారలతో  పోల్చడం వాల్మీకి  మహర్షి  మహర్షి   ఖగోళ  జ్ఞానానికి  తార్కాణం , పృకృతిని  నిశితంగా  పరిశీలించి , సంపాదించిన   జ్ఞానాన్ని అలతి పదాలలో , అందమైన  శ్లోక    రూపంలో  భావితరానికందించిన  మహర్షికి   కృతజ్ఞతలు  .

Gemini (constellation) map showingCastor and Pollux stars .

పునర్వసు  నక్షత్రం  శ్రీరాముని  జన్మ నక్షత్రం . పునర్వసు  అంటే  పునః ,వసు ( వసించడానికి  మళ్ళీ  తిరిగి  రావడమని ) . అవసరమైనప్పుడు  దివి నుండి  భువికి  రావడం అవతారమూర్తి  ( భగవంతుని ) లీలలో ఒక భాగం . ఆతడు  లీలామానుష విగ్రహుడు  కదా .

రామాయణం

తేనైష    పూర్వమాక్రాంత  ఆశ్రమః  శ్రమనాశనః
మయాపి  భక్త్యా  తస్యైష వామనస్యోపభుజ్యతే
ఏతమాశ్రమమాయాంతి   రాక్షసా  విఘ్నకారిణః
అత్రైవ  పురుష  వ్యాఘ్ర  హంతవ్యా  దుష్ట చారిణః
అద్య గచ్ఛామహే  రామ సిధ్ధాశ్రమమనుత్తమం
తదాశ్రమపదం  తాత  తవాప్యే   తద్యథా  మమ .

విశ్వామిత్రుడు  రామునికి  వామనమూర్తి  వృత్తాంతాన్ని  తెలిపిన పిదప  ”  రామా !  శ్రమను ( అలసట , కష్టం )  తొలగించే ఈ ఆశ్రమంలో  వామనుడు  నివశించేవాడు  . ఆ  మహనీయుని  మీద  అపారమైన  భక్తి  కలిగిన నేను , ప్రస్తుతం  ఈ  ఆశ్రమంలో  నివసిస్తున్నాను .  యజ్ఞాలను  ధ్వంసం  చేసే   రాక్షసులు ఈ  ఆశ్రమానికే  వచ్చి నా  యాగాలకు  విఘ్నాలను  కలిగిస్తున్నారు . నీవు   వారిని  సంహరించవలసిన స్థలమిదే . నాయనా !  ఈ  ఆశ్రమంలో  ప్రవేశించు . ఈ ఆశ్రమం  నాకెలాగు స్వంతమో  నీకూ  అలాగే  స్వంతం  . ( పూర్వం  వామనావతారమెత్తినప్పుడు  ఈ  ఆశ్రమం  నీదే కదా )  అని రామునికి  తెలిపాడు .

మందార మకరంద మాధుర్యమున దేలు  మధుపంబువోవునే మధుపములకు ? నిర్మల

మందార మకరంద మాధుర్యమున దేలు  మధుపంబువోవునే మధుపములకు ?
నిర్మల మందాకినీ  వీచికల దూగు రాయంచ  సనునె తరంగిణులకు ?
లలిత రసాల  పల్లవ ఖాదియై  చొక్కు  కోయిల చేరునే  కుటజములకు ?
బూర్ణేందు  చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నీహారములకు ?

నంబుజోదరు  దివ్య పాదారవింద  , చింతనామృత  పాన విశేష మత్త
చిత్త మేరీతి  జేర నేర్చు  ? వినుత  గుణశీల  మాటలు  వేయు నేల ?

ఈ  పద్యం నోటికి  రానివాడు  తెలుగు  వాడే కాదు . పద్యానికి అర్థం చెప్పవలసిన  అవసరం  ఉంటుందని  నాకనిపించడం  లేదు . అంతా  అవగతమే . ఈ  పద్యాన్ని  చదివిన  వాడి  హృదయం  భగవంతుడి    చరణారవిందాలకు  అర్పితమమై పోతుంది . నిజంగానే  పోతన చెప్పినట్లు  వేరే మాటలెందుకు .  మీరుకూడా భగవంతుని  భావనలో మత్తులై  ,  చిత్తాన్ని  ఆ  మహాత్ముని దివ్య  పాదారవిందాల  వద్దకు చేర్చండి . ధన్యోస్మి .

Will a honey bee enjoying the taste of honey from a hibiscus mandara flower go and taste honey from other flowers ? wIll  a swan swaying in the calm , serene and gentle waves of Mandakini  river  likes to sway on the rough and surging waves  of other rivers ?  would a Koyel bird busy in enjoying the taste of tender mango leaves likes  taste other leaves ? similarly  the mind of a devotee which is immersed in the thoughts of  God  cannot think of worldly things or enjoy the worldly pleasures .